ఆంధ్రప్రదేశ్‌

పోలవరం డ్యామ్ నిర్మాణానికి పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, ఫిబ్రవరి 19: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఎర్త్‌కం రాక్ ఫిల్ డ్యాం ఎలైన్‌మెంట్‌లో నిపుణుల సూచనల మేరకు గోదావరి నది అడుగు భాగాన్న మట్టి, రాయి పరీక్షల కోసం బోర్లు వేసే కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. రామయ్యపేట గ్రామ సమీపంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు 1978లోనే డిజైన్స్ చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో ఈ రకమైన పరీక్షలు కొంతమేర జరిగినట్టు ఇంజనీర్లు తెలిపారు. గతంలో సిడబ్ల్యూసి నుండి వచ్చిన నిపుణుల బృందంలోని ఎం వెంకటరావు, బాలసుబ్రహ్మణ్యం నదిలో నాలుగు ప్రదేశాలలో బోర్లువేసి మట్టి, రాయి సేకరించి, డ్యాం ఎంత వరకూ తట్టుకుంటుంది, పటిష్టత ఎంత తదితర పరీక్షలు చేయవలసిందిగా సూచించారు. డ్యాం ఎలైన్‌మెంట్‌లో భూమిపై 40 బోర్లు వేయవలసి ఉండగా, ఇప్పటి వరకూ 28 బోర్లువేసి అందులో నుండి మట్టిని, రాయిని సేకరించి, పరీక్షల నిమిత్తం సిఎంఎస్‌ఆర్ (న్యూఢిల్లీ) కేంద్రానికి పంపించారు. ప్రస్తుతం గోదావరిలో ప్రత్యేకంగా ఫంటుపై ఏర్పాటుచేసిన అత్యాధునిక హైడ్రాలిక్ రిగ్ ద్వారా బోర్లువేసి మట్టిని, రాయిని సేకరిస్తున్నారు. కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్టాయ్ ఏజన్సీ జిఎం జి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. ఆయన వెంట ఇంజనీర్లు కోటేశ్వరరావు, సంతోష్‌కుమార్, వై అర్జునరావు ఉన్నారు.