Others

నృత్యం.. ఆమె ప్రాణం (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిపాయి కూతురు (సత్యనారాయణ తొలి చిత్రం) చిత్రం ద్వారా తెరంగేట్రం చేశారు యల్ విజయలక్ష్మి. రెండో చిత్రంగా భక్తశబరి (శోభన్‌బాబు తొలి చిత్రం)లో సూర్పణక పాత్ర ద్వారా పరిశ్రమ గుర్తింపు పొంది, తర్వాత తెలుగులో ఎన్టీఆర్, అక్కినేని, తమిళంలో శివాజీగణేషన్, ఎంజిఆర్, మలయాళంలో ప్రేమనజీర్‌లాంటి అగ్ర హీరోల సరసన పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. తెలుగులో వీరాభిమన్యు, గుండమ్మకథ, రాముడు భీముడు, పరమానందయ్య శిష్యుల కథ, పల్నాటి యుద్ధం, బొబ్బిలియుద్ధం, పునర్జన్మ, ఉమ్మడి కుటుంబం చిత్రాలు ఆమెకు చెప్పుకోదగ్గవి. వళ్ళయార్ రామయ్య పిళ్లె వద్ద నృత్యం అభ్యసించి, వి శాంతారామ్ సమక్షంలో అరంగేట్ర ప్రదర్శన ఇచ్చారు విజయలక్ష్మి. నృత్యం అంటే ఆమెకు ప్రాణం కనుక, ఆమె నటించే ప్రతి చిత్రంలోనూ ఒక నృత్య సన్నివేశం ఉండాలని కండిషన్ పెట్టేవారు. నిర్మాతలు అందుకు అంగీకరించి, ఆమె కోసమని ఒక నృత్య సన్నివేశాన్ని చిత్ర కథకు అనుగుణంగా మలచుకునేవారు కూడా. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే -1967 ఏప్రిల్ 20న బెంగాలీ విద్యావేత్త డాక్టర్ సురజిత్ కెడి దత్తాను పెళ్లి చేసుకుని పరిశ్రమ నుంచి నిష్క్రమించారు విజయలక్ష్మి. భర్త సహకారంతో ప్రయివేట్‌గా చదువుకుని, సిపిఎ (చార్టెర్డ్ పబ్లిక్ అకౌంటెన్సీ) పూర్తి చేశారు. ఇది మన దేశంలో ఛార్టర్డ అకౌంటెన్సీ కంటే ఒకవిధంగా పెద్ద చదువు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుగల కోర్సు కూడా. చిత్రరంగంలో ఒక వెలుగు వెలిగిన విజయలక్ష్మి -ఇక్కడ నిష్క్రమించిన తరువాత కూడా పెద్ద చదువులతో అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం అమెరికా వర్జీనియాలోని పాలిటెక్నిక్ వర్సిటీలో అకౌంట్స్ విభాగానికి అధినేతగా పని చేస్తోంది. తనకు ప్రాణప్రదమైన నృత్య రంగానికి దూరంకాకుండా అడపా దడపా ప్రదర్శనలిస్తూ యువతరానికి శిక్షణనిస్తోంది కూడా. స్వర్ణయుగపు కాలంనాటి తెలుగు చిత్రాలను ఇష్టపడే తెలుగువారు కలిసినప్పుడు తాను నటించిన పాత చిత్రాల నిర్మాణ దశలోని ఆసక్తికరమైన విషయాలను ముచ్చటిస్తూ సరదాగా జీవితాన్ని గడిపేస్తోంది అలనాటి అందాల తార విజయలక్ష్మి. తీరికవేళల్లో మనమరాలుతో కాలక్షేపం (కుమారుడి కూతురు) ఒక ముఖ్యమైన హాబీ ఆమెకు. భర్త సురజిత్, మనమరాలితో అప్పటి విజయలక్ష్మి ఇప్పుడిలా హాయిగా.. ఆనందంగా.

-పర్చా శరత్‌కుమార్ 9849601717