Others

నాకు నచ్చిన పాట--మా పాపాలు తొలగించి....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా పాపాలు తొలగించి దీపాలు నీవే.... వెలిగించి నావయ్యా... మమ్ము కరుణించి నావయ్యా... జన్మజన్మలా పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించి నామయ్యా... మేము తరించి నామయ్యా...’ ఈ పాట శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం లోనిది. రచన గోగిన ప్రసాద్, సంగీతం ఇళయరాజా, షిర్డీసాయి మహాత్మ్యాన్ని తెల్పిన రచయిత సందేశం, దేవుడు కాదన్న వారికి అతని మహాత్మ్యం కళ్లకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపబడింది. పసి పాప మనసున్న ప్రతి మనిషిలోను పరమాత్ముడుంటాడని, పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం... ఇచ్చుమేలైన పై జన్మయని, కులమతాల అతీతంగా అక్షర సత్యాన్ని లోకానికి తెలిపిన రచన అందరికీ కనువిప్పు కలిగించేదిగా ఉన్నది. కోరేది రెండు కాసులుగా ఉన్నది. గానం జేసుదాసుది. ఇతడు మధుర గాయకుడు. ఇతని కంఠం తెలిపేది ఆయన అభిమతం, ఈ మధురగానం. గానమే, ఆయన కులం, స్వరమే ఆయన ఇంటి చిరునామా. మానవ విలువలను గురించి గానం చేసే జేసుదాసు స్వరం విలువ ప్రతీ భారతీయుడికి తెలుసు. ప్రతి సంగీత ప్రియునికి తెలుసు అన్నట్లుగా ఈ చిత్రంలో పాడి నిరూపించాడు. షిర్డీసాయిని ప్రతి భక్తుని ళ్లముందుంచాడు ఈ చిత్రంలో. సంగీతం ఇళయరాజాది హైలెట్ అని చెప్పవచ్చు. పారిజాత హృదయంగల ఈ స్వరబ్రహ్మ, పారితోషికం తీసుకునే ఈ రాజు షిర్డీసాయి పాటంటే పారితోషికం పాటంచని సాయిబాబా చిత్రం. ఈ చిత్రానికి అతడు ఎంతో మనసుపెట్టి ఆరాధనతో సంగీతం అందించారు. భక్తి రసం కురిపించారు. శ్రవణ ప్రియులను సంగీతంలో ఓలలాడారు. షిర్డీసాయి పాటలన్నీ దైవం మానవ రూపంలో... బాబా బాబా సాయిబాబా, సాయి శరణం బాబా శరణం’’ పాటలన్నీ హిట్ అయినాయి. ఈ చిత్రంలోని పాట... ‘మా పాపాలన్ని తొలగించి, దీపాలు నీవే వెలిగించవయ్యా...’ పాట సాయిలా గానం చేస్తుంది.మనకు ఆయనపై మనసు మళ్లిస్తుంది. ఈ చిత్రంలో రచన, స్వరం, పాట ముమ్మూర్తులు నిల్చిపోయినారు. అందుకే నాకు నచ్చిన పాటైంది.

- జమలాపురం ప్రసాదరావు, ఖమ్మం