Others

కళామతల్లి వరప్రసాదం.. శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాటినాడ వరప్రసాద్. పౌరాణిక నాటకాలంటే పిచ్చి. నాటకాల్లోని పద్యాలూ నేర్చుకొని మంచి గాయకుడు అనిపించుకున్నాడు. ఒకసారి అత్యవసర పరిస్థితుల్లో అర్జున పాత్రధారి సమయానికి హాజరుకాకపోవటంతో ఆ పాత్ర ధరించాల్సి వచ్చింది. అలా అనుకోకుండా రంగస్థలంపై కాలుమోపి నట జీవితం మొదలెట్టాడు. ఉద్యోగరీత్యా హైదరాబాద్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో బాధ్యతలు నిర్వహిస్తూ సహోద్యోగి, నటుడు భానుప్రకాష్ సహచర్యంతో సాంఘిక నాటకాల్లోనూ తను ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. గాలివాన, సుడిగాలి, ఊరుమ్మడి బతుకులు, మాలపిల్ల.. ఇలా అనేకానేక నాటకాల్లో తనకు తానే సాటి అనిపించుకుని తెలుగు నాటక రంగానికి ‘వరప్రసాదం’ అయ్యాడు.
‘ఎలపట ఎద్దు దాపట ఎద్దు’ సబ్జెక్టుతో వరప్రసాద్ ఓ ట్రంక్‌కాల్ సంభాషణ జోక్‌ను అద్భుతంగా చెప్పేవారు. ఆ సంభాషణనే కాస్త మార్చి పరుచూరి వెంకటేశ్వరరావు ‘చలిచీమలు’లో పెట్టారు. దేవదాసు కనకాల దర్శకత్వం వహించిన ఆ చిత్రం విజయం తర్వాత వరప్రసాద్ వెనక్కి తిరిగి చూడలేదు. దురదృష్టం కొద్దీ చిత్రాల సంఖ్య పెరుగుతుంటే, వ్యసనాలూ అధికమయ్యాయి. అందాల రాముడు ఔట్‌డోర్ షూటింగ్‌లో మరో నట మిత్రుడు వివేకంతో కలిసి చేసిన మందు గొడవతో అక్కినేనితో అక్షింతలూ పడ్డాయి. మందు లేనిదే వరం (ఆప్తమిత్రులు అలా పిలిచేవారు) లేడనే స్థితికి వచ్చేసి తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్ చేరే పరిస్థితి వచ్చింది. దగ్గరి మిత్రుడు, ఇఎస్‌ఐ ఆస్పత్రి వైద్యుడు తీవ్రంగా హెచ్చరించటంతో మందు పూర్తిగా మానేసాడు. వరప్రసాద్‌లో వచ్చిన నూతన మార్పునకే ముళ్ళపూడి వెంకటరమణ ‘నూతన్ ప్రసాద్’ అని నామకరణం చేశారు. చిత్రాల సంఖ్య పెరుగుతూ పెరుగుతూ.. మీ చిత్రంలో నూతన్‌ప్రసాద్ వున్నాడా? అని పంపిణీదారులు అడిగే స్థాయికి ఎదిగిపోయాడు. ‘గాలివాన’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల కాలేని పరిస్థితిలో ఉన్నపుడు, నూతన్‌ప్రసాద్‌కు ఒక పాత్ర సృష్టించి షూటింగ్ జరిపి జతపరిస్తే ఆ సినిమా విడుదలకు నోచుకుంది. అంతవరకు విలన్ పాత్రల్లో ఆర్ నాగేశ్వరరావు, రాజనాల, సత్యనారాయణలకు అలవాటుపడిన తెలుగు ప్రేక్షకులు.. విలనిజంలో కామెడీనీ జతపరచి కొత్త ఆవిష్కరణకు తెరలేపిన నూతన్‌ప్రసాద్‌ను ఆదరించారు.
కామెడీ విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అచిరకాలంలోనే అగ్ర స్థానానికి ఎదిగిన నూతన్‌ప్రసాద్ ‘బామ్మమాట బంగారు బాట’ చిత్రం షూటింగ్‌లో జరిగిన యాక్సిడెంట్‌తో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి బెడ్‌కే పరిమితమయ్యాడు. బిజీ నటుడిగా ఉన్నప్పుడు నూటొక్క జిల్లాల అందగాడు అనిపించుకొన్న నూతన్‌ప్రసాద్‌లో, నటుడు ఇంకా యాక్టివ్‌గానే ఉండి వీల్‌చైర్ వేషాలతోనూ ఆకట్టుకున్నాడు. కుర్చీకే పరిమితమైన తరువాతా 101కి పైగా చిత్రాల్లో పాత్రలు పోషించి, టెలివిజన్ వ్యాఖ్యాతగా, టీవీ నంది అవార్డుల కమిటీ ఛైర్మన్‌గా, నటనారంగానికి అసెంబ్లీలాంటి రవీంద్రభారతికి మేనేజర్‌గా, కార్యదర్శిగా చురుకైన పాత్రలు నిర్వర్తించటం నూతన్‌ప్రసాద్‌కే సాధ్యమైంది. కదల్లేని పరిస్థితిలో వీల్‌చైర్‌లో కూర్చునీ తాను పోషించిన పాత్రలకు అవార్డులు అందుకోవడమూ నూతన్‌ప్రసాద్‌కే చెల్లింది. ఇక్కడ మీరు చూస్తున్నది అదే. వీల్‌చైర్ నుంచే అవార్డు అందుకుంటున్న నూటొక్క జిల్లాల అందగాడు -నూతన్‌ప్రసాద్. చివరి శ్వాస తీసుకునే వరకూ కళామతల్లికే అంకితమైపోయిన నూతన్ ప్రసాద్ శకం -2011 మార్చి 30న శాశ్వతంగా తెరమరుగైంది. అభిమానుల మనసుపొరల్లో నిక్షిప్తమైపోయింది.

-పర్చా శరత్‌కుమార్ 9849601717