మెయన్ ఫీచర్

పెరుగుతున్న వైమానిక శక్తి ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుద్ధరంగంలో వైమానిక శక్తి ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రాధాన్యతకు తగినట్టుగానే యుద్ధ విమానాల కొనుగోలు కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయకా తప్పదు. నేడు ఒక ఆధునిక యుద్ధ విమానం ఖరీదు కొన్ని వందల కోట్ల మేర ఉంటోంది. వీటి ధరలు ఇంకా విపరీతంగా పెరుగుతున్నాయి. 2007లో మొత్తం 126 బహుళ పోరాట విమానాల (ఎంఆర్‌సిఎ) కోసం రూ. 42,000 కోట్ల మేర బడ్జెట్‌ను మన ప్రభుత్వం ప్రతిపాదించింది. అంటే ఒక్కొక్క యుద్ధ విమానం ఖరీదు రూ.330 కోట్లు! మరి అదే రాఫెల్ యుద్ధ విమానాలు ముప్పయి ఆరింటిని కొనుగోలు చేయడానికి ఇప్పుడు తొమ్మిది బిలియన్ డాలర్లు లేదా రూ.65వేల కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. అంటే ఒక్కొక్క విమానం ఖరీదు రూ.1500 కోట్లు. ఇది ఎస్‌యు-30ఎంకెఐ యుద్ధ విమానం కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. చెప్పాలంటే నాలుగో తరానికి చెందిన ఈ యుద్ధ విమానాలు అత్యంత బహుముఖ సామర్ధ్యం కలిగినవి. అంతర్జాతీయంగా ఇవి ఎంతో విశిష్టతను సంతరించుకున్నవి కూడా. 1961లో ఒక్కొక్క మిగ్-21 రకానికి చెందిన యుద్ధవిమానం ఖరీదు రూ.20 లక్షలు! కానీ ఇప్పుడు నేటి పరిస్థితులకు అనుగుణంగా ఆధునీకరించిన మిగ్-21 విమానాన్ని ఖరీదు చెయ్యాలంటే నాటి దానికంటే వందరెట్లు అధిక మొత్తం చెల్లించాల్సిందే! అదే ఒక్కొక్క ఎస్‌యు-30ఎంకెఐ యుద్ధ విమానం ఖరీదు ప్రస్తుతం రూ.360 కోట్లు.
ఇక రాఫెల్ యుద్ధ విమానాల విషయానికి వస్తే, వీటి జీవితకాలం 40-50 సంవత్సరాలు. అయితే నిర్ణీత కాలావధుల్లో వీటికి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టడం, ఆధునికీకరించడానికి మళ్లీ పెద్ద మొత్తంలో ఖర్చు చేయక తప్పదు. ఇక ఈ పోరాట విమానాలు ఉపయోగించే ఆయుధ సామగ్రి ఖరీదు కూడా తక్కువేం కాదు. రాడార్ సహాయంతో పనిచేస్తూ, లక్ష్యం (విమానం) నుంచి విడుదలయ్యే పరారుణ కిరణాలను గుర్తించగల సామర్ధ్యమున్న క్షిపణి ఖరీదు రూ.50-100 లక్షల వరకు ఉంటోంది. ఇక గాల్లోనుంచి గాల్లో ప్రయోగించే దీర్ఘ లక్ష్యాలను ఛేదించే సామర్ధ్యమున్న ఆధునిక క్షిపణుల ఖరీదు, మరో ఐదురెట్లు అధికం. ఇక మరింత కచ్చితంగా లక్ష్యాలను ఛేదించే లేజర్-గైడెడ్, టీవీ- గైడెడ్ క్షిపణులు కొనుగోలుకు మరింత ఖరీదు చెల్లించాల్సిందే.
ఇక వైమానిక స్థావరాలు, రన్‌వేలను ధ్వంసం చేయడానికి ఉపయోగించే ‘‘డ్యురాండల్’’ బాంబులు ఒక్కొక్కదాని ఖరీదు రూ.15 లక్షలనుంచి మొదలవుంది. ఇక గాల్లోనుంచి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణి ఒక్కొక్కదాని ఖరీదు రూ.15 కోట్లు! రెండో గల్ఫ్ యుద్ధం తర్వాత ఈ స్మార్ట్ ఆయుధాల వినియోగంపై అమెరికా ప్రభుత్వం ఒక అధ్యయనం నిర్వహించింది. దీని ప్రకారం..‘‘గతంలో ఆయుధాల కోసం చేసిన ఖర్చులో అత్యధికశాతం -92.4శాతం- ‘అన్‌గైడెడ్’ ఆయుధాలకోసమే ఉండేది. అయితే ప్రస్తుతం అది పూర్తిగా తల్లక్రిందులైంది. యుద్ధానికి అయిన మొత్తం ఖర్చులో 84 శాతం కేవలం 7.6 శాతం వినియోగించిన ‘గైడెడ్ ఆయుధాల’కోసమే వినియోగిం చారట! ఉదాహరణకు యుద్ధంలో వినియోగించిన మొత్తం ఆయుధాల్లో నుంచి ఉపయోగించిన 332 క్రూరుూజ్ క్షిపణలను తీసేస్తే, ప్రయోగించిన ‘అన్‌గైడెడ్’ ఆయుధాలు 92.6 శాతమని తేలింది. అప్పుడు ‘గైడెడ్ ఆయుధాల’కు అయిన ఖర్చు 75.9 శాతానికి తగ్గింది. అంటే ఇక్కడ ‘గైడెడ్ ఆయుధాలైన’ క్రూరుూజ్ క్షిపణుల్లో ఒక్కొక్కదాని ఖర్చు అత్యధికమని తేలుతోంది. ఆయుధాల కొనుగోలు ఖర్చులో 84 శాతం వరకు మొత్తం ఆయుధాల్లో కేవలం 7.6 శాతం వినియోగించే ‘గైడెడ్’ అస్త్రాల కోసం ఖర్చుచేస్తున్న పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు ‘గైడెడ్’ అస్త్రాలైన 332 క్రూరుూజ్ క్షిపణులను తీసివేస్తే, కొనుగోలు చేసే మొత్తం అస్త్రాల్లో‘అన్‌గైడెడ్’ ఆయుధాలు 92.6 శాతం. ఇక ఆయుధ వినియోగంలో చేసిన మొత్తం ఖర్చులో, గైడెడ్ ఆయుధాలకోసం చేసిన ఖర్చు శాతం 75.9కి తగ్గింది. ఇందుకు కారణం క్రూరుూ జ్ క్షిపణుల ఖరీదు అత్యధికం కావడమే.
లక్ష్యాన్ని ఛేదించడంలో కచ్చితత్వం వల్ల గైడెడ్ ఆయుధాలను విధ్వంస కారకాలుగా పరిగణిస్తున్నప్పటికీ, వైమానిక శక్తి మాత్రమే యుద్ధాల్లో గెలుపు సాధించడానికి సరిపోదు. ఒకవేళ అదే నిజమైతే వియత్నాంతో జరిగిన యుద్ధంలో అమెరికా విజయం సాధించి ఉండేది. అంతేకాదు ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లలో కూడా తిరుగులేని విజయాన్ని స్వంతం చేసుకొని ఉండేది. 2006లో లెబనాన్‌తో జరిగిన యుద్ధంలో, ఇజ్రాయిల్ అధికంగా వైమానిక శక్తిపైనే ఆధారపడింది. తిరుగులేని వైమానికశక్తి తన స్వంతమైనప్పటికీ ఇజ్రాయిల్ ఈ యుద్ధంలో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది.
ఇజ్రాయిల్ జరిపిన నాటి యుద్ధంలో హిజ్‌బొల్లా ఉగ్రవాదులు, సాధారణ పౌరులు కలిపి దాదాపు 1200 మంది మరణించారు. ఇదే సమయంలో కొద్ది సంఖ్యలో సైనికులను ఇజ్రాయిల్ కోల్పోయింది. అంతటి తీవ్రస్థాయి దాడిని కూడా హిజ్‌బొల్లా ఉగ్రవాదులు తట్టుకొని నిలబడటం విశేషమే. స్వల్పకాలం మాత్రమే జరిగిన యుద్ధంలో ఇజ్రాయిల్ 1.6 బిలియన్ యుఎస్ డాలర్లు ఖర్చు చేసింది. అంటే దాని వార్షిక ఆర్థిక వృద్ధిలో ఒకశాతం కోల్పోయినట్టు! ఇక లెబనాన్ విషయానికి వస్తే, హిజ్‌బొల్లా ఉగ్రవాదులు యధాప్రకారం తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంత రాజకీయాల్లో వారు వహించే కీలక పాత్రలో ఏవిధమైన మార్పు లేదు. మరి ఈ యుద్ధంలో ఎవరు గెలిచినట్టు? ఒకశాతం వార్షిక ఆర్థిక వృద్ధి నష్టపోయిన ఇజ్రాయిలా? లేక యుద్ధం ముగిసిన తర్వాత కూడా రాజకీయంగా ఈ ప్రాంతంలో కీలక పాత్ర పోషిస్తున్న హిజ్‌బొల్లానా?
ప్రస్తుతం మనకున్న విస్తృతమైన భౌగోళిక విస్తీర్ణ ప్రాంతాన్ని పరిరక్షించే ప్రాథమిక విధి మన సైన్యానిది. వైమానిక, పదాతి దళాల సమన్వయంతో యుద్ధంలో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని మనకు కార్గిల్ యుద్ధం నేర్పిన పాఠం. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో ఈ సమన్వయం మరింత ఉత్తమ ఫలితాన్నిస్తుంది. ఇక అణ్వస్త్రాలు మరో ప్రత్యామ్నాయ నిరోధక ఆయుధాలు. ఈ ఆధునిక ప్రపంచంలో నేడు ఎటువంటి పరిస్థితుల్లో వాటి విశ్వసనీయత బాగా ఉంటుందనే ప్రశ్న చాలా అరుదుగా మాత్ర మే వినిపిస్తుంది. ప్రతి దశలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకెళ్లడంలో మనకున్న అవకాశాలపై మన సైన్యం విశ్వసనీయత ఆధారపడి ఉంటుంది. అంటే మనకు ఎక్కువ అవకాశాలు అందుబాటులో ఉన్నప్పుడు ఎదురయ్యే పరిస్థితులను మరింత తేలిగ్గా ఎదుర్కొనగలుగుతాం. ఆయా పరిస్థితులను ఎదుర్కొనడానకి అవసరమైన ఐచ్ఛికాలను ఈ అవకాశాలు కల్పిస్తాయి.
ఆధునిక యుద్ధవిమానం అధిక ఖరీదుకు తగ్గట్టు, అవి బహుకాలం మన్నికతో ఉండి, నేటి వాతావరణంలో ఆధిపత్యాన్ని, తీవ్రస్థాయి ఘాతుక శక్తిని కలిగించేంతటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా వీటి స్వంతమై ఉండాలి. అంటే నేడు మనం కొనుగోలు చేసే ఆధునిక యుద్ధవిమానం రెండు లేదా మూడు అప్‌గ్రేడ్‌లకు అనువుగా ఉండాలి. విమాన డిజైన్, అభివృద్ధిని తర్వాతి కాలంలో చేపట్టేటప్పుడు, అప్‌గ్రేడ్ ఐచ్ఛికాలు మరిన్ని ఎక్కువ ఉండాలన్నమాట. ఉదాహరణకు మిగ్-21 యుద్ధ విమానాలను పరిశీలించండి. భారత వైమానిక దళంలో ఇప్పటికీ వాటి ప్రధాన పాత్ర కొనసాగుతూనే ఉంది. తాజాగా అభివృద్ధి పరచిన మిగ్-21-93 రకం పోరాట విమానంలో అత్యాధునిక ఆవియోనిక్స్, శక్తివంతమైన ఆర్-25-300 ఇంజన్‌ను అమర్చారు.
ఇక తర్వాత ముఖ్యంగా పరిశీలించాల్సింది ఖరీదు. దీన్ని గణించడానికి అనేక మార్గాలున్నాయి. అయితే మంచి చెడులను సరిపోల్చే సమయంలో కొన్ని కనిపించని ‘గోతు’లు ఉంటాయి. ఖరీదు, మన్నిక, ఘాతుక శక్తి, పనితీరు, యుద్ధ కౌశలం, ప్రత్యామ్నాయాలు, నిర్వహణా ఖర్చులు వంటి వాటి సహసంబంధ ఖర్చులను సమర్ధవంతంగా గణించే తరుణంలో రాజకీయపరమైన రిస్క్‌లతో పాటు ఇతర కారకాలను కూడా పరిశీలించక తప్పదు. కానీ ప్రాథమిక యూనిట్ ఖరీదుతో బేరసారాలు ప్రారంభించాలి. ఆధునిక యుద్ధ విమానాల కొనుగోలు అత్యంత ఖర్చుతో కూడినదనడంతలో ఎంతమాత్రం సందేహం లేదు. కానీ అందుకు తగ్గట్టుగా వీటిల్లో ఉపయోగించే యంత్ర సామగ్రి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినవి. అత్యాధునిక సామగ్రి, ఎలక్ట్రానిక్స్‌లను వీటిల్లో ఉపయోగిస్తారు. అందువల్ల వీటిని పూర్తిగా దేశీయంగా తయారుచేయడం సాధ్యంకాదు. చాలావరకు విడిభాగాలను దిగుమతి చేసుకోక తప్పదు. విమాన తయారీదారు లేదా మరే ఇతర దేశాల్లోని ఉపకరణ తయారీదారుల నుంచో వీటిని దిగుమతి చేసుకోవాలి. యుద్ధ సమయంలో వీటి అరుగు తరుగుదలలు అధికం. నిల్వ వున్న యుద్ధ సామగ్రి కూడా చాలా వేగంగా తరిగిపోతుంటుంది. కొత్త తరానికి చెందిన క్షిపణులు, బాంబుల్లో అధిక శాతం విదేశాలనుంచి దిగుమతి చేసుకున్నవే. వీటిని సుదీర్ఘకాలం పాటు భద్ర పరచడానికి ఉండదు. భద్ర పరచిన ఈ అస్త్రాల జీవితకాలం ఎంతో మనకు తెలియదు. అందువల్ల క్షిపణులు, బాంబుల సరఫరా నిరంతరం కొనసాగుతూనే ఉండాలి.
దాడికి ఉపయోగపడే విమానంతో పోల్చినప్పుడు, బహుముఖ పాత్ర పోరాట విమానాలు పూర్తి భిన్నం. గాలిలో, భూతల పోరాటాల కోసం ఈ బహు ముఖ పాత్ర విమానాలను ప్రత్యేకంగా రూపొందించారు. ఇక పోరాట విమానం కేవలం దాడులు మాత్రమే నిర్వహిస్తుంది. అంటే గాల్లోనుంచి భూమిపైకి ప్రయోగించే బాంబులు, క్షిపణులు వంటి వాటిని ప్రయోగించగలదు. పాతబడిన మిగ్-21 స్థానం లో ప్రవేశపెట్టడానికి ఎంఆర్‌సిఎలు ఉద్దేశించబడినాయి. ఇక తాజాగా భారత వైమానికదళంలో ప్రవేశపెట్టిన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సిఎ) తేజస్ 15 ఏళ్లపాటు సేవలందించగలదు. ఇటీవలి సంవత్సరాల్లో వైమానిక దళం మిగ్-23 రకం యుద్ధ విమానాలను కూడా పూర్తిగా తొలగించింది. ఇవి ముందుం డి సమర్ధవంతంగా పోరాడగల తేలికపాటి యుద్ధవిమానాలుగా పేరుపడ్డాయి. ఇక మిగ్-21 రకం విమానాలు మాత్రం అత్యంత విజయవంతమైనవిగా పరిగణిస్తారు. దాదాపు పదకొండు వేల వరకు ఈ తరహా విమానాలను ఉత్పత్తి చేయడమో లేక అప్‌గ్రేడ్ చేయడమో ఇప్పటివరకు జరిగింది. వీటి జీవితకాలం 2025 వరకు ఉంది.

-మోహన్ గురుస్వామి