జాతీయ వార్తలు

ప్రాథమిక హక్కులను హరిస్తున్న ఆధార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభలో ఎంఐఎం సభ్యుడు ఒవైసీ విమర్శ

న్యూఢిల్లీ,మార్చి 11: ఆధార్ వ్యక్తుల ప్రాథమిక హక్కులను హరిస్తుందని ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఒవైసీ శుక్రవారం లోక్‌సభలో ఆధార్ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ దీనిని తమ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఆధార్ కార్డు తప్పనిసరి అవునా? కాదా? అనేది స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆధార్ కార్డు లేకపోతే సేవలు లభిస్తాయా? లేదా? అనేది స్పష్టం చేయాలన్నారు. ఆధార్ స్వచ్ఛందమని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులోమాత్రం ఇది తప్పనిసరి అనే క్లాజును చేర్చిందని ఒవైసీ ఆరోపించారు. ఆధార్ కార్డు తీసుకోని వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారా? అని ఒవైసీ ప్రశ్నించారు. ఆధార్ కార్డులోని సమాచారాన్ని ఎలా కాపాడుతారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ సేవలను పొందాలంటే ఆధార్ కార్డు ఉండాలనే షరతు విధించటంలో అర్థం ఏమిటని ఒవైసీ నిలదీశారు.
ఈ బిల్లు అనేక సమస్యలను సృష్టిస్తుంది కాబట్టే తాము దీనిని వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు. అయితే తెలుగుదేశం సభ్యుడు కింజరాపు రామమోహన్‌నాయుడు, టిఆర్‌ఎస్ సభ్యుడు కొండా విశే్వశ్వరరెడ్డి, వైసిపి సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆధార్ బిల్లును సమర్థించారు. ఆధార్ మూలంగా ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు ఒనగూరుతాయని వారు చెప్పారు. కాగా, శుక్రవారం ఆధార్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.