Others

అభిమాని పిలిచె..(శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు-
అభిమాన ప్రేక్షకుల మనసుల్లో ఆరాధ్య నటీనటులపై చెప్పలేనంత ప్రేమ ఉండేది. తను ఆరాధించే నటుడినో/ నటినో కలవాలని, ఆటోగ్రాఫ్‌తో కూడిన ఫొటో తీసుకోవాలన్న కోరిక గుండెల్లో గూడుకట్టుకుని ఉండేది. ఆరాధ్య నటీనటులపై అప్పటి ఫ్యాన్స్ ప్రేమ ఎలా ఉండేదో చూడాలంటే -దేవత చిత్రంలో పద్మనాభం పాల్గొన్న కొన్ని సన్నివేశాలు గుర్తు చేసుకోవచ్చు. ఆ దృశ్యాలను చిత్రకథలో సన్నివేశంగా జత కలపటానికి ముఖ్య కారణం -పద్మనాభం వీరాభిమాని, పలు అభిమాన సంస్థల నిర్వాహకుడు అయిన తెనాలివాసి ఉప్పు సత్యనారాయణ.
ఒకప్పుడు -నటీనటులకి అభిమానుల నుంచి రోజూ అసంఖ్యాకంగా ఉత్తరాలు అందుతుండేవి. నిజానికి అలాంటి సన్నివేశాలను కొన్ని సినిమాల్లోనూ సరదాగానో, సీరియస్‌గానో వాడారు. భారీస్థాయిలో వచ్చే ఉత్తరాలను పోస్టుమాన్‌లు భారంగా మోసుకొస్తున్నట్టు అనేక సినిమాల్లో సన్నివేశాలు చేసి మరీ చూపించారు. ప్రేమాభిమానాలు పంచుతూ భారీగా వచ్చిపడే ఉత్తరాల్లో శ్రద్ధతో చదివి సమాధానం రాయాల్సినవి కొన్నివున్నా, అధికభాగం మాత్రం ఆటోగ్రాఫ్‌తో కూడిన ఫొటో పంపమన్న విజ్ఞప్తి ఉత్తరాలే ఉండేవి. అలాంటి ఉత్తరాలను పక్కన పడేయకుండా, జాగ్రత్తచేసి అభిమానులకు సరైన సమయంలో జవాబు ఇవ్వటానికి అప్పటి నటీనటులు చాలా ఆసక్తి చూపించేవారు. అందుకు ప్రత్యేకంగా ఉద్యోగిని సైతం ఏర్పాటు చేసుకునేవారు. అలా ఆ ఉద్యోగి ద్వారా అభిమానులకు సకాలంలో ఫొటోలు అందించి, అభిమానులను సంతృప్తిపర్చేవారు. అలా అభిమానుల కోసం ఆటోగ్రాఫ్‌తో కూడిన ఫొటోలను పంపిన హీరోలు ఏఎన్నార్, రామకృష్ణల చిత్రాలివి. ఇప్పటికీ వీళ్ల అభిమానుల ఆల్బమ్‌లోనో, వాడి గుండెల్లోనూ గూడుకట్టుకునే ఉండి ఉంటాయి.

-పర్చా శరత్‌కుమార్ 9849601717