Others

ప్రేక్షకుడికి చేరినపుడే...(డైరెక్టర్స్ చాయిస్..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-యువ దర్శకుడు శ్రీ
**
అమీర్‌పేటలో.. చిత్రంతో దర్శకుడిగా తన బాణీని పరిచయం చేశాడు యువ దర్శకుడు శ్రీ. తడబాటు లేకుండా మంచి చిత్రాన్ని తెరకెక్కించాడన్న పేరొచ్చింది. దర్శకుడు చెప్పదలచుకున్నది ప్రేక్షకుడికి చేరినపుడే ఆ సినిమాకు సార్థకత అంటున్న శ్రీతో ఈవారం చిట్‌చాట్..
మీ నేపథ్యం?
ప్రకాశం జిల్లా కందుకూరు మాది. బిటెక్ తరువాత సినిమావైపు అడుగులు వేశా.

దర్శకుడిగా..
చిన్నప్పటినుంచీ సినిమాలంటే ఆసక్తి. బాగా చూసేవాడిని. ఆ ఇంపాక్ట్‌తోనే నటుడవ్వాలనుకున్నా. మారిన అభిరుచి మేరకు దర్శకుడినై ‘అమీర్‌పేటలో..’ రూపొందించాను. సీనియర్లు ఎవరి దగ్గరా శిష్యరికం చేయలేదు.

ఇష్టమైన జోనర్?
నేచురల్ మూవీస్ ఇష్టం. సినిమా సహజంగా సాగిపోవాలన్నది నా భావన. సినిమాలో మెలో డ్రామా అవసరం మేరకే ఉండాలి.

తొలి అవకాశం?
స్నేహితులే నాకు మంచి సపోర్ట్. వారే ఓరకంగా తొలి అవకాశం ఇచ్చారు.

పరిశ్రమలో సమస్యలు?
తొలి సినిమాతో చాలా సమస్యలు ఎదుర్కొన్నామని చాలామంది చెబుతారు. నాకు మంచి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు దొరకడంతో అలాంటి సమస్యలు తలెత్తలేదు.

నచ్చిన దర్శకుడు?
క్రిష్.

తరువాతి చిత్రాలు?
రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి లవ్‌స్టోరీ. ఈ ఏడాది ఒక సినిమా ప్రారంభం కానుంది.

దర్శకుడంటే?
ఏ భావోద్వేగాన్ని తాను ఫీలయ్యాడో అది ప్రేక్షకుడి అనుభూతిలోకి తీసుకు రాగలిగేవాడే దర్శకుడు.

-శేఖర్