AADIVAVRAM - Others

ఎడారిలో నివాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక వివేకవంతుడు ఏదో పని మీద బయల్దేరాడు. మార్గమధ్యంలో ఒక ఎడారిని దాటాల్సి వచ్చింది. కొన్ని గంటలు ప్రయాణిస్తే అతను ఎడారిని దాటవచ్చు. మార్గమధ్యలో అవసరమయి సరంజామాని కూడా ముందు జాగ్రత్తగా తీసుకొచ్చాడు. ఎడారి మార్గంలో వెళుతున్నాడు.
ఆ ఎడారిలో అతనికి ఒక సన్యాసి ఎదురుపడ్డాడు. అతను ఆ సన్యాసిని చూసి ఆశ్చర్యపోయాడు. అంత నిర్జన ప్రదేశంలో ఒక గుడారం వేసుకుని ఆ సన్యాసి ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
వివేకి ‘నువ్వు ఎక్కడుంటావు’ అన్నాడు.
సన్యాసి ‘నేను ఈ ఎడారిలోనే నివాసముంటాను’ అన్నాడు.
వివేకి ఆశ్చర్యపోయాడు. జనావాసాలకు దూరంగా ఒంటరిగా సన్యాసి ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
‘నువ్వు ఒంటరిగా అందరికీ దూరంగా ఉండడానికి కారణమేమిటి?’ అని అడిగాడు.
సన్యాసి ‘నేను నా విశ్వాసానికి అనుగుణంగా జీవిస్తే జనాలు నా పట్ల సందేహం ప్రకటించారు. పైగా వాళ్లందరూ నాకన్నా పవిత్రమయిన జీవితం గడుపుతున్నట్లు భావించసాగారు. అట్లా అని వాళ్లు తప్పు చేశామని అనుకోలేదు. పైగా నా ఏకాంతానికి ఆటంకం కలిగిస్తున్నారు’ తమ అహంకారంతో నన్ను అడ్డుకున్నారు. నా మనసు గాయపరిచారు’ అన్నాడు.
వివేకి సన్యాసి చెప్పిందంతా విని ‘నీ సమస్య ఏమిటంటే నువ్వు నువ్వుగా ఉండడానికి ప్రయత్నించడం లేదు. అట్లాగే జనాలు ఎట్లా వున్నారో వాళ్లని అట్లా ఆమోదించడానికి సిద్ధంగా లేవు. నువ్వు ఈ రకంగా ఉంటే నిజానికి నువ్వు ఎడారిలో వుండడమే మేలు’ అన్నారు.
*

- సౌభాగ్య, 9848157909