Others

తండ్రిని మించిన తనయుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యు.పిలో కూడా అఖిలేష్ తండ్రిని మిం చిన తనయుడు అయినాడు. కానీ బీహార్‌లో ఆ పద్ధతి కుమారుడు కాడు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌గారు ఏటా జనవరి ఒకటవ తారీఖునాడు- ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ తమ తమ స్థిర, చరాస్థుల్ని ప్రకటించాలి అన్న నియమం- ముఖ్యమంత్రి పెట్టినదే.
శ్రీ నితీష్ కుమార్‌కి చరాస్థి కేవలం పదహారు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే వున్నది. కాగా కుమారరత్నం నిషాంత్ కుమార్‌కి చరాస్థి- ఒక కోటి పనె్నండు లక్షల రూపాయలదాకా వున్నది. ఈ వివరాలు నేరుగా ముఖ్యమంత్రి ప్రకటించినవే. ఐతే, స్థిరాస్తి కూడా, నిషాంత్‌కీ ఎక్కువ. అతని ఆస్తి 1.25 కోట్ల రూపాయలు.
బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కి 29 లక్షల రూపాయల బ్యాంకు రుణం వుంది. ఐతే నితీష్‌కుమార్‌కి లల్లూ ప్రసాద్ యాదవ్‌లాగే పశు సంపద వుంది. పది ఆవులు, ఐదు దూడలూ వున్నాయి. కానీ అవి నితీష్‌గారి నివాస గృహంలో లేవు ఎక్కడో వున్నాయిగానీ ఆ చోటు గోప్యంగా వుంచారు ఎందుకో?

ఇరవై ఏళ్లకు నోరు ఇప్పాడు!

జపాన్‌లో ఆ భార్యాభర్తలు యిద్దరూ ఒకే ఇంట్లో తమ ముగ్గురు పిల్లలతో కలిసే వుంటున్నారు గానీ- ఆ ఇద్దరిమధ్యా మాటలు లేవు. ఇంత సుదీర్ఘమైన వౌనవ్రతం ఎక్కడా కానము ఈనాడు ప్రపంచంలో.
భర్త ఒటోవుకి భార్య కాటాయామా చేసిన పనులు కొన్ని నచ్చలేదు. అతను బాగా నొచ్చుకున్నాడు. కాని బయటపడలేదు. ఎంతసేపూ పిల్లల్ని చూసుకుంటుంది. ‘‘వాళ్ళకోసమే నీతో వున్నాను’’ అంటుంది- అని బాధపడ్డ ఒటోవు పూర్తిగా వౌనవ్రతం మొదలెట్టాడు. భార్యంటే యిష్టమే గానీ తనమీద శ్రద్ధ చూపడంలేదని కోపం, జెలసీ. దక్షిణ జపాన్ ప్రాంతంలోని ‘నారా’కు చెందిన రుూ దంపతుల ‘మూగ జీవితం’ పిల్లల్ని చాలా దుఃఖపెట్టేసింది. వారి పద్ధెనిమిదేళ్ల కుమారుడు - ‘ఓషికి’ రుూవిషయం అంతా ఒక టీవీ చానల్‌కి రాశాడు.
‘‘బాబ్బాబూ! మీ పుణ్యముంటుంది. అమ్మా నాన్నల ఎడమొహం పెడమొహం బాపండి, బాబూ! ‘ఉ’, ‘లేదా‘ ‘ఆఁ’ కాదా, ‘హూఁ’ అన్న హూంకరింపు- అంతే, ఆ ఇంట, ఆ భర్త నోరు యిప్పి పలికే మూడు పలుకులు. ఈ ఇద్దరూ మొట్టమొదట కలుసుకుని, ప్రేమ కబుర్లు, ఊసులూ చెప్పుకున్న పార్కులో- రుూ ఇద్దరికీ సదరు టీవీ వాళ్లు సమాగమం ఏర్పరచడానికి వాళ్లకి తలప్రాణం తోక్కి వచ్చింది.
‘‘పిల్లల్ని బాగా చూసుకుంటున్నావు గానీ, నేను ఉడుకుమోతుని. నన్ను తప్ప నువ్వు ఎవ్వరినీ ముద్దుచెయ్యకూడదు’’ అని, కుళ్లుకుని యిలా వౌనవ్రతం బూనాను అని చెప్పాడు భర్త. ‘‘మీ రుణం తీర్చుకోలేనిది. ఎంతో బాధపెట్టాను మిమ్మల్ని’’ అంటూ ఇల్లాలు గునిసింది. అతనికి మాటలు యిక రావేమో, యిన్నాళ్లూ వౌనవ్రతం కారణంగా- అనుకున్నవాళ్లంతా సంతోషించారు. పిల్లలూ, తల్లిదండ్రులూ- కిల కిలా, పకపకాలాడుతూ యింటికి చేరారు. ‘వౌనమే నీ భాష ఓ మూగ మనసా’- అన్నది రుజువైంది!

అమ్మవారికి కరెన్సీ హారం!

సాధారణంగా కరెన్సీ నోట్ల దండ మాయావతిగారి మెడలో అభిమానులు వేస్తూ వుంటారు. దేవుళ్లల్లో ఆంజనేయస్వామికి వడమాల వేస్తారు. అది చాలా చోట్ల ఆచారం. కానీ కరెన్సీ నోట్ల హారం వెయ్యడం రుూ నోట్ బందీ కాలంలో విడ్డూరమే. ఐతే, కోయంబత్తూర్‌లోని మకిలియమ్మ అమ్మవారికి రుూ సేవను పొందే అవకాశం దక్కింది. నూతన సంవత్సరం పూజాది కార్యక్రమాలలో భాగంగా రెండు వేల రూపాయల గులాబీ రంగు నోట్ల దండలు గ్రుచ్చివేశారు! ‘‘రూపాయలకు గడ్డు స్థితి వచ్చింది. తమిళనాడులోనూ, దేశంలోనూ అటువంటి దుస్థితి రాకుండా చూడమ్మా!’’ అని భక్తులు 5 లక్షల రూపాయలు ఖర్చు చేశారుట! ఈ సంగతి ఆలయ ముఖ్య పూజారి కృష్ణమూరిచెప్పారు. అన్నీ కొత్త నోట్లే సంపాదించి వేశారు.
ఇదిలా వుండగా రాజస్థాన్ యింకో అడుగు ముందుకేసింది. అక్కడ 9 లక్షల రూపాయలు విలువ చేసే రెండు వేల రూపాయల నోట్లు- ఐదు వందల నోట్లు తెచ్చి హరంగా గ్రుచ్చి- చిట్టగాంగ్‌లో వున్న సాంవరియా సామి దేవాలయంలో విగ్రహం మెడలో అలంకరించారు. ఏ.టి.ఎమ్‌లలో, బ్యాంకుల్లో నగదు కటకటగా వున్న సమయంలో- భక్తులు యిన్ని కొత్త నోట్లు సేకరించి, తెచ్చి దేవుడికి వెయ్యడం ఆశ్చర్యమే!
తెల్లారేపాటికి సాంవారియాజీ ఆదాయం 9 లక్షలు అదనంగా పెరిగింది. పైగా, చాలా చోట్ల హుండీలలో విపరీతంగా డబ్బులు పడ్డాయి. ఐతే, అప్పుడు అవన్నీ పాత నోట్లు. అంటే ‘నల్లధనం’. కానీ భక్తులు యిక్కడ వేసినవి అసలు సిసిలు కొత్త నోట్లు. లోగుట్టు ఐ.టి. శాఖకే తెలియాలి.

గోపాలకృష్ణుడైన మంత్రి!

బీహార్ ఆహార శాఖామాత్యుడు తేజ ప్రతాప్ యాదవ్ జనవరి ఒకటి కొత్త సంవత్సరాదినాడు- నందగోపాల కృష్ణుడి వేషంలో- పిల్లనగ్రోవి వాయిస్తూ- ఆవుల శాలలో చూపరులకు, స్నేహితులకు దర్శనమిచ్చాడు.
తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్ క్యాబినెట్ మంత్రి లల్లూ ప్రసాద్ యాదవ్‌గారి సుపుత్రుడు. బీహార్‌లో అభిమానులు ప్రసాద్ యాదవ్ గారినే సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్మగా కీర్తిస్తూంటారు. కానీ, యిప్పుడు తండ్రిని మించిన తనయుల ‘హవా’ వెళ్తోంది కదా దేశంలో!
ఈ తేజ ప్రతాప్ క్రికెట్ కూడా ఆడతాడుట! ఈ గోపాలకృష్ణుని వేషం వేసుకోమని కోరుతూ, బృందావనంలో వున్న ఒక కృష్ణ భక్తురాలు ఇచ్చిందని తేజ్‌గారు చెబుతున్నాడు- జనవాక్యం మన్నిస్తున్నాడన్నమాట!
లల్లూ ప్రసాద్ యాదవ్‌గారి కుమారులంతా బిహార్‌లో మంత్రులే కదా- ఇవాళ తండ్రి కీర్తిని రకరకాలుగా ఇనుమడింపజేస్తున్నారు!

-వీరాజీ