Others

నిగనిగలాడే కురుల కోసం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆముదం అంటేనే నేటి ఆధునిక కాలంలో చాలామందికి ఎలర్జీ. ఆముదం తాగిన మొహంలా పెట్టావని కూడా అంటారు. కాని ఈ ఆముదం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయ. జుట్టు పొడవుగా, మందంగా పెరగటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, జన్యుపర లోపం వలన అనారోగ్యకర ప్రణాళికలను పాటించే వారిలో ఒత్తిడి, మానసిక కారణాల జీవనశైలిలో లోపంవలన కలిగే బట్టతలను తగ్గించేందుకు చికిత్సగా కూడా వాడతారు. పొడి జుట్టుకు కావాల్సిన పోషకాలను అందించి ప్రకాశవంతంగా కనపడేలా చేస్తుంది. ప్రకాశవంతంగా మార్చి, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.తలపై చర్మం పొడిగా మారటాన్ని నివారిస్తుంది.ఆముదాన్ని ఆహార తయారీలో వాడటంవలన జుట్టు రాలటం తగ్గి, వత్తుగా మారుతుంది.
ఆముదాన్ని ఇలా వాడండి...
చేతివేళ్ళ కొనల సహాయంతో నాణ్యమైన క్యాస్టర్ ఆయిల్‌ను వెంట్రుకల మొదళ్ళనుండి చివరివరకు అప్లైచేయండి. తరువాత, ప్లాస్టిక్ క్యాప్‌తో కప్పండి లేదా టవల్‌తోచుట్టి ఉంచండి. ఇలా ఆయిల్ 15నుండి 20 నిమిషాలపాటు ఉంచండి లేదా పూర్తి రాత్రివరకు అలానే ఉంచండి. తరువాత మంచి షాంపూతో జుట్టును కడిగి వేయండి. ఇలా 8 వారాలపాటూ, వారానికి ఒకసారి చేసి ఫలితాలను గమనించండి. కేవలం ఆ మాత్రమేకాకుండా, దీనిని ఇతర నూనెలు అనగా ఆలివ్ ఆయిల్, గ్రేప్ సీడ్ లేదా కొబ్బరి నూనెలో కలిపి కూడా వాడవచ్చు. ఇతర ఆయిల్‌లతో జోడించి వాడటంవలన మంచి ఫలితాలను పొందటమే కాకుండా, క్యాస్టర్ ఆయిల్ మందపాటి అనుగుణ్యతను తేలికగా చేస్తాయి.వైద్యుడిని కలిసి, జుట్టు పెరుగుదలకు కావల్సిన విటమిన్‌లను కలిగి ఉన్న ఉప భాగాలను కూడా వాడండి. సరైన సమయంపాటూ విశ్రాంతి, రోజు వ్యాయామాలు, ఒత్తిడి అధిగమించే ధ్యానం వంటి వాటిని అనుసరించటంవలన జుట్టు పొడవుగా, మందంగా బలంగా ఉంటుంది. మీ జుట్టు పలుచగా మారినట్టు అనిపిస్తే అద్దంలో చెక్ చేసుకోండి. ఇన్ని రకాలుగా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆముదాన్ని వాడి, మంచి అందమైన శిరోజాలను పొందండి.