పంతం పట్టింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ షోకులతో కుర్రకారు హృదయాలను మత్తెక్కించి ఐటెం పాటలతో క్రేజ్ తెచ్చుకున్న హంసా నందిని మళ్లీ తన సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతోంది. ఈమధ్యే ఆమె చేసిన కొన్ని పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. దానికితోడు స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేస్తుండడంతో ఈమెకు అవకాశాలు తగ్గాయి. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న హంసా, కేవలం ఐటెం సాంగ్స్‌పైనే దృష్టి పెట్టకుండా సినిమాల్లో కీ రోల్స్ పోషించేందుకు సిద్ధమైంది. తాజాగా గోపీచంద్ హీరోగా నటిస్తున్న పంతం సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తూనే అందులో ఐటెం సాంగ్ చేస్తోందట. గతంలో గోపీచంద్ నటించిన లౌక్యం సినిమాలో నటించి ప్రత్యేక పాట చేసిన హంసాకు మంచి క్రేజ్ దక్కింది. మళ్లీ అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న ఈమె కాస్త గ్లామర్ డోస్ పెంచి మళ్లీ రసిక హృదయాలను పిచ్చెక్కించేందుకు సిద్ధమైంది. పంతం సినిమాలో పాత్ర బాగా నచ్చిందట. అందుకే నటిస్తానని చెప్పిందట. దాంతోపాటు మరో రెండు సినిమాల్లో కూడా ఐటెం సాంగ్ చేసే అవకాశాలున్నాయి.