Others

నోటి రంధ్రానికి సైనస్‌కు సంబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢా. రమేష్ శ్రీరంగం,
సర్జన్, ఫేస్ క్లినిక్స్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్
**

ఓసారి ఓ బాధితుడు వచ్చాడు. తన సమస్య ఏంటంటే, తను నాలుగు నెలల క్రితం తన పైకుడి దవడ పన్ను పుచ్చు వచ్చి నొప్పేస్తూంటే దానిని పీకించేసుకున్నాడు. నాలుగు నెలలు అయింది. పన్ను పోయింది కాని సమస్య పోలేదు కదా, ఇంకా పెద్దదయింది. పన్ను తీసేసిన చోట గాయం మానలేదు. అక్కడ ఓ రంధ్రంలా ఏర్పడింది. నోట్లోంచి నీళ్ళుతాగితే ఆ రంధ్రం ద్వారా అవి ముక్కులోంచి వచ్చేస్తున్నాయి. ఈ మధ్యకాలంగా చీము కూడా వస్తున్నది అక్కడ్నించి. దాని మూలాన దుర్వాసన. తెలంగాణ భాషలో చెప్పాలంటే ‘చాలా పరేషాన్‌లో ఉండే అతను’. ‘‘ఏంది సార్ నాకీ తలనొప్పి. మస్తు పరేషాన్ చేస్తున్నది. ఎందుకు పన్ను తీయించుకున్నానని బాధపడని రోజు లేదు. ఏదైనా చేయి సారు’’ అని బాధపడ్డాడు. ‘‘పరేషాను కాకు తమీ, మంచిగైపోతాది’’ అని భరోసా ఇచ్చి, చికిత్స చేసా. ఆ రంధ్రం పూడుకుపోయింది. పైదవడ పన్ను తీసాక ఆ గాయం మానక రంధ్రంలా ఏర్పడితే దానిని ఓరో ఆంట్రల్ ఫిస్టులా (్జ్గ్జ గోజ నిడశ్రీజ) అంటారు. అంటే నోటికీ, పైదవడ మీద నుండే సైనస్‌కి మధ్య సంబంధం ఏర్పడటం.
పైదవడ పళ్ల మీద సైనస్ వుంటుంది ఇరువైపులా. ఈ దవడ పన్నుకి, సైనస్‌కి మధ్య ఎముక ఉంటుంది. ఏ కారణం చేతనైనా ఆ ఎముక చచ్చిపోయినా లేక విరిగిపోయినా లేక చిల్లుపడినా, సైనస్‌ని అంటి ఉండే పొరకి కూడా గాయం అయినా అప్పుడు దవడ పన్ను స్థలానికి మరియు సైనస్‌కి మధ్యన సంబంధం ఏర్పడుతుంది. ఏ కారణం చేతనైనా ఆ పన్ను తీసినప్పుడు అక్కడ గాయం మానకపోయినా లేక వేరే ఏ ఆపరేషన్ అక్కడ చేసి ఆ గాయం మానకపోయినా అది ఓ రంధ్రంలా మారి నోటికీ, సైనస్‌కీ మధ్య సంబంధం ఏర్పడటానికి కారణమవుతుంది.
పన్ను తీసిన ఏ సందర్భంలో ఇలా కావచ్చు
పన్ను తీసే ప్రక్రియ తప్పుగా ఉన్నా
పన్ను రూట్‌భాగం (లోని భాగం) విరిగి సైనస్‌లోకి జారిపోయినా
పన్నులో సంక్రమణ ఎక్కువగా ఉన్నా
పన్ను తీసాక వైద్యుడు చెప్పిన సూచనలు సరిగా పాటించకపోయినా ఈ రంధ్రం ఏర్పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వేరే కారణాలు
పైదవడ వెనుక భాగానికి దెబ్బతగిలి ఆ గాయం మానకపోయినా
తిత్తి (సిస్ట్) లేక గడ్డ తీసే ఆపరేషన్ గాయం సరిగా మానకపోయినా అక్కడ ఈ ఫిస్టులా ఏర్పడేందుకు అవకాశం ఎక్కువ.
గాయం మానకపోవడానికి గల కారణాలు
పన్ను తీశాక గాని/ ఆపరేషన్ తరువాత కాని సిగిరెట్ కాల్చడం
తుమ్మినపుడు మూతిని మరియు ముక్కుని గుడ్డ ద్వారా లేదా చేయి పెట్టి మూసివెయ్యడం చేయకూడదు (నోరు తెరచి తుమ్మే ప్రయత్నం చేయాలి).
సాధారణంగా గాయం అయిన చోట రక్తం గడ్డకడుతుంది. ఆ రక్తపు గడ్డలో కొత్త రక్తకణాలు ఏర్పడి గాయం పురుకుంటుంది. ఏ కారణం చేతైనా ఆ రక్తం గడ్డ జారిపోయినా లేక సంక్రమణ వ్యాపించినా ఆ గాయం మానదు.
వారిలో నీళ్ళు తాగితే ముక్కులోంచి ఎందుకు వస్తాయి
ఏర్పడిన రంధ్రం నోటికి మరియు సైనస్‌కి సంబంధాన్ని ఏర్పాటుచేస్తుంది. సైనస్ ముక్కులోకి తెరచుకుంటుంది. అంటే నోట్లోంచి దారి సైనస్‌కి ఏర్పడి అక్కడ్నించి ముక్కులోకి ప్రవేశించి బయటకు వస్తుంది.
వీరిలో చికిత్స
సమయాన్నిబట్టి వారిలో చికిత్స మారుతుంది. రంధ్రం ఏర్పడి కొన్ని రోజులే అయితే అప్పుడు మందుల ద్వారా ఆ రంధ్రాన్ని శుభ్రపరచి, చిగుళ్లని దగ్గరికి తెచ్చి కుట్టే ప్రయత్నం చేస్తారు. సాధారణంగా చాలా మందిలో ఈ విధానం మంచి ఫలితాల్నే ఇస్తుంది. రంధ్రం ఏర్పడి కొన్ని వారాలైనా; రెండు- ఒకసారి చిగుళ్లు దగ్గరకు తెచ్చి కుట్టిన తర్వాత కుట్లు విడిపోయినా; మూడు- రంధ్రం నుంచి చీము కారుతున్నా అప్పుడు చికిత్సా విధానం మారుతుంది.
వీరిలో నోట్లో ఉండే లాలాజలం రంధ్రం ద్వారా సైనస్‌లోకి చేరి అక్కడ సంక్రమణ కలిగించే ప్రమాదం ఉంది. అందుకే సిటీ స్కాన్ చేసి సైనస్‌లో సంక్రమణ ఉందా లేదా నిర్థారించుకోవాలి (సైనుసైటిస్). సైనస్‌లో సంక్రమణ ఉన్నవారిలో చర్మం లేక చిగుళ్ల సహాయంతో రంధ్రాన్ని మూసే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే కుట్లు విడిపోతాయి. మందుల ద్వారా మరియు ఎక్కువగా సైనసైటిస్ ఉన్నవారిలో ముక్కులో చిన్న రంధ్రం చేసి ముందు సైనస్‌లోని సంక్రమణని తగ్గించే ప్రయత్నం చేయాలి. సైనస్‌లోని ఇన్‌ఫెక్షన్ పూర్తిగా తగ్గాక అప్పుడు దగ్గరలో ఉన్న చర్మాన్ని కోసి ఆ రంధ్రం దగ్గర పెట్టి కుట్టే ప్రయత్నం చేస్తారు.

-ఢా. రమేష్ శ్రీరంగం, సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com