Others

రొయ్యల సాగులో లాభాల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపిలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఉత్పత్తిలోనూ, ఉపాధి అవకాశాల కల్పనలోనూ ఈ రంగం మంచి ఫలితాలను సాధిస్తోంది. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా ఏపీ నిలిచింది. మంచినీటి చేపలు, ఉప్పునీటి (బ్రేకింగ్ వాటర్) రొయ్యలు, ‘వనమి’ రొయ్యల ఉత్పత్తిలో ఏపీదే అగ్రస్థానం. రాష్ట్రంలో రెండంకెల స్థిరమైన వృద్ధి రేటును సాధించేందుకు మత్స్య పరిశ్రమను ప్రధాన వృద్ధికారకం (గ్రోత్ ఇంజన్)గా ప్రభుత్వం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం 2011-12 ధరల ఆధారంగా చేపలు, రొయ్యల స్థూల ఉత్పత్తిని లెక్కకడుతుంది. 2014-15 లో రూ.17.621 కోట్ల ఉత్పత్తితో 13.56 శాతం వృద్ధిరేటు నమోదు కాగా, 2015-16లో రూ.23,397 కోట్ల విలువైన 23.52 లక్షల టన్నుల ఉత్పత్తితో 32.78 శాతం వృద్ధి రేటు సాధించింది. 2016-17లో ఉత్పత్తి లక్ష్యాన్ని రూ.30,440 కోట్లు (26.40 లక్షల టన్నులు)గా, అర్ధ సంవత్సరం లక్ష్యాన్ని రూ.16,430 కోట్లుగా ప్రభుత్వం నిర్దేశించింది. గత ఏప్రిల్-సెప్టెంబర్‌లో లక్ష్యానికి మించి రూ.17,578 కోట్ల ఉత్పత్తి జరిగింది. 2016-17 అర్ధ సంవత్సరంలో రాష్ట్రంలో ఏ రంగంలోనూ ఇంత వృద్ధిరేటు నమోదుకాలేదు.
విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టడంలో ఈ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోంది. వ2014-15లో దేశం నుంచి ఎగుమతి అయిన సముద్ర ఉత్పత్తుల విలువ రూ.35 వేల కోట్లు కాగా, రాష్ట్రం నుంచి ఎగుమతైన వాటి విలువ దాదాపు 16వేల కోట్ల రూపాయలు. దేశం నుంచి ఎగుమదయ్యే మత్స్య ఉత్పత్తులలో ఏపి నుంచి 45 శాతం ఎగుమతి అవుతున్నాయి. ‘వనమి’ రకం రొయ్యలు ఏపీనుంచే అత్యధికంగా 70 శాతం వరకు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వచ్చే అయిదేళ్లలో ఆక్వా ఉత్పత్తులను వంద శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. చేపలు, రొయ్యల చెరువుల సాగుదార్లకు అనేక రాయితీలు ఇస్తోంది. మత్స్యశాఖకు సంబంధించిన ఉత్పత్తులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో ప్రభుత్వం నూతన మత్స్య విధానం ప్రకటించింది. అసైన్డ్ భూముల్లోకూడా రైతులు రొయ్యలు, చేపల చెరువులను ఏర్పాటుచేసుకునే అవకాశం కల్పించింది. మత్స్యశాఖ బడ్జెట్ అంచనాలను కూడా ప్రభుత్వం పెంచింది. 2015-16 బడ్జెట్‌లో ఇచ్చిన రూ.187.19 కోట్ల మొత్తాన్ని ఖర్చుచేశారు. 2016-17లో ప్రణాళిక, ప్రణాళికేతర బడ్జెట్ అంచనాలను రూ.339 కోట్లకు పెంచారు.జాలర్ల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. 2015లో చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు భృతిగా రూ.2వేలు ఇచ్చారు. తర్వాత దాన్ని రూ.4వేలకు పెంచారు. ఈ పథకం ద్వారా 60,500మంది ప్రయోజనం పొందుతున్నారు.
10.65 లక్షల మంది ఉపాధి
రాష్ట్రంలో మత్స్యశాఖ ద్వారా 10.65 లక్షల మంది ఉపాధి లభిస్తోంది. మత్స్య సంబంధమైన శాస్ర్తియ పరిశోధనలు, అధ్యయనాలకు ఊతంలా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రభుత్వం ఆక్వా విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఏపీలో అపారంగా ఉన్న సముద్ర తీరాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని, సముద్ర ఉత్పత్తులు పెరగడానికి, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి, ఎగుమతుల పెరుగుదలకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులు సాధించడం, మందుల వాడకంలో జాగ్రత్తలు పాటించడం, మత్స్య ఉత్పత్తుల ప్రాసెసింగ్‌కు సంబంధించి ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తోంది. ఫలితాలను సాధిస్తోంది. ప్రభుత్వం ప్రోత్సాహంవల్ల సముద్ర ఉత్పత్తులు పెరగటమే కాకుండా, ఎక్కువ మందికి ఉపాధి కూడా లభించే అవకాశం ఉంది.

- శిరందాసు నాగార్జున