Others

నైట్ ఎట్ సన్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో హాట్ భామ సన్నీలియోన్ క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికీ సన్నీతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు పోటీపడుతుండటం విశేషం. తాజాగా ఈ భామ బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న రారుూస్‌లో ఐటెం సాంగ్ చేసింది. పెరుగుతున్న క్రేజ్‌ను ప్రయవేట్ షోలకూ వాడుకుంటోంది సన్నీ. సన్నీకి తాజాగా ఓ క్రేజీ ప్రయవేట్ చాన్స్ దక్కింది. అదేంటంటే, ఇయర్ ఎండ్ రాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు మూడున్నర కోట్లు ఇవ్వడానికి రెడీ అయ్యారట. సాధారణంగా హీరోయిన్లు సినిమాల్లో నటించడానికి రెండు మూడు నెలలు కష్టపడితే రెండు మూడు కోట్లు వస్తాయి. అలాంటిది సన్నీకి ఒక్క రాత్రి షో చేయడానికే అంత ఆఫర్ చేశార్ట. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, వచ్చే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా డిసెంబర్ 31 రాత్రి జరిగే ఈవెంట్‌లో సన్నీతో స్పెషల్ డాన్సు చేయిస్తున్నారట. ఇందుకుగాను ఆమె మూడున్నరకోట్లు డిమాండ్ చేసిందని, అంత మొత్తాన్ని ఇవ్వడానికి సదరు ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ ఓకె చెప్పిందట. ఇప్పటికవరకూ జరిగిన నూ యఇయర్ ఈవెంట్స్‌లో అందరికన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుని సన్నీ సంచలనం రేపబోతోంది.