కరీంనగర్

ప్రాజెక్టుల వేగవంతానికి ప్రజలు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జనవరి 21: జిల్లాలో నిర్మించబోతున్న ప్రాజెక్టుల భూసేకరణకు ప్రజలు సహకరించి, సకాలంలో పూర్తిచేసేందుకు తమవంతు కృషిచేయాలని కలెక్టర్ నీతూప్రసాద్ కోరారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ముంపుగ్రామాల ప్రజలతో సంధి చర్చల సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ, కాల్వల నిర్మాణంలోభూములు కోల్పోతున్న ప్రజలతో భూమి విలువ నిర్ణయించారు. గంగాధర మండలంలోని ఉప్పర మల్యాల గ్రామం ప్రధాన కాల్వకు గాను ఎకరాకు రూ.7లక్షలు, డిస్ట్రిబ్యూషన్ కాల్వకు రూ.6.50లక్షలు, భీమదేవరపల్లి మండలంలోని కొప్పూరులో ఎకరాకు రూ.4.7లక్షలు, భీమదేవరపల్లిలో ఎకరాకు రూ.5లక్షలు, చందుర్తి మండలం సనుగుల గ్రామంలో ఎకరాకు రూ.4.20 లక్షలుగా ధర నిర్ణయించారు. వేగిరంగా పబ్లికేషన్ ప్రక్రియ పూర్తిచేసి రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలన్నారు. ఇది భూమి విలువ మాత్రమేనని, బోర్లు, బావులు, పైపులైన్లు, ఇతర నిర్మాణాలుంటే సంబంధిత శాఖతో ధర నిర్ణయించి వాటికి అదనంగా చెల్లిస్తామన్నారు. భూసేకరణలో భూములు కోల్పోయిన వారి పిల్లలకు మంచి శిక్షణ ఇచ్చి, అనంతరం స్వయం ఉపాధి చర్యలు చేపడుతామన్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ పథకంలో అర్హులకు ప్రాధాన్యతనిస్తామన్నారు. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం పట్టుదలతో ఉందని వీటి నిర్మాణం వేగవంతంగా జరుగుతుంన్నారు. అధికారులు వ్యక్తిగత శ్రద్ధతో పనిచేయాలని సూచించారు. భూములు కోల్పోతున్న వారిపట్ల సానుభూతి ఉన్నా ప్రాజెక్టుల నిర్మాణంతో కరవు ప్రాంతం సస్యశ్యామలమై ఎంతో అభివృద్ది చెందుతామన్నారు. ఈసమావేశంలో జాయంట్ కలెక్టర్ పౌసమి బసు, భూసేకరణ ప్రత్యేక పాలనాధికారి వెంకటేశ్వర్లు, కరీంనగర్, సిరిసిల్ల ఆర్డీవోలు బి చంద్రశేఖర్, బి భిక్షానాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శంకర్, నటరాజ్, తహశీల్దార్లు, ఆర్ అండ్ బి, అటవీ శాఖ అధికారులు, ముంపు గ్రామాల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.