మెయిన్ ఫీచర్

అమరకాంతి అరుదెంచె..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమతో, స్వేచ్ఛగా మెలగమని తాను సృష్టించిన ఈ ప్రపంచ మానవాళి దారితప్పిన వేళ వారిని రక్షించేందుకు నరరూప అవతారమెత్తిన ఏసుక్రీస్తు జన్మదినం నేడు. క్రీస్తు జన్మదినాన్ని ప్రపంచమంతా జరుపుకునే ఈ శుభదినాన క్రైస్తవ సోదరులు ఒకరికొకరు కానుకలు ఇచ్చుకుని సహజీవనంతో మెలగాలనే గొప్ప సామాజిక స్పృహను నిరంతరం గుర్తుంచుకునేలా ఆ లోకరక్షకుడు తన జీవితానే్న త్యాగం చేసిన రోజు. ఈ భూమిపై అవతరించిన ఆ అవతారమూర్తి అనుక్షణం బాధితులు, పీడితుల పక్షాన నిలుస్తూ ఈ వ్యవస్థ మార్పు కోసం ‘ప్రేమ’ అనే మార్గాన్ని ఎంచుకుని కడవరకు యత్నించిన జీసస్ బోధనలు ఈనాటికీ కాలతీతంగా నిలిచిపోయాయి. అందుకే ఆయన బోధనలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. భారతదేశానికి స్వాతంత్య్ర సముపార్జన కోసం తాను ఎంచుకున్న అహింస అనే మార్గానికి క్రీస్తు బోధనలే ప్రేరణగా నిలిచాయని మహాత్మాగాంధీ సైతం పలికారు. అలాగే పౌరహక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కూడా తన రాజకీయ పోరాటానికి జీసస్ ప్రవచనాలే స్ఫూర్తిగా నిలిచాయని చెబుతారు. ఇలా సామాజికంగా ఎవరూ వివక్షకు గురికాకుండా స్వావలంబనతో, స్వాభిమానంతో బతికేలా సమస్త మానవాళి చేత అడుగులు వేయించేందుకు ఆ దైవ కుమారుడు తన తల్లిగా కన్య మరియను ఎంచుకున్నాడు. ఆనాటి సామాజిక పరిస్థితుల్లో ఓ కన్య గర్భం దాల్చటం వల్ల తలెత్తే పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలిసినా.. మరియ నిర్భయత్వాన్ని, తెగువను చూపిన మగువ. తనను తాను దేవుడికి దాసురాలిగా భావించుకున్న ఆమె ‘పరిశుద్ధాత్మతో అనంతమైన ఆ దైవశక్తిని తన గర్భాన మోసి దేవమాతగా యుగయుగాలుగా కీర్తించబడుతుంది. తేజోవంతమైన వర్ఛస్సుతో జన్మించిన క్రీస్తు పాపపంకిల జీవితాల్ని పవిత్రం చేసి వారికి పరలోక రాజ్య ప్రవేశ అర్హత కల్పించేందుకు తన జీవిత పర్యంతం శ్రమించి తన పుట్టుక పరమార్థాన్ని తెలియజేశాడు.
ప్రేమ, కరుణ ఉనికిని చాటాడు
ముతకబారిన ఆలోచనలతో కుంచించుకుపోయిన మనసుల్లో ప్రేమ, కరుణ అనేవి ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకుంటున్న తరుణంలో ఎదుటివారి కష్టాన్ని, దురదృష్టాన్ని చూసి కరుణ కలిగి ఉండమనే ప్రేమ అనుభూతిని యేసు తన నడవడికతో మానవులకు దగ్గరకు చేర్చాడు. అందుకే ఆయన శాంతిదూతగా మెలిగాడు. యెహోవా దేవుడి దరిచేర్చటానికి తనను అనుసరించమని, ఇలా అనుసరించిన వారిని జీవిత పర్యంతం రక్షిస్తానని అభయమిచ్చాడు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను, నష్టాలను ఎదుర్కొనే అపరిమితమైన శక్తిని తాను అందిస్తానని సందేశమిచ్చాడు. అందుకే ఆయన జన్మించిన ఈ రోజున క్రైస్తవ భక్తులు నిజాయితీగా తమ మనసును క్రీస్తుకు అర్పించేందుకు ఆయన ముందు మోకరిల్లుతారు. ఆయన మార్గాన్ని అనుసరించే ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తూనే ఉంటాయి. మారణకాండలు, విధ్వంసాలు నిత్యకృత్యమైన నేటి సమాజంలో ప్రేమ, కరుణతో కొత్త జీవితానికి నాంది పలుకుతూ కొత్త సమాజానికి నాంది పలికేందుకు ఆ ప్రభువు చూపిన మార్గాన్ని అనుసరించటమే ఆయనకు అందించే నిజమైన ప్రార్థన.