Others

నేనేంటో నాకు తెలుసు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోదట -రాశి ఖన్నా. నా లోపాలేంటో నాకు తెలిసినపుడు -ఎవరో చెప్తే ఎందుకు వినాలి? అని గడుసుగా ప్రశ్నిస్తోంది. అవునుమరి -ఒక పాత్ర చేసిన తరువాత దాని జడ్జిమెంట్, అందులో చేసిన మిస్టేక్స్ నేను గ్రహించగలను. అంతేగాని, సినిమా విడుదలైన వెంటనే ఎవరెవరో ఎవేవో చేసే కామెంట్లన్నీ నిజమైన లోపాలేననుకుని భయపడితే వైవిధ్యమైన పాత్రలు పోషించటం కష్టమట. అందుకే -వాటిని పట్టించుకోనని అంటోంది ఈ చక్కని చుక్క. బాగా చేశావని ఒకరంటారు. ఇంకొంచెం బెటర్ చేస్తే బావుండేదని ఇంకొకరంటారు. ఈ ప్లస్సులు, మైనస్సులకు నవ్వేస్తానంతే. నిజమైన లోపాలు ఆ పాత్ర చేసిన వాళ్లకు అర్థమైపోతుందని నా భావన. మనస్సాక్షిని మనఃస్ఫూర్తిగా అంగీకరిస్తే.. అదే -ఉన్నతికి బాట వేస్తుందన్నది నా నమ్మకం అంటోంది రాశి. ఫరవాలేదు.. అమాయకపు నవ్వుతో ఆకట్టుకునే రాశి ఎద లోతుల్లో చాలా విషయమే ఉందన్న మాట.