Others

అనుభవం.. అక్షర రూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుభవాలను అక్షరాల్లోకి మార్చి, పుటలుగా పేర్చితే డైరీ అవుతుంది. మనసు స్పందించే ప్రతిభావాన్ని, ప్రతి సంఘటనను, ఆలోచనలను తనలో నిక్షిప్తం చేసుకునే అపురూప పుస్తకం డైరీ. అందుకే డైరీ ఎన్నటికీ ఆదరణను, ప్రాధాన్యతను కోల్పోలేదు. కొత్త జ్ఞాపకాలను దాచుకోవడానికి మార్కెట్లో వివిధ రూపాల్లో డైరీలు సిద్ధంగా ఉన్నాయి.
ఒక వ్యక్తికి సంబంధించిన డైరీపై పూర్తి హక్కులు వారికే ఉంటాయి. నిత్య జీవితంలో జరిగిన సంఘటనలన్నీ రాత్రివేళ నిద్రపోయేముందు అందులో నిక్షిప్తం చేసుకుంటారు. ముఖ్య విషయాలు, తీపి జ్ఞాపకాలను అందులో పొందుపరచుకోవచ్చు. అనుభవాలను నెమరు వేసుకోవడానికి డైరీ ఉపకరిస్తుంది. మర్చిపోయిన ఎన్నో విషయాలను డైరీ చూసి తెలుసుకోవచ్చు.
వృత్తిపరంగా బాధ్యతలు అధికంగా ఉండేవారు, క్రమం తప్పకుండా ఉపయోగించేవి ప్రొఫెషనల్ డైరీలు. పోటీ ప్రపంచంలో ప్రొఫెషనల్ డైరీ ఓ పర్సనల్ అసిస్టెంట్‌గా సహకరిస్తుంది. దైనందిన వ్యవహారాలను మర్చిపోకుండా సమయానుకూలంగా చేయాల్సిన పనిని గుర్తుచేస్తోంది. ప్రముఖ దినాలు, ప్రయాణాలు పొందుపర్చుకోవచ్చు.

-నీలిమ సబ్బిశెట్టి