Others

దండన.. క్రమశిక్షణ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరేళ్ల పావని ఆట ధ్యాసలో మునిగిపోగా అనుకోకుండా ఆమె కాలు నూనె గినె్నకు తగిలింది. అందులోని నూనె ఒలికి పోవడంతో టైల్స్‌పై జిడ్డు తేలింది. దాంతో పావని అమ్మ ఆగ్రహంతో ఊగిపోయింది. కూతురికి నాలుగుదెబ్బలు తగిలించింది. ‘చూసుకోలేదమ్మా..’ అని కూతురు ఏడుస్తూ చెపుతున్నా వినిపించుకోక మరో రెండు తగిలించి ‘కళ్ళు నెత్తిన వున్నాయే నీకు..’ అంది తల్లి.
* నాలుగేళ్ళ రాజేష్ సాయంత్రం బడి నుండి ఇంటికొచ్చాడు. బ్యాగ్ బల్లపై పెట్టి పక్కింటి పిల్లలతో ఆడుకొని వచ్చాడు. బయట ఆడుకొనేటపుడు నేలపై దొర్లడంతో బట్టలంతా మురికి అంటుకొంది. అది చూడగానే వాళ్ళమ్మ రెక్క పుచ్చుకొని ఆవేశంతో కొడుకుని కొట్టడమే కాకుండా ‘బట్టలపై మురికి చూడు..’ అని కేకలేసింది. దాంతో రాజేష్ బిక్క మొగమేసి ఏడుపు లంకించుకున్నాడు.
* ఐదేళ్ళ అజిత్‌కి అల్లరెక్కువ. ఇంట్లో వస్తువులను పెట్టిన చోట వుండనివ్వడు. చిందర వందర చేయడమో, విసిరి కొట్టడమో చేసి వాళ్ళ నాన్న చేత రోజూ తన్నులు తినాల్సిందే.
... ఇలా పిల్లలు తెలిసిగానీ, తెలియకగానీ తప్పులు చేస్తే కోప్పడి, కొట్టి క్రమశిక్షణలో పెట్టాలనేది చాలామంది తల్లిదండ్రుల అభిప్రాయం. పిల్లలు సరిగా చదవకపోయినా, అల్లరెక్కువైనా వారిని దారిలో పెట్టాలంటే- దండన సరైన శిక్ష కాదని పిల్లలు మానసిక నిపుణుల అభిప్రాయం. పసివాళ్లకు విధించే శారీరక శిక్షలు వాళ్ళని మంచి మార్గంలో పెట్టడం కంటే చెడువైపే ఎక్కువగా మళ్లిస్తాయని వారి అభిప్రాయం.
సరిగా చదవడం లేదని, అడిగిన ప్రశ్నలకు సరిగా జవాబు చెప్పడం లేదని, మిగతా పిల్లలతో పోట్లాడుతున్నారని.. ఇలా అనేక కారణాలతో బడిలో టీచర్లు పిల్లల్ని దండిస్తుంటారు. ఒక్కోసారి ఈ దండన శ్రుతి మించితే పిల్లలు గాయపడడం వంటి ఉదంతాలు నేడు తరచూ వింటూనే ఉన్నాం. మిగతా విద్యార్థులతో పోల్చి ఎగతాళి చేయడం, బెంచీలపై నిల్చోబెట్టడం, గోడ కుర్చీలు వేయించడం వంటి చర్యలు సరికాదని ఉపాధ్యాయులు సైతం గ్రహించాలి. పిల్లలను శారీరకంగా, మానసికంగా బాధించడం సమంజసం కాదు.
చిన్నారులు హింసకు గురయ్యేది మొదటిది ఇల్లు, రెండోది బడి. పిల్లలు మంచి పౌరులుగా ఎదిగేందుకు దోహదపడేవి కూడా ఈ రెండే. వారి నైపుణ్యం, వ్యక్తిత్వం వికసించాలంటే ఇంట్లో తల్లిదండ్రులు, బడిలో టీచర్లు సరైన పద్ధతులను నేర్పించాలి. సున్నిత మనస్కులైన వారిని కొట్టి, తిట్టి దారిలో పెట్టాలనుకోవడం సరైన విధానం కాదు. ఆత్మీయతతో అన్ని విషయాలూ చెబుతూ పిల్లలు ఎలాంటి తప్పులు చేయకుండా చూడాలి.
బడిలో టీచర్లు కొడితే పిల్లలు ఇంట్లో అమ్మానాన్నలకు చెప్పుకుంటారు. పేరెంట్స్ దండిస్తే వారు ఇంకెవరికి చెప్పుకుంటారు? తమలో తాము ఏడుస్తూ మానసికంగా నలిగిపోతారు. కొందరు విధిలేక భరిస్తారు. మరికొందరు తిరుగుబాటు ధోరణి పెంచుకుంటారు. తమని కొట్టిన తల్లిదండ్రులపై తిరగబడలేక తమ ఆవేశాన్ని వస్తువులమీద, ఇతర పిల్లలమీద చూపిస్తారు. బడిలోనూ హింస ఎదురైతే ఇలాగే ప్రవర్తిస్తారు. హింసను అదేపనిగా భరించే పిల్లలు కాలక్రమంలో నేరప్రవృత్తిని అలవరచుకునే ప్రమాదం ఉంది.
పిల్లలు ఏం చేసినా వారిని ఏమీ అనకుండా వదిలేస్తే మరీ పేట్రేగిపోతారనేది కొందరి అభిప్రాయం. ఎవరికైనా క్రమశిక్షణ అవసరం. అయితే ఆ క్రమశిక్షణ చిన్నారులను శారీరకంగా, మానసికంగా హింసకు గురిచేసేదిగా వుండకూడదు. తాము చేసే పనిలో మంచి, చెడులను వాటివల్ల కలిగే కష్టనష్టాల గురించి వారికి అర్థం అయ్యే రీతిలో సున్నితంగా తెలియచెప్పాలి. మైనపు ముద్దలాంటి పిల్లల మనసులను మంచి మాటలతో దారిలోకి తీసుకరావాలి. అందుకు పేరెంట్స్‌లో, టీచర్లలో తగినంత ఓర్పు, నేర్పు ఉండాలి. పాతకాలపు దండన పద్ధతులకు స్వస్తి పలికి, మమతానురాగాలతో పిల్లలను దారిలోకి తెస్తూ వారిని తీర్చిదిద్దాలి.

-కైపు ఆదిశేషారెడ్డి