Others

నాకు నచ్చిన పాట-- నమో, నమో బాపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభ్యుదయ నిర్మాత కెబి తిలక్ తన స్వీయ దర్శకత్వంలో సొంత బ్యానర్‌పై 1957లో నిర్మించిన ఆదర్శవంతమైన చిత్రం ‘ఎమ్‌ఎల్‌ఎ’ లోనిది నమో నమో బాపు పాట. అహింస, సత్యాగ్రహం, నిరాడంబరత, పరమత సహనం, నిస్వార్థం, పేద ప్రజల జనోద్ధరణే ఆయుధాలుగా భారత స్వాతంత్ర సమరంలో భారతావనిని ఒక్కతాటిపై నడిపిన మహాత్మాగాంధీపై రచయిత ఆరుద్ర రాసిన గీతం నేటికీ ఆలోచింపచేస్తూంటుంది. గాంధీ పేరు తగిలించుకుని వారి వారసులమని చెప్పుకునేవారు నిజంగా గాంధీ చేసిన బోధలు, మార్గాలు మరచిపోవడం విచారకరం. ఇదే విషయాన్ని పాటలో ‘నీవుతీసిన బాటలు దాటి, నీతిని విడచి, నినే్న మరచి నీ అనుచరులే మారెదరేమో నిదురనుండి లేపు’ అని రాయడం.. దాన్ని ఈనాడు మనం ప్రత్యక్షంగా చూడటం జరుగుతోంది. ఇది రచయిత ముందుచూపునకు నిదర్శనం. ఆశయాల కోసం అశువులు బాసిన ఆదర్శమూర్తి అవనిలో ఆదర్శాలు నిలిపాలని, నిరంతరం హృదయ తరంగంలో నిండి ఉండే వెలుగుజ్యోతి, నిత్యకాంతి జ్యోతి నీవేనని చెప్పడం ద్వారా ఆ మహానీయునికి భారతజాతి ఘననివాళి అర్పించినట్టయ్యింది. ధర్మదేవత నాలుగు పాదములు, ‘బ్రహ్మదేవుని నాలుగు వేదములు ధర్మభూమిలో మరలా వెలసేలా బోధలుచేసిన ఓ బాపూ నమో మాకు న్యాయమార్గమే చూపు’ అంటూ సాగిన ప్రేరణాత్మక గీతం పెండ్యాల స్వరసారథ్యంలో మాధవపెద్ది, సుశీల మధుర గాత్రాలలో జాలువారి నేటికీ అలరిస్తోంది. వారి పేరుచెప్పుకుని ఓట్లు దండుకుని అవినీతికూపంలో కూరుకుపోతున్న రాజకీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలాలను తెలుసుకుని సమాజం, దేశంపట్ల తమ బాధ్యతలను గుర్తెరగాలంటే నేటి యువతరం తప్పక వినదగిన ప్రబోధగీతం.

-సుసర్ల సర్వేశ్వరశాస్ర్తీ, విశాఖపట్నం