Others

జయరమ్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బయోపిక్‌ల పేరు చెబితే బాలీవుడ్ చెవులు కోసుకుంటోంది. క్రీడాకారులు, రాజకీయ నేతల జీవితాలను తెరకెక్కించేందుకు దర్శకులు ఎక్కడలేని ఉత్సాహం చూపింస్తుంటే, ఆడియన్స్ సైతం వాటిని బాగానే ఆదరిస్తున్నారు. ధోనీ, బాగ్ మిల్కాసింగ్, మేరీకోమ్ వంటి చిత్రాలు ఇప్పటికే హిట్లు అందుకుంటే -తాజాగా అమీర్‌ఖాన్ చేస్తున్న దంగల్ సైతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా నుంచి సైతం ఔత్సాహికులు దర్శకులకు సజెషన్లు ఇవ్వడం మొదలెట్టారు. ఎవరి లైఫ్‌ను తెరకెక్కిస్తే బావుంటుంది? ఆ పాత్రకు ఎవరైతే సరిపోతారులాంటి అంశాలను సోషల్ మీడియా వాల్స్‌పై పోస్టర్లు వేసి మరీ సజెస్ట్ చేస్తున్నారు. ఫుల్లీ ఫిల్మీ పేరిట పోస్టవుతున్న పోస్టర్లు వైరల్‌గా మారుతున్నాయి. మలాలా పాత్రలో సమంతా బావుంటుందని, రాహుల్ ద్రవిడ్ పాత్రకు విజయ్ సూటవుతాడని పోస్టర్లు వస్తున్నాయి. ఇదేక్రమంగా తాజాగా తమిళ రాజకీయ సంచలనం, ఒకనాటి దక్షిణ భారత సినీ తార జయలలిత బయోపిక్‌పైనా ఆసక్తి పెంచుతున్నారు. జయ పాత్రకు రమ్యకృష్ణ బాగా సూటవుతుందంటూ ఓ పోస్టర్‌ను క్రియేట్ చేసి సోషల్ మీడియా వాల్స్‌పై వదలటంతో -అదిప్పుడు వైరల్‌గా మారింది. జయ పాత్రలో రమ్యకృష్ణను డిజైన్ చేసిన పోస్టర్ ఇది.