అంతర్జాతీయం

పఠాన్‌కోట్ దాడిపై పాక్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్/ఇస్లామాబాద్, ఫిబ్రవరి 19: పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై ఉగ్రవాద దాడిపై పాకిస్తాన్ దర్యాప్తు ప్రారంభించింది. ఈఘటనకు సంబంధించి పలువురు వ్యక్తులపై పాక్ ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. పాక్ స్వదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎయుతాజ్ ఉద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దాడి వెనక జైషే ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ హస్తముందని భారత్ మొదటి నుంచీ ఆరోపిస్తోంది. ఆయితే ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా అతడి పేరు ప్రస్తావించకుండా ‘గుర్తుతెలియని వ్యక్తులు’ అంటూ పేర్కొన్నారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు వాయిదా పడ్డాయి. తాజాగా పంజాబ్ రాష్ట్రంలోని గుజ్‌రాన్‌వాలాలోని ఉగ్రవాద నిరోధక శాఖ(సిటిడి) కేంద్రంలో కేసు నమోదైంది. పఠాన్‌కోట్ దాడికి జైషే ఉగ్రవాద సంస్థే కారణమని భారత్ ఆరోపించడం, దానికి సంబంధించి ఆధారాలు అందజేయడం తెలిసిందే. దాడి వెనక జైషే చీఫ్ అజార్ ఉన్నాడని భారత్ చెబుతోంది. అంతేకాదు అజార్‌తోపాటు అతడి సోదరుడు రవూఫ్, మరో ఐదుగురు దాడికి సూత్రధారులంటూ పాక్‌కు స్పష్టం చేసింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అందజేసిన నివేదిక ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదుచేసినట్టు సంబంధిత అధికారులు వెల్లడించాయి.