Others

అలర్జీలకు దారితీసే అలవాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు గోళ్లు కొరికే అలవాటు ఉందా? అయితే అలర్జీలకు చేరువవుతున్నట్లే లెక్క. వృత్తిలో టెన్షన్ పెరిగిందంటే చాలు కొంతమంది ఆడవాళ్లు గానీ మగవాళ్లు గానీ విపరీతంగా గోళ్లు కొరుకుతుంటారు. దీనివల్ల కొన్నిరకాల క్రిములు శరీరంలోనికి వెళ్లి కొన్ని వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా శరీరాన్ని వివిధ రోగాల బారినుంచి కాపాడే రోగ నిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అలాగే కొంతమంది పిల్లలకు నోట్లో వేళ్లు పెట్టుకుని చీకుతుంటారు. దీనివల్ల కూడా పిల్లల్లో అలర్జీ సమస్య తలెత్తుతుంది. న్యూజిలాండ్‌లో ఈ రెండు అలవాట్లపై చేసిన పరిశోధనల్లో వీరికి అలెర్జీలు సోకుతున్నట్లు కనుగొన్నారు.
ఈ అలవాట్ల వల్ల జలుబు, జ్వరం, అస్తామా వ్యాధులు వచ్చినట్లు కనుగొన్నారు. పిల్లల వయసు 5,7,9,11 సంవత్సరాలు ఉన్నపుడు ఈ రెండు దురలవాట్లు నేర్చుకుంటే దీని దుష్ప్రభావం 13,32 ఏళ్లమధ్యలో కనిపిస్తున్నట్లు గ్రహించారు. ఎందుకంటే పిల్లలు దుమ్మూధూళిలో ఆడుతుంటారు. అలాగే పెంపుడు జంతువులను పట్టుకుంటారు. దీంతో అవే వేళ్లను నోట్లో పెట్టుకోవటం వల్ల అలెర్జీ సంబంధిత వ్యాధులు సంభవిస్తున్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.