Others

మొబైల్ ‘బ్రాండు’ చెబితేనే అడ్మిషన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ అనగా భారత రాజధానీ నగరం. ఇక్కడ వున్న 1400 ప్రయివేటు సంపన్న స్కూళ్ళల్లో (కార్పొరేట్) తమ తమ చిన్నారులను చేర్పించి, తరించాలనుకుంటున్న తల్లిదండ్రులకు నర్సరీ నుంచి ఐదో తరగతి దాకా పిల్లల్ని చేర్పించడంలో చుక్కలు కనబడుతున్నాయ్.
‘ఆదర్శ వరల్డ్ స్కూల్’ అని పేరున్న పాఠశాలవారు - ‘‘మీది సెల్‌ఫోన్ స్మార్ట్ ఫోన్ ఔనా? కాదా? అయితే, ఏ బ్రాండో రాయాలి’’ అంటున్నారు. ‘‘సొంత యిల్లుందా? వుంటే అద్దె ఎంత వస్తుంది?’’ లాంటి వివరాలు కూడా రాయమంటున్నారు.
ఇలాగే మరొక, బోలెడు బ్రాంచీలు వున్న స్కూలు ‘సాల్వాన్ స్కూలు’! వీళ్లు యింకా ‘అడ్వాన్సుడు’. ‘‘మీకు పిల్లలెందరు? ఇద్దరికంటే ఎక్కువ వుంటే సారీ! మీ పిల్లలితో సహా వెనక్కి తిరిగి వెళ్లిపోండి’’ అన్న నియమం పెట్టారు. అంతేనా? అక్కడ టీచర్లుగా ఉద్యోగం కావాలనుకున్నా కూడా ఒక్కరు లేక ఇద్దరు పిల్లలు మాత్రమే వుండాలి. ఆయానుంచీ ఏ.ఓ.దాకా అన్ని జాబ్స్‌కీ అదే రూలు. లేదా ‘‘పోయి రాకండి’’-
‘‘దేశంలో జనాభా పెరిగిపోతోంది. దాన్ని తగ్గించాలన్న సదాశయం మాత్రమే మాది’’ అంటున్నారు సాల్వాన్ స్కూల్ బాసులు.
‘‘కాకపోతే హైకోర్టు చేత మళ్లీ మొట్టికాయలు వేయించుకోవాలనుందేమో. ఢిల్లీలో, చిన్న పిల్లల స్కూళ్ళకు 298 ఆదేశిక సూత్రాలను ఢిల్లీ హైకోర్టు వారు లోగడ ప్రకటించారు. కాని అందులో రుూ రూలు ఎక్కడా లేదు. కాకపోతే జనవరి 23 గడువుంది కనుక రుూలోగా- హైకోర్టుకు పోయి, ‘రిట్’ వేస్తాం’’ అన్నారు కొందరు పేరెంట్స్. కొన్ని స్కూల్స్‌లో గ్రాడ్యుయేట్ కాని పేరెంట్స్ వున్న పిల్లలకి ప్రవేశం లేదంటారు! ఎక్కువమంది పిల్లలున్న తల్లిదండ్రులు ఫీజులు ఎగ్గొడతారేమోనని భయమేమో మరి స్కూలు యాజమాన్యానికి.