Others

నాకు నచ్చిన చిత్రం--పాండవ వనవాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పౌరాణిక చిత్రాల్లో నాకు బాగా నచ్చిన చిత్రం ‘పాండవ వనవాసం’. భవిష్యత్ తరాలకు మన తెలుగువారి సామర్థ్యాన్ని తెలియచేయటానికి- మన పురాణాలు ఇతిహాసాలు ఎంత గొప్పవో తేటతెల్లం చేయటానికి ఉపకరించే కరదీపిక ఈ చిత్రం. ‘పాండవ వనవాసం’ చిత్రాన్ని చూస్తే దర్శకుడు కమలాకర కామేశ్వరరావు ప్రజ్ఞ, రచయిత సముద్రాల పాండిత్యం దర్శనమిస్తూంది.
రాజసూయ యాగంలో అవమానాన్ని పొందిన దుర్యోధనుడు శకుని ప్రోద్బలంతో పాండవులను జూదానికి ఆహ్వానించటం, మాయాజూదం, ద్రౌపది వస్త్రాపహరణ, అరణ్యవాసారంభం, సౌగంధిక కమలంకోసం భీముని పయనం, మార్గమధ్యంలో ఆంజనేయుని చేతిలో గర్వభంగం, పాండవుల అరణ్యవాస కాలంలో వారిని అవమానించబోయి గంధర్వరాజు చిత్రసేనుని చేతిలో కౌరవలు భంగపడటం, శశిరేఖాభిమన్యుల ప్రణయం, శశిరేఖతో లక్ష్మణ కుమారుని వివాహానికి కౌరవుల ప్రయత్నం, ఘటోత్కచుని సాయంతో శశిరేఖాభిమన్యుల వివాహాన్ని భీముడు జరిపించటం- ఇదీ చిత్రకథ.
వినమరుగైపోతున్న సంస్కృత శబ్ద సహితమైన తెలుగుతో కూడిన సంభాషణలు, ఆపాత మధురమైన సంగీతం చిత్రాన్ని అజరామరం చేసిన ఇతర ముఖ్యాంశాలు. ఆనాడు కాకపోయినా ఈనాడు మనం గర్వంగా చెప్పుకునే ఓ ప్రత్యేక ముఖ్యాకర్షణ ఏమిటంటే- జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటి, నర్తకి హేమమాలిని తొలిసారి తెరపై కనిపించిన చిత్రం పాండవ వనవాసమే!
‘దేవా దీన బాంధవా’, ‘విధివంచితులై విభవము వీడి’, ‘హిమగిరి సొగసులు’, లాంటి మంచి పాటలూ హేమమాలిని నృత్యం చేసిన ‘మొగలి రేకుల సిగదానా’ పాట చిత్రంలో ఉన్నాయి. చిత్రానికి అద్భుతమైన సంగీతం ఘంటసాల అందించారు. భీమునిగా ఎన్టీఆర్, దుర్యోధనుడిగా ఎస్వీఆర్, ద్రౌపదిగా సావిత్రి, కృష్ణునిగా కాంతారావు, ధర్మరాజుగా గుమ్మడి, ఘటోత్కచునిగా సత్యనారాయణ తమ పాత్రలకు జీవం పోశారు. ఇంకా శకునిగా లింగమూర్తి నటన మరువలేనిది.
చిత్రం ప్రివ్యూ చూసిన విజయా సంస్థ అధినేత బి.నాగిరెడ్డి -హీరో హీరోయన్లకు పాటలేదేమిటి? అని అడిగారట. దర్శకులు కమలాకర కామేశ్వరరావు అప్పటికప్పుడు సముద్రాలతో పాట రాయించి చిత్రీకరించారు. అదే ‘హిమగిరి సొగసులు’. ఎంత జనాదరణ పొందిందో తెలిసిందే!

-ఎ.సి.పుల్లారెడ్డి, అనంతపురం