రాష్ట్రీయం

రెగ్యులరైజ్ కష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవుట్‌సోర్సింగ్‌పై తేల్చేసిన ఆంధ్ర
ప్రస్తుతానికి వేతనాల పెంపు
కాంట్రాక్టు సిబ్బందిపైనా చర్చ
ఆర్ధిక భారం తట్టుకోగలమా?
మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు
రెగ్యులరైజ్ చేయాలి: ఉద్యోగ సంఘాలు

హైదరాబాద్, నవంబర్ 21: అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సాధ్యంకాదని ఆంధ్ర ప్రభుత్వం తేల్చేసింది. అవసరమైతే వేతనం పెంచగలమని మాత్రమే పేర్కొంది. ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఛాంబర్‌లో శనివారం రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. రాష్ట్ర మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ భేటీలో పాల్గొన్నారు. ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి పివి రమేష్, ఇతర ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపుపై ప్రధానంగా కమిటీ చర్చించింది. 1993కు ముందు చేరిన నాలుగో తరగతి ఉద్యోగులను మాత్రమే రెగ్యులరైజ్ చేయాలని మంత్రివర్గం ఈ సందర్భంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రెగ్యులరైజ్ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగిస్తామని యనమల భరోసా ఇచ్చారు. 8వేల వేతనం ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. మూడోతరగతి ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై ఇంకా స్పష్టత లేకపోవడంతో వచ్చేవారం మరోసారి సమావేశమవుతామని యనమల అన్నారు.
రెగ్యులరైజ్ చేయాల్సిందే
రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి రాజకీయ నిర్ణయం చేయాలని ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ లెజిస్లేచర్ ఉపనాయకులు డాక్టర్ గేయానంద్ సచివాలయంలో సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీని కలిసి విజ్ఞప్తి చేశారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఏళ్ల తరబడి క్రమబద్ధీకరణ కోసం ఎదురు చూస్తున్నారని, చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా ఈ హామీ ఇచ్చారని, తర్వాత తెలుగుదేశం మ్యానిఫెస్టోలోనూ వాగ్దానం చేశారని దయానంద్ గుర్తుచేశారు. ఈమేరకు అవసరమైతే చట్ట సవరణ చేయడానికైనా వెనుకాడొద్దని సూచించారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు మూడు లక్షల వరకూ ఉన్నారని, వీరి సంఖ్యను ప్రభుత్వం కుదించి చూపడం సరికాదన్నారు. ఎమ్మెల్సీలతో మంత్రి యనమల మాట్లాడుతూ ఆర్ధిక ఇబ్బందులున్నా, ఈ విషయాన్ని సానుకూలంగా పరిశీలిస్తామన్నారు. సబ్ కమిటీని ఎమ్మెల్సీతోపాటు కలిసిన వారిలో కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గాంధీ, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి బాలకాశి ఉన్నారు.