Others

పవన్ నుంచి నేర్చుకున్నా(డైరెక్టర్స్ చాయిస్..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు కె దయానంద్
..అలియాస్ జానకి చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, కొంత గ్యాప్ తరువాత బుల్లితెర నటుడు సాగర్‌ను హీరోగా లాంచ్ చేస్తూ ‘సిద్ధార్థ్’ సినిమాతో మరోసారి దర్శకుడిగా వచ్చాడు దయానంద్. సిద్ధార్ధ్‌తో పెద్ద ప్రాజెక్టులను సైతం డీల్ చేయగలడన్న నమ్మకాన్ని సంపాదించుకున్న దయానంద్‌తో చిట్‌చాట్..

జర్నీ ఎలా మొదలైంది?
1995లో నటుడిగా పరిశ్రమకు వచ్చాను. 1996 నుంచీ అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేశా. తరువాత ‘బద్రి’ టైంలో పవన్ కళ్యాణ్‌తో పరిచయమై పనె్నండేళ్లు ఆయన క్రియేటివ్ టీమ్‌లో వర్క్ చేశా. ఒకరకంగా చెప్పాలంటే నాలో ఉన్న దర్శకుడిని బయటకు తీసి డైరెక్షన్ వైపునకు తీసుకొచ్చింది ఆయనే.
ఫస్ట్ సినిమా ఛాన్స్?
పవన్‌కళ్యాణ్ పంజా ప్రాజెక్టుకి వర్క్ చేసేటప్పుడు సొంతంగా సినిమా చేద్దామనుకున్నా. ఆ సమయంలోనే నీలిమా తిరుమలశెట్టి కలిశారు. అలా ఆమెకు చెప్పిన కథ నచ్చటంతో... అలియాజ్ జానకి వచ్చింది.
గ్యాప్ ఎక్కువైంది?
ఒకసారి సాగర్ నన్ను కలిసి రామదూత క్రియేషన్స్ వాళ్లు కొత్త సినిమా చేస్తున్నారని చెప్పాడు. అప్పుడు నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌ను కలిసి కథ వినగానే నచ్చి చేస్తానన్నాను. ఈ సినిమా కథ, సాగర్ బాడీ లాంగ్వేజ్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటుందనిపించింది. పైగా అతను బాగా కష్టపడతాడు. మొదటి నుంచి సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అతనైతే ప్రాజెక్టుకి ప్లస్ అవుతాడనిపించి హీరోగా నిర్ణయించాం.
ఆశించిన ఫలితం అందలేదుగా?
కమర్షియల్‌గా ఆలోచిస్తే కరెక్టే. కానీ దర్శకుడిగా నాకు, హీరోగా సాగర్‌కు పేరు తెచ్చింది.
పవన్‌తో సినిమా చేసే ఛాన్స్?
ఖచ్చితంగా. ఆయన అవకాశమిస్తే చేస్తా. ఆయన సన్నిహితంగా మెలిగే వాళ్లలో నేనూ ఒకడిని. సినిమా చేస్తానంటే నేను చెప్పే కథ వింటారు. ఆ తరువాత నచ్చడం, నచ్చకపోవడం మన చేతుల్లో లేదుగా.
తరువాతి ప్రాజెక్టులు?
కథలున్నాయ్. కొన్ని చర్చల దశ దాటాయి. త్వరలోనే చెబుతా.

-శ్రీ