Others

సంబరాల సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి.. తెలుగింటి లోగిళ్ళలో వెలుగుల కాంతి
ఉత్తరాయణ పుణ్యకాలం- ధనుర్మాస అంత్యకాలం
ఉవ్వెత్తున ఎగసిపడే భోగిజ్వాలలు
మకర సంక్రమణ అమృతఘడియలు- నూరు కోట్ల పుణ్యఫలాలు
ఈ పర్వదినాలు కావాలి శుభోదయం- సర్వమానవాళికి అభ్యుదయం
పెద్ద పండుగ శోభ- సర్వత్రా నిండాలి ఆనంద ప్రభ
పిండివంటల ఘుమఘుమలు- ధాన్యరాశుల గలగలలు
రంగుల హరివిల్లుల రంగవల్లులు- ఇంటిముంగిట కొలువుదీరిన గొబ్బెమ్మలు
తెలుగింటి ఆడపడుచుల సాంప్రదాయ దుస్తులు-
బొమ్మల కొలువుతో తరించే వనితలు
డూ.. డూ.. బసవన్నల సన్నాయినొక్కులు- హరిదాసుల సుమధుర సంకీర్తనలు
పల్లెపల్లె ముంగిట ఆనంద సంబరాలు- అంబరాన్నంటి రెపరెపలాడే పతంగులు
అమరులైన పితృదేవతలకు తర్పణం- జన్మజన్మల సార్థకం
ఎడ్ల పందాలు- పడవల పోటీలు- గ్రామసీమల్లో ఉత్సాహ తరంగాలు
వ్యాపారులకు కాసుల పంట - విద్యార్థులకు సెలవులతో ఊరట
చిన్నారుల కేరింతలు- కుటుంబమంతా పులకింతలుపొంగళ్ళతో తియ్యదనం- పాడిపంటలతో కమ్మదనం
సంక్రాంతి లక్ష్మి పిలుపు - సర్వజనులకు కావాలి మేలుకొలుపు

- ఎస్.వి.కృష్ణప్రసాద్