Others

అదిరే.. అధికారిక విన్యాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగ్రరాజ్యం అధ్యక్షుడి ప్రమాణస్వీకారం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇష్టమున్నా లేకున్నా ప్రథమ పౌరురాలు సంప్రదాయ వస్త్ధ్రారణకు కట్టుబడాల్సిందే. గత ఐదు దశాబ్దాల నుంచి ప్రథమ పౌరురాలు ఎవరైనా శే్వతసౌధంలోకి అడుగుపెట్టబోయే ముందు జరిగే వేడుకలో బంతిలాంటి గౌన్‌ను సంప్రదాయంగా ధరిస్తూ.. అధ్యక్షుడితో కలిసి వేదికపైకి వచ్చి మెరుపుతీగలా మెరవటం అమెరికా ఆచారం. ఈ వేడుకను ‘ఇనాగరల్ బాల్’ అంటారు. వాషింగ్‌టన్‌లోని కన్వినె్షన్ సెంటర్‌లో జరిగే వేడుకలో ఇలా గత 50 సంవత్సరాల నుంచి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు రూపొందించిన బంతుల్లాంటి గౌన్లలో ఈ ముద్దబంతి పూల వంటి ప్రథమ పౌరురాళ్లు మెరిసిపోవటం ఆనవాయితీగా వస్తున్నది. గౌన్ రంగు ఒక్కొక్క సందేశాన్ని దేశ ప్రజలకు ఇచ్చినట్లుగా భావిస్తారు. విదేశీయురాలినైనప్పటికీ అమెరికా ఆచారాలను తూచా తప్పక పాటిస్తానని ఎన్నికలకు ముందే బహిరంగంగా వ్లెలడించిన మెలానియా వెనీలా క్రీమ్ కలర్ గౌన్ లో మెరిసిపోయింది. భుజాలకు సగం వరకే ఉండే ఈ గౌన్‌కు నడుము మధ్యలో సన్నటి ఎర్ర బెల్ట్ ధరించారు. ఈ గౌనులో ఆమె ముగ్ధమనోహరంగా ఉన్నది. గతంలో తోలు వస్తువులను అలంకరించుకునేవారు. కాని నేడు ఎలాంటి అలంకరణ వస్తువులు లేకుండా సింపుల్‌గా కనిపించారు. మిచెల్ ఒబామా కూడా రూబీ రెడ్ జాసన్ వూ గౌనును ధరించారు. నేలను తాకుతూ వయ్యారాలు పోయిన ఈ గౌనులో ఆమె ఒబామాతో కలిసి నృత్యం చేశారు. దేశ ప్రజలు మార్పు కోరుతున్నారు అనే సందేశం ఇచ్చారు.
అలాగే హిల్లరీ క్లింటన్ కూడా ఉదా రంగు గౌను లో మెరిసిపోయారు. నూయార్క్ డిజైనర్ ఫిలిప్స్ రూపొందించిన ఈ గౌనులో ఆమె ‘మూలాలను మరిచిపోవద్దని’ సందేశం ఇచ్చారు. ఇక జార్జిబుష్ భార్య లారా టెక్సాస్ డిజైనర్ మైఖేల్ రూపొందించిన ఎరుపు చాన్తీల్లోలో లేస్ గౌనును ధరించారు. మెడలో సన్నటి ముత్యాలహారాన్ని ఆనాడు ఆమె వేసుకున్నారు. రెండవ ఇనాగరల్ బాల్‌కు ఆమె బ్లూ ఎంబ్రాయిడరీ గౌనును ఎంపికచేసుకున్నారు.

చిత్రాలు..ట్రంప్, మెలానియా

ఒబామా దంపతులు

హిల్లరీ క్లింటన్ దంపతులు