Others

‘సెల్’ వ్యసనం.. చదువులకు శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశ జనాభా 131 కోట్లు దాటనుంది. ఇందులో వంద కోట్ల మంది సెల్ వినియోగదారులున్నారని ‘ట్రాయ్’ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రకటించింది. అంటే మన దేశంలో పసిపిల్లలు (12 ఏళ్ల లోపు వారు), వయోవృద్ధులు తప్ప అందరూ సెల్‌ఫోన్ వినియోగదారులేనన్నమాట. ఈ దుర్వ్యసన పరిణామం గురించి ఆలోచిస్తే నేటి యువతరం పెడత్రోవ పడుతోందన్నది వాస్తవం. సెల్‌ఫోన్‌పై వున్న శ్రద్ధ చదువు, ఉద్యోగం, భవిష్యత్ జీవనంపై లేదన్నది అక్షర సత్యం.
ఇక, ప్రపంచంలోని 193 దేశాలలో పట్టుమని 20 దేశాలు తప్ప క్రికెట్‌ను మిగతా దేశాల్లో అభిమానించరు. క్రికెటర్లు మాత్రం కోట్లు గడిస్తూ కరెన్సీపై హాయిగా నిదురిస్తున్నారు. క్రికెట్ ఆటపై మన యువత అభిమానం పెంచుకుని విలువైన సమయాన్ని వృథా చేసుకుంటోంది. మరోవైపు ఎలాంటి సామాజిక బాధ్యత లేకుండా నిర్మిస్తున్న నేటి చలన చిత్రాలు చూస్తూ ఎంతోమంది యువతీ యువకులు విలువైన కాలాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇరవై శాతం యువత మాత్రం జీవిత లక్ష్యం దిశగా పయనిస్తూ, సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, కాట్, గేట్- ఇలాంటి పోటీ పరీక్షలకు కష్టపడి చదువుతూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి యువత మాత్రమే సెల్‌ఫోన్ ద్వారా ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని గ్రహించి తమ మేధస్సుకు పదును పెంచుకుంటున్నారు. మిగిలిన ఎనభై శాతం యువత మాత్రం సెల్‌ఫోన్ వినియోగంతో భవిష్యత్‌ను నాశనం చేసుకోవడం ఆందోళనకర పరిణామం. రోగిని పరీక్షించే సమయంలో మాత్రమే డాక్టర్ స్టెతస్కోప్‌ను చెవుల్లో పెట్టుకుని వాడతాడు. నేడు చాలామంది యువతీ యువకులు నిద్ర లేచింది మొదలుకుని మళ్లీ నిద్రించేవరకూ చెవిలో ఇయర్ ఫోన్స్ వుండవలసిందేనని అంటున్నారు. నీటుగా డ్రెస్ టక్ చేసి, వీపు వెనుక బ్యాగ్ తగిలించుకుని, చెవికి ఇయర్ ఫోన్స్ తగిలించుకుని, తామేదో ఘనకార్యం సాధించినట్లు వాహనాలపై వెళ్లడం చూస్తుంటే నవ్వు రాక తప్పదు. ఇలాంటి యువత రైల్వే స్టేషన్‌కెళ్లి రిజర్వేషన్ ఫాం నింపలేరు, పోస్ట్ఫాసుకెళ్లి మనియార్డర్ ఫాం పూరించలేరు. ఎలాంటి అప్లికేషన్‌లు పూర్తిచేయలేరు. ఏవీ తెలుసుకోకుండా, చిన్న చిన్న విషయాలకు సైతం ఇతరులపై ఆధారపడతారు.
సెల్‌ఫోన్ వినియోగం వల్ల యువతలో నేరప్రవృత్తి పెరుగుతున్న విషయం పత్రికల్లో చూస్తున్నాం. ఆడపిల్లల ఫొటోలు తీయడం, వారిని ఏడిపించడం, బ్లాక్‌మెయిల్ చేయడం, అశ్లీల దృశ్యాలను డౌన్‌లోడ్ చేసుకోవడం, నగ్నచిత్రాలను మహిళల ఫోన్లకు పంపించడం లాంటి నేరాలకు కొందరు యువకులు పాల్పడుతున్నారు. బస్‌స్టాప్‌లలో, హోటల్స్‌లో, బజార్లలో, బస్సుల్లో, రైళ్లలో, సినీ థియేటర్ల వద్ద ఎక్కడ చూసినా సెల్‌ఫోన్ బెడద తప్పడం లేదు. సెల్‌ఫోన్ నుంచి పాటల గోల ఇతరులు విని తీరాల్సి వస్తోంది. ఇయర్ ఫోన్స్ తగిలించుకుని వెళ్ళే వారికి వెనుక నుంచి వచ్చే వాహనాల హారన్ శబ్దాలు వినిపించవు. పాదచారులు వాహనాలకు సైడ్ ఇవ్వకుండా వెళ్ళడం వల్ల, వాహనంపై పయనిస్తూనే సెల్‌లో మాట్లాడుకుంటూ వెళ్లడం వల్ల నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇక, అమ్మాయిలు కూడా తక్కు వేం కాదండోయ్! యువతలో 20 శాతం అమ్మాయిలు సైతం సెల్‌ఫోన్ వ్యసనపరులని చెప్పి తీరవలసిందే. అమ్మాయిల ఫోన్లను గమనించకపోవడం పేరెంట్స్ తప్పుగానే భావించుకోవాలి. కూతురు ఎవరితో మాట్లాడుతోంది? విషయమేమిటన్నది గమనించకపోవడం వలన, నిఘా పెట్టకపోవడం వల్ల పిల్లలు మితిమీరిన స్వేచ్ఛతో ప్రవర్తిస్తున్నారు. చాటింగ్, ఫేస్‌బుక్ స్నేహాల పేరిట కొందరు యువకులు అమ్మాయలకు దగ్గరవుతుంటారు. వారి ప్రేమలో పడి ఎంతోమంది యువతులు మోసపోతున్నారు. మరోవైపు సెల్ ద్వారా నేరాలు చేస్తూ యువకులు కటకటాల పాలవ్వడం చూస్తున్నాం. మద్యం, మాదక ద్రవ్యాలకు బానిసలైనట్టు సెల్‌ఫోన్ వినియోగం ద్వారా యువతలో నేరాల సంఖ్య పెరుగుతూనే వుంది.
ఒకప్పుడు పది, పనె్నండు మంది మిత్రులు కలిస్తే ఏం చదవాలి? ఏ కోచింగ్‌కు వెళ్లాలి? పోటీ పరీక్షలు ఎలా రాయాలి? స్టడీ మెటీరియల్ ఎలా సంపాదించాలి? వంటి అంశాలు చర్చకు వచ్చేవి. సెల్‌ఫోన్‌తో మమేకమైపోతున్న వారిని చూస్తుంటే- వారికి చదువు వస్తుందా? ఉద్యోగాలు వస్తాయా? జీవితంలో స్థిరపడతారా? అనే ఆందోళన కలుగుతుంది. సెల్‌ఫోన్ వ్యసనం నుండి బయటపడితే తప్ప యువతకు బంగారు భవిష్యత్ లేదు. చదువుతో సంబంధం లేని విషయాలపై ఆసక్తి పెంచుకుంటే- కాలం కరిగిపోతుందే తప్ప జీవితంలో స్థిర పడడం అన్నది కలగా మారిపోతుంది.

-మురహరి ఆనందరావు