Others

విస్తరిస్తున్న ‘మధ్య తరగతి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనదేశపు ఆర్థిక ముఖచిత్రం మారుతోందా? అవును.. ఉద్యోగాలు చేసేవారికి ‘మధ్య తరగతి’ అనే పదం పరిమితం కావటం లేదు. పానీపూరీ అమ్మేవారు, బండ్లపై లేదా చిన్న చిన్న అంగళ్ళలో దోశలు, ఇడ్లీలు అమ్ముకునేవారు, కార్పెంటర్లు, వెల్డర్లు, బట్టలుతికేవారు, డ్రైవర్లు, కేబుల్ టీవీ టెక్నీషియన్లు- వీరంతా పేదరికం నుండి బయటపడి ఆర్థిక వ్యవస్థ ఆధారంగా చెప్పబడే ‘మధ్య తరగతి’ వర్గాలుగా స్వశక్తితో ఎదుగుతున్నారు. ముంబయి విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ నీరజ్ హాటేకర్ తన సహోద్యోగులైన కిశోర్ మోరే, సంధ్యాకృష్ణలతో కలిసి ‘ది రైజ్ ఆఫ్ ది న్యూ మిడిల్ క్లాస్ అండ్ ది రోల్ ఆఫ్ షోరింగ్ ఆఫ్ సర్వీసెస్’ అన్న అధ్యయన పత్రాన్ని ఇటీవల సమర్పించారు. మరింత ఎక్కువగా సంపాదించాలనే కోరిక ఈ వర్గాలవారి ఆర్థిక పురోగతిని వేగవంతం చేస్తోందని వీరు పేర్కొంటున్నారు.
‘దిగువ మధ్యతరగతికి చెందిన వారి సంపాదన సహజంగానే పేదవర్గాల కన్నా బాగుంటుంది. దానికి కారణం వారు పేద వర్గాలకన్నా విభిన్న వృత్తులను చేయడం కాదు. తమ కుటుంబ సభ్యులలో ఎక్కువమంది అదే వృత్తిలో భాగస్వాములు కావటమే వారిని పేద వర్గాలకన్నా ఆర్థికంగా మెరుగైన స్థితిలో నిలిపింది’ అని ప్రొఫెసర్ నీరజ్ అంటారు. ‘పేద, దిగువ మధ్యితరగతి వర్గాలలో ఖర్చుపెట్టే దృక్పథంలో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది’ అని ఆయన అంటున్నారు. ఈ దిగువ మధ్యతరగతి కుటుంబాలలో రోజువారీ తలసరి వినిమయ ఖర్చు 2 నుండి 4 డాలర్లు (అంటే 134 నుండి 268 రూపాయలు) ఉంటోంది. అంటే ఒక కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉంటే ఆ కుటుంబం ఖర్చు రోజుకి వెయ్యి రూదాయల వరకు ఉంటోంది. వీళ్ళలో వినియోగ సంస్కృతి పెరుగుతోంది. దానిని బట్టి ఆ కుటుంబాల రోజువారీ సంపాదన కూడా ఎక్కువగానే ఉంటోందని అర్థవౌతోంది.
ముంబయిలోని సెంటర్ ఫర్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీలో రాజనీతి శాస్త్రంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వెంకటేష్ కుమార్ తన విశే్లషణలో- ‘కులం, ప్రాంతం, వృత్తి, లింగ, వయోభేదాలతో సంబంధం లేకుండా మన దేశంలో మధ్యతరగతి పరిధి అన్ని వర్గాలకూ విస్తరిస్తోంది’ అని పేర్కొన్నారు. ఈ అధ్యయనం దిగువ మధ్యతరగతికి చెందిన వారి వస్తు వినియోగంలో వచ్చిన మార్పులను గురించి ఆశ్చర్యకరమైన వివరాలు తెలిపింది. ఈ కుటుంబాలకు చెందిన ప్రతి ఒక్కరి వద్దా సెల్‌ఫోన్లు ఉన్నాయి. వీరిలో డెబ్భై శాతంపైగా ఇళ్ళకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అరవై శాతంపైగా ఇళ్ళలో ఫ్యాన్లు, కలర్ టీవీలు, ప్రెషర్ కుక్కర్లు, కుర్చీలు ఉన్నాయి. యాభై శాతంపైగా బంగారు నగలు, స్టీలు సామాన్లు కలిగి ఉన్నారు.
2004-12 మధ్యకాలంలో భారతదేశంలో కొత్తగా మధ్యతరగతిలోకి చేరిన కుటుంబాల సంఖ్య మొత్తం జనాభాలో 28 నుండి 50 శాతానికి పైగా పెరిగింది. అంటే వీరి సంఖ్య 304 మిలియన్ల నుండి 604 మిలియన్ల వరకు ఉంటుంది. ‘దేశంలో మధ్య తరగతి విభిన్న వర్గాలలోకి వేగంగా విస్తరిస్తోంది. ధన సంపాదనకు అవకాశాలు బాగా పెరగడమే ఇందుకు కారణం’ అంటారు ఎస్.పరశురామన్. ఈయన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైనె్సస్‌కి డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

-దుగ్గిరాల రాజకిశోర్