Others

పళ్లు ఉంటే తిండి... లేకుంటే గంజి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు పదులు దాటిన కుర్రాడు మద్యం మత్తులో బండి నడుపుతూ, మొబైల్‌లో తన స్నేహితుడితో ‘బాహుబలి విశేషాల గురించి మాట్లాడుతూ డివైడర్‌కి డాష్ ఇచ్చాడట’. స్పృహలోనే ఉన్న ఆ కుర్రాడి క్రింద పెదవి రెండుగా చీలింది. కుడివైపు కనుబొమ్మ మీద ఎవరో కత్తితో కోసినట్టు ఓ గాయమైంది. మెడ నుండి మోకాలి వరకూ అంతా బాగానే ఉంది, ఒక్క మొహంలోని ఎముకలే విరిగాయి. కొన్ని పళ్ళు దెబ్బతిన్నాయని అక్కడ డ్యూటీ డాక్టరు చెప్పాడు.
వాళ్ళు ఇచ్చిన ఎక్స్‌రేలు పట్టుకుని, మెల్లగా ఆ కుర్రాడి దగ్గరకి వెళ్ళా, నన్ను చూసి ఆ కుర్రాడు ‘‘నేను ఎప్పటిలోపు బాగా అయిపోతాను డాక్టర్?’’అని అడిగాడు. ‘‘బాహుబలి పార్ట్-2 విడుదల అవ్వడానికి ఇంకా సమయం ఉంది, అప్పటిలోపు తప్పక బాగా అయిపోతావు’’అని మనస్సులో అనుకుని ‘‘తొందర్లోనే నయం అవుతావు’’ అన్నాను బయటికి.
ప్రభుత్వం కొన్ని నియమాలు ప్రజల మంచికోసం పెడుతుంది. వాటిని లెక్కచేయక, మద్యం సేవించి బండి నడపడం, నడుపుతున్నప్పుడు మొబైల్ మాట్లాడడం వంటివి చేస్తే, ఇలా యాక్సిడెంట్స్ అవుతాయి. ఆ అబ్బాయి అలా చేసుండకపోతే, అతనికి ఆ ప్రమాదం అయ్యేది కాదు.
మొహంమీద చర్మానికి గాయం అయితే ఏంచెయ్యాలో, కొన్ని వారాల ముందు చెప్పా. ఇప్పుడు ఎముకలకి, పళ్ళకి గాయాలైతే ఏం చెయ్యాలో చూద్దాం.
ముందుగా పళ్ళు:
రోడ్డు ప్రమాదంలో కానీ, బాత్రూంలో జారిపడినప్పుడు కానీ, కొట్లాటల్లో కానీ, పళ్ళకి దెబ్బతగిలే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. పంటికి దెబ్బ తగిలినప్పుడు ఏంచెయ్యాలో చూద్దాం.
ముందుగా పళ్ళు రెండు రకాలు:
1) పుట్టిన 6 నెలల తరువాత వచ్చేది పాల పళ్లు.
2) అవి పడిపోయి (ఊడిపోయి) పెద్దవుతుంటే వచ్చేవి శాశ్వత పళ్లు.
శాశ్వత పళ్లకి దెబ్బ తగిలితే ఏం చెయ్యాలి:
మొదలు పన్ను విరిగిందా, ఊగుతోందా, ఊడి బయటకి వచ్చేసిందా అని నిర్ధారించుకోవాలి.
విరిగితే: విరిగితే డెంటిస్టుల దగ్గరికి వెళ్ళాలి. ఒక ఎక్స్‌రే తీసి సిమెంట్ పెడితే సరిపోతుందా లేక రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ చెయ్యాలా, లేకపోతే పన్ను తీసేయాలా అన్నది చెప్తారు.
ఊగుతూ, నొప్పిగా ఉంటే: కొంచెం ఊగుతుంటే ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు; 4-6 వారాలు ఆ పన్నుతో ఏం గట్టివి కొరకకుండా చూసుకోవాలి. మెత్తటి ఆహారం తినాలి. బాగా ఊగుతూ ఉంటే, ఆ ఊగుతున్న పన్నుని పక్క పళ్లకి తీగ సహాయంతో కానీ, కాంపోజిట్ అనే సిమెంట్ సహాయంతో కానీ కట్టి కదలకుండా 4-6 వారాలు ఉంచాల్సి వస్తుంది. అలాచేస్తే మళ్లీ ఆ పన్ను అతుక్కునే అవకాశం ఉంది.
ఇలా కొంచెం కానీ, చాలాకానీ ఊగుతున్న పన్నులో 2నుంచి 3 వారాలు తరువాత కూడా నొప్పి ఉన్నా, పన్ను రంగు మారినా, ఆ పన్ను మధ్యలోని నరం చనిపోయినట్టు గ్రహించి, దానికి రూట్ కెనాల్ చికిత్సచేసి ఆ పన్నుకి క్యాప్ తొడగాల్సి వస్తుంది.
మొత్తంగా ఊడి బయటకి వచ్చేసిన పళ్లు:
పన్ను ముక్క మాత్రమే విరిగి బయటకి వచ్చిందా లేక మొత్తం పన్ను (లోపలి భాగంతోసహా) వచ్చేసిందా? అని నిర్ధారణ చేసుకోవాలి. ముక్క మాత్రమే వచ్చేస్తే, నోటి లోపల మిగిలిన పన్నుముక్కకి రూట్ కెనాల్ చేసి, 2 వారాల తరువాత ఆ పన్నుకి చేసి క్యాప్ తొడగాల్సి వస్తుంది.
అదే పన్ను మొత్తం వచ్చేస్తే దాన్ని పారెయ్యకుండా, పాలలో కానీ, మంచినీటిలో కానీ చిన్న పిల్లలు కాకపోతే నోటి బుగ్గలో కానీ, లేక వచ్చేసిన ప్రదేశంలోకానీ ఉంచి (ఇది కొంచెం నొప్పితో కూడుకున్నది), త్వరగా డెంటిస్ట్ దగ్గరికి వెళితే, ఆ పన్నుని పక్క పళ్లకి తీగతో కట్టేసి 2-3 వారాల తరువాత, ఆ పన్నుకి రూట్ కెనాల్ చేసి క్యాప్ తొడుగుతారు. పన్ను ఊడి బయటకి వచ్చిన రెండు గంటలలోపు తిరిగి పెట్టగలిగితే ఆ పన్ను మళ్ళీ అక్కడ అతుక్కునే అవకాశం ఎక్కువ.
పాల పళ్లు: కొంచెం ఊగుతుంటే ఏంచెయ్యాల్సిన అవసరం లేదు. ఊగుతున్న పన్నుతో 4-6 వారాలు గట్టిగా కొరకకుండా చూస్కోవాలి. బాగా ఊగుతుంటే ఆ పన్నుని తీసేయాలి. ఊడి వచ్చేసిన పన్నుని తిరిగి పెట్టే ప్రయత్నం చేయవద్దు, విరిగిన పన్నుకి పెద్దవాళ్లలో చేసినట్టే ఓ ఎక్స్‌రే తీసుకొని దానిబట్టి చికిత్స చెయ్యవలసి వస్తుంది.
చివరిగా:
ఓ సాఫ్ట్‌వేర్ మహిళ ఏడు ఏళ్ల కొడుకు స్కూల్లో ఆడుతూ కింద పడ్డాడు. కింద దవడ ముందు భాగం పన్ను మొత్తంగా ఊడి చేతులోకి వచ్చేసింది. ఆ పన్ను పట్టుకుని ఆ కుర్రాడు ఇంటికి వచ్చి అమ్మకి ఇచ్చి, జరిగిందంతా చెప్పాడు. ఆత్రంగా ఆ తల్లి ‘‘గూగుల్’’లో వెతికి, పాల పన్ను వచ్చేస్తే తిరిగి పెట్టక్కర్లేదు అని నిర్ధారణ చేసుకుని ఆ పన్నుని విసిరేసింది. సాయంత్రం నా దగ్గరకి తన కొడుకుని తీసుకుని వచ్చి జరిగిన కథ చెప్పింది. నేను ఆ పిల్లవాడిని శ్రద్ధగా పరీక్షించి వాళ్ళ అమ్మతో ఇలా అన్నా: ‘‘గూగుల్ చదివి మీకు మీరే ఇలా స్వయం చికిత్స చేసుకుంటే ఇలానే జరుగుతుంది.
మీరు పారేసింది పాల పన్ను కాదు, శాశ్వత పన్ను అని చెప్పా. బాధపడుతూ ఆ తల్లి ‘‘మళ్ళీ పన్ను రాదా డాక్టర్?’’అని అడిగింది. ‘‘మనుషులలో రెండుసార్లు మాత్రమే పళ్లు వస్తాయి, ఎలుకలలో అయితే ఎన్నిసార్లు పడినా పళ్లువస్తూ ఉంటాయి. మీ అబ్బాయిది రెండోసారి వచ్చిన పన్ను. శాశ్వత పన్ను. ఇక రాదు’’అని చెప్పా.
ఇనే్నళ్ళ చదువుతరువాత కూడా అప్పుడప్పుడు డాక్టర్ వల్ల తప్పులు జరుగుతుంటాయి, అలాంటిది రెండు నిముషాలు గూగుల్‌లో ఓ మూడు వెబ్‌సైట్లు చూసి స్వంత ట్రీట్‌మెంట్ చేసుకుంటే ఫలితాలు ఇలానే ఉంటాయి.
వచ్చేవారం మొహంలోని ఎముకలు విరిగితే ఏం చెయ్యాలో చూద్దాం?

-డా. రమేష్ శ్రీరంగం, సెల్ నెం: 92995 59615
సర్జన్, ఫేస్ క్లినిక్స్
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

-డా. రమేష్ శ్రీరంగం,