Others

పది సినిమాలే చూశా: కంగన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడు సార్లు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న 29ఏళ్ల కంగనారౌనత్ పుట్టి పెరిగిన తరువాత ఇప్పటి వరకూ పది సినిమాలు మాత్రమే చూశాను అని చెప్పటం ఆశ్చర్యం కలిగిస్తోంది కదూ! ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో ఒదిగిపోయే కంగన తాజాగా ‘తను వెడ్స్ మను రిటర్న్స్’లో రొమాంటిక్, కామెడీగా కనిపించే రెండు వైవిధ్యమైన పాత్రలు పోషించి మూడోసారి జాతీయ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో పుట్టిన కంగన నటిగా అవతారమెత్తటానికి ముందు రంగస్థలంలో శిక్షణ తీసుకున్న తరువాతనే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. అస్మిత రంగస్థల సంస్థలో అడుగుపెట్టిన ఆమె అరవింద్ గౌర్ దర్శకత్వంలో పలు ప్రదర్శనలు ఇవ్వటం జరిగింది. స్క్రిప్ట్ రైటింగ్ కోర్సు సైతం అమెరికాలో చేశారు. తొమ్మిది నిమిషాల షార్ట్ ఫిల్మ్‌ను సైతం నిర్మించారు. రాబోయో కాలంలో పూర్తిస్థాయిలో చిత్రం నిర్మించాలని కలలుకంటుంది. తల్లిదండ్రులు ఆమెను డాక్టర్ కోర్సు చేయించాలని ఉబలాటపడగా నటిగా నేడు అందరి ప్రశంసలు అందుకుంటుంది. వైద్య విద్య అభ్యసించేటపుడు ఆమె మగ విద్యార్థుల కంటే మంచి మార్కులే సంపాదించేదట. ఆమె స్నేహితులు క్యాంటీన్‌లో, గార్డెన్‌లలో సరదా ఉంటే కంగన మాత్రం ఇంటిలోగానీ, లైబ్రరీలోగానీ ఉండి బుద్దిగా చదువుకునేది. క్వీన్ చిత్రంలో గత ఏడాది జాతీయ అవార్డు అందుకున్న కంగన తన పాత్రకు తానే డైలాగులు రాసుకుంది. ఆమెకు వివిధ దేశాలలో నివశించటమంటే ఎంతో ఇష్టం. ఆమె ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్రకు సంబంధించిన యాసలో డైలాగులు చెప్పటం కంగన ప్రత్యేకత అని చెప్పవచ్చు. సినిమాలే చూడటానికి ఇష్టపడని కంగన టీవీ చూడటానికి సైతం సుతారం ఇష్టపడదు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవటం, సంగీతం వినటం చేస్తుంటుంది. అంతేకాదు షూటింగ్‌లేని సమయంలో ఇంటిలో సాధారణ జీవితం గడపటానికి మక్కువ చూపుతుంది. తన వంట తానే చేసుకుంటుంది. బట్టలు ఉతుక్కుంటుంది. కంగన తొలిసారి 2010లో మధుర్ భండార్కర్ రూపొందించిన ఫ్యాషన్ చిత్రం ద్వారా ఉత్తమ సహాయ నటి అవార్డును సొంతం చేసుకుంది. తల్లి ఉపాధ్యాయురాలు, తండ్రి వ్యాపారవేత్త. అనురాగ్ బసు డైరెక్ట్ చేసిన గ్యాంగ్‌స్టర్ సినిమాతో నటిగా మారింది. కంగన చిన్న చెల్లిపై ఓ దుండగుడు యాసిడ్ దాడికి పాల్పడటం జరిగింది. ఇప్పటి వరకు 29 ఏళ్ల వయసున్న ఈ విలక్షణ నటి 27 సినిమాలలో నటించి విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. అంతేకాదు 2009లో ఏక్‌నిరంజన్ అనే తెలుగు సినిమాలోనూ, 2008లో ధామ్ ధూమ్ అనే తమిళ చిత్రంలో సైతం నటించింది. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో జతకట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముక్కుసూటి స్వభావం గల కంగనను ఎంతమంది ద్వేషిస్తారో అంతకుమించి ఆమె నటనను ఇష్టపడేవారు కోకొల్లలు.