Others

చర్మకాంతికి అరటి పూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీదవాడి యాపిల్ అంటే అరటిపండు. ఈ పండులో ఎన్నో ఉపయోగాలు వున్నాయి అని వైద్య విధానం చెబుతోంది. శరీరానికి మిక్కిలి పోషక పదార్థం దానిలో ఉంది. అదీగాక అది చర్మ సౌందర్యానికి పెట్టని కోట. ఈ పండులో ఒకరకమైన ఎంజైమ్ చర్మం పొరలపై వున్న మృత కణాల్ని తొలగించి, చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండేట్లు చేస్తుంది. ఆరోగ్యానికి, సౌందర్య రక్షణకు రోజూ ఒక అరటిపండు తినాలి. ఈ పండుగాని, మరొక పండుగాని ఉదయం, మధ్యాహ్నం సమయాల్లోనే తినడం చాలా మంచిది. ఈ పండు తొక్కని తోలుబూట్లపై రుద్దితే పాలిష్‌కన్నా బాగా పనిచేస్తుంది. ఇక అందానికి ఈ పండు గుజ్జుతో ఫేస్‌ప్యాక్ చేసుకోవచ్చు. బాగా పండిన పండులోని పావుభాగాన్ని బాగా చిదిమి దానికి అరచెంచా రోజ్‌వాటర్, ఒక టీస్పూన్ నిమ్మరసం చేర్చి ఫేస్ ప్యాక్‌గా వాడవచ్చు. దాన్ని ముఖానికి పట్టించి పది నిముషాల తర్వాత శుభ్రంగా ముఖం కడుక్కోవాలి. కాసేపు ఆరనిచ్చితే చర్మం ఎంతో మృదువుగా, సొగసుగా, సున్నితంగా తయారౌతుంది. ఈ పండు జీర్ణవ్యవస్థను చక్కబరుస్తుంది. రోజూ ఒక మెత్తటి పండు తింటే సుఖ విరోచనవౌతుంది. దానితో బాటు లోపలి ప్రేగులను ఉత్తేజపరుస్తుంది. చెప్పాలంటే ఇది సౌందర్య పోషకంగా కాక అనేక రీతుల్లో ఉపయోగపడుతుంది.

- బి.విజయలక్ష్మి