Others

నీటిని ఆదా చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీటి వనరులను పెంచుకోవడం ఎంత ముఖ్యమో, వా టిని పొదుపుగా వాడుకోవడం అంతే ముఖ్యం. మనదేశంలో 60 శాతం సాగుభూమి వర్షాలపైనే ఆధారపడి వుంది. సాగునీటి కొరత వల్ల వ్యవసాయోత్పత్తులను ప్రజలకు అందించడం అసాధ్యం. కొన్ని ప్రాంతాల్లో నీరు తక్కువ స్థాయిలో వుంటుంది. ఉన్న నీటిని ఆదా చేస్తూ వీలైనంత ఎక్కువ భూమికి అందించాలి. తాగునీరు విషయంలోనూ మనం తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నేడు సుమారు 65 శాతం ప్రపంచ జనాభా నీటి కొరతను ఎదుర్కొంటున్నది. 65 శాతం నీటిని వ్యవసాయ రంగంలోను, 23 శాతం నీటిని పరిశ్రమలలోను, మిగతా 8 శాతాన్ని గృహ, ఇతర అవసరాలకు వాడటం జరుగుతోంది. గ్రామాల్లో ప్రతి వ్యక్తికీ రోజుకి కనీసం 40 లీటర్ల నీరు కావాలి. అయితే, నీటిలభ్యత ఆ స్థాయిలో లేదు. 85 శాతం నీటి అవసరాలను భూగర్భ జలాలు తీరుస్తున్నాయి. దీనివల్ల జలకాలుష్యం సమస్య ఏర్పడుతోంది. ఏటా ప్రపంచంలో కలుషిత నీటి వల్ల 8.5 లక్షల ప్రజలు చనిపోతున్నారు. ప్రతి ఆరుగురిలో ఒకరు మాత్రమే తగినంత నీటిని పొందగలుతున్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభాలో 1/3 వంతు జనాభా తీవ్ర నీటి కొరతకు గురికావచ్చు.
మనదేశంలో నీటి లభ్యతను పెంచితే అదనంగా 140 లక్షల హెక్టార్లను సాగులోనికి తేవచ్చని అంచనా. సాగునీటితోపాటు సరైన ఎరువులను సమకూర్చడం ద్వారా పంటల దిగుబడి, నాణ్యత పెరుగుతాయి. భూగర్భ జలాల స్థాయి తగ్గకుండా చూసుకోవాలి. వర్షపు నీటిని చెరువులు, గుంతలు, వాటర్‌షెడ్‌ల ద్వారా నిల్వ చేసి భూగర్భ జలాలను కాపాడుకోవాలి. బిందుసేద్యం, తుంపర సేద్యంతో మొక్కలకు కావలసిన మోతాదులో నీటిని సమకూర్చవచ్చు. ఈ పద్ధతులవల్ల దిగుబడి పెరగడమే కాకుండా భూమి కోత వుండదు. శ్రమ, ఇంధనం ఎక్కువగా ఖర్చవదు. వర్షపు నీటిని నిల్వచేస్తే భూగర్భ జలాల స్థాయి పెరుగుతుంది. నదుల అనుసంధానం ఖర్చుతో కూడుకున్నా ప్రయోజనాలు మాత్రం అనేకం. దేశంలో కొన్ని చోట్ల వరదలు, మరికొన్ని చోట్ల కరవుకారణంగా వ్యవసాయరంగానికి తీవ్ర నష్టం జరుగుతోంది.
నీటివనరుల పెంపునకు, ఆదాకు నిధుల కొరత ప్రధాన సమస్య అని ప్రభుత్వాలు చెపుతుంటాయి. నీటి ఆదాకు సంబంధించి అనేక చౌకైన ఆధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. భూగర్భ జలాలను మితిమీరి వాడితే నీటి లభ్యత తగ్గిపోవడమే కాకుండా, నీటి నాణ్యత పడిపోతుంది. వరి, గోధుమ, చెరకు వంటి పంటలకు నీరు ఎక్కువగా కావాలి. వీటి ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం. కానీ నీటి వనరులకు తీవ్ర నష్టాన్ని గమనించడం లేదు. కొన్ని భూములు ఎడారులుగా మారాక కళ్లు తెరుస్తున్నాం. నీటి వనరులను సక్రమంగా వినియోగించుకోవడంలో ప్రభుత్వ పాత్ర కూడా వుంది. నీటిని ఉచితంగా కానీ, బాగా తక్కువ ధరకి కానీ సరఫరా చేయడం సరైన పద్ధతి కాదు. కనీసం ఖర్చులైనా వచ్చేటట్లు ధర వుండాలి. ఉచితంగా లభించే నీటిని దుర్వినియోగం చేయడం జరుగుతున్నది.

-ఇమ్మానేని సత్యసుందరం