AADIVAVRAM - Others

రామాయణం.. మీరే డిటెక్టివ్ 16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ రోజు ఆశే్లష హరికథకి వెళ్లిన నిమిషానికే హరిదాసు కథని చెప్పడం ఆరంభించాడు. ఆశే్లష అందరితోపాటు శ్రద్ధగా విన్నాడు.
‘రాముడ్ని చూడగానే గౌతముడి పెద్ద కొడుకు సదానందుడి శరీరం గగుర్పాటు చెందింది. విశ్వామిత్రుడు చెప్పింది విని అతను ఇలా ప్రశ్నించాడు.
‘మహామునీ! తీవ్ర తపస్సులో మునిగిన నా తల్లిని రాముడికి చూపించావా? సర్వప్రాణులూ పూజించే రాముడికి మా అమ్మ పళ్లని, కందమూలాలని ఇచ్చి పూజించిందా? విధి వల్ల మా అమ్మకి జరిగిందంతా రాముడితో చెప్పావా? రామ దర్శనంతో పవిత్రురాలైన మా అమ్మ మా నాన్నని చేరిందా? మా నాన్న కూడా రాముడ్ని పూజించి గౌరవించాడా? రాముడు కూడా నా తండ్రిని పూజించాడా?’
‘సదానందా! ఏమీ వదలకుండా చేయాల్సిందంతా చేశాను. రేణుకాదేవి గౌతముడ్ని చేరినట్లుగా అహల్య జమదగ్నిని చేరింది’ విశ్వామిత్రుడు చెప్పాడు.
‘రామా! మా అదృష్టం కొద్దీ విశ్వామిత్రుడితో ఇక్కడికి వచ్చావు. నీకు స్వాగతం. తపస్సుతో బ్రహ్మర్షి ఐన విశ్వామిత్రుడి చర్యలని ఊహించలేం. గొప్ప తపశ్శాలి ఐన విశ్వామిత్రుడు నీకు రక్షకుడిగా ఉండటంవల్ల ఈ లోకంలో నీకంటే అదృష్టవంతుడు ఇంకెవరూ లేరు. విశ్వామిత్రుడి చరిత్రని చెప్తాను విను. ఆయన సకల విద్యలని అభ్యసించి ప్రజల మేలుని కోరుతూ ధర్మంగా వేల సంవత్సరాలు రాజ్యపాలనని చేశాడు. బ్రహ్మ కొడుకు శుకుడు అనే రాజు ఉండేవాడు. శుకుడి కొడుకు కుశనాభుడు. ఆయన కొడుకు గాంధి. ఆ గాంధి కొడుకే ఈ విశ్వామిత్రుడు. ఓసారి ఈయన అక్షౌహిణి సైన్యంతో నగరాల్లో, రాష్ట్రాల్లో, నదులు, కొండల్లో, ఆశ్రమాల్లో ప్రయాణిస్తూ భూమి అంతా సంచరించాడు. సిద్ధ, చారణ, దేవ, దానవ, గంధర్వ, కినె్నరలు నివసించే వివిధ వృక్షాలు, పక్షులు గల వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్లాడు. ఇంద్రియాలని జయించిన ఋషులు అక్కడ నివసించేవారు. వారిలోని కొందరు నీటిని, కొందరు గాలిని, కొందరు రాలిన ఆకులని, కొందరు పళ్లు, దుంపలని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ జపహోపాలు చేస్తూండేవారు. వైఖాసన (బ్రహ్మ గోళ్ల నించి పుట్టినవారు), వాలఖిల్య (తోక నించి పుట్టినవారు) మునులుగల, రెండో బ్రహ్మ లోకమా అనిపించే ఆ వశిష్ఠాశ్రమాన్ని విశ్వామిత్రుడు చూశాడు.
విశ్వామిత్రుడు వశిష్ఠుడికి నమస్కరించాడు. వశిష్ఠుడు ఆయనకి స్వాగతం చెప్పాడు.
‘మీ తపస్సు, అగ్నిహోత్రం, శిష్యులు, వృక్షాలు క్షేమంగా ఉన్నాయా?’ విశ్వామిత్రుడు ప్రశ్నించాడు.
‘క్షేమమే రాజా! నువ్వూ క్షేమమే కదా? ధర్మంగా ప్రజల్ని రక్షిస్తూ పాలిస్తున్నావు కదా? ధనాన్ని న్యాయంగా సంపాదిస్తూ దాన్ని పెంచి, రక్షించి, అవసరమైన వారికి ఇస్తున్నావు కదా? నీ సేవకులని చక్కగా పోషిస్తున్నావు కదా? వారంతా నీ ఆజ్ఞలని పాలిస్తున్నారు కదా? నీ శత్రువులు అందర్నీ జయించావు కదా? నీ సైన్యం, ధనాగారం, స్నేహితులు, కొడుకులు, మనవళ్లు క్షేమమే కదా?’ వశిష్ఠుడు అడిగాడు.
‘అంతా క్షేమమే’ విశ్వామిత్రుడు వినయంగా బదులు చెప్పాడు.
అలా వారిద్దరూ చాలా విషయాలు మాట్లాడుకున్నాక వశిష్ఠుడు ఆశ్రమంలో దొరికే పళ్లు, కందమూలాలు, నీళ్లు వారికి ఇచ్చి చెప్పాడు.
‘నీకూ, నీ సైన్యానికీ అతిథి సత్కారాలు చేస్తాను. దయచేసి స్వీకరించు’
అందుకు విశ్వామిత్రుడు వెంటనే అంగీకరించాక తర్వాత వశిష్ఠుడు చిత్రమైన రంగుగల కామధేనువుని పిలిచి చెప్పాడు.
‘ఈ రాజుని, ఇతని పరివారాన్ని నేను భోజనంతో సత్కరించాలి అనుకున్నాను. అందుకు తగిన ఏర్పాట్లు చేయి. ఎవరికి ఏది ఇష్టమో వారికి ఆ ఆహారం, పానీయాలు వెంటనే వడ్డించు.’ (బాలకాండ సర్గ 51-52)
ఇంటికి వచ్చాక ఆశే్లష తను విన్న ఆనాటి హరికథని తల్లి శారదాంబకి చెప్పాడు. ఏకసంథాగ్రాహి ఐన తన కొడుకు తప్పు చెప్పడని తెలిసిన ఆవిడ హరిదాసు ఏడు చోట్ల కథని తప్పుగా చెప్పాడని వాటిని వివరించింది. ఆ తప్పులు ఏమిటో మీరు కనుక్కోగలరా?

**
మీకో ప్రశ్న
జమదగ్ని మహర్షి ఆలయం ఇప్పుడు
ఎక్కడ ఉంది?

‘మీకో ప్రశ్న’కి జవాబు
భగీరథుడు గంగని భూమికి దింపిన స్థలం ఏది? నేడు అది ఏ రాష్ట్రంలో ఉంది?
హిమాలయాల్లోని గంగోత్రి, ఉత్తరాఖండ్
**
కిందటి వారం రామాయణ కథలో తప్పులు

1. ఇంద్రుడికి మేక వృషణాలని అమర్చారు. గొర్రె వృషణాలని కాదు.
2. అహల్య రాముడికే ముందు కనపడింది. ఆమె రాముడ్ని చూడగానే శాపవిముక్తి పొంది, ఆ తర్వాతే అహల్య అందరికీ కనపడింది.
3. అహల్య రామలక్ష్మణుల పాదాలని స్పృశించి నమస్కరించలేదు. రామలక్ష్మణులే ఆమె పాదాలని స్పృశించి నమస్కరించారు.
4. గౌతముడు కూడా వచ్చి అహల్యని తిరిగి స్వీకరించి రాముడ్ని పూజించాడు. ఇది
హరిదాసు చెప్పలేదు.
5. జనక మహారాజు తన పురోహితుడు శతానందుడితో వచ్చాడు. శతానందుడి పేరు
హరిదాసు చెప్పలేదు.
6. శివధనస్సుని పరీక్షించడానికి తన వెంట రామలక్ష్మణులు వచ్చారని విశ్వామిత్రుడు
జనకుడికి చెప్పిన సమాచారం కూడా హరిదాసు చెప్పలేదు.
7. విశ్వామిత్రుడు అహల్యని సందర్శించి అని చెప్పాడు తప్ప అహల్యకి శాపవిమోచనం చేసి అని చెప్పాడని వాల్మీకి రాయలేదు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి