జాతీయ వార్తలు

పేదల జీవితాల్లో వెలుగే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 22: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత దేశాన్ని తీర్చిదిద్దాలన్నదే తన ప్రభుత్వ ఆశయమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆర్థిక వ్యవస్థను శక్తివంతంగా తీర్చిదిద్దడమే కాకుండా పేదల జీవితాల్లో మార్పు తేవడం కూడా తమ ధ్యేయమని స్పష్టం చేశారు. పేదల జీవితాల్లో మార్పు తెస్తే వారికి ఉపాధి అవకాశాలు పెంపొందుతాయని, తమ సొంతకాళ్లపై నిలబడగులుగుతారని మోదీ అన్నారు. లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో రిక్షా కార్మికులకు విద్యుత్ రిక్షాలను పంపిణీ చేసిన మోదీ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న జన్-్ధన్ యోజన, ముద్రా యోజన, అటల్ పెన్షన్ యోజన కార్యక్రమాలను వివరించారు. ఇవన్నీ కూడా పేదల జీవితాలను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పరివర్తనను తీసుకు రావడానికి ఉద్దేశించినవేనని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయని, అత్యంత సంపన్న దేశాలు కూడా దీని ప్రభావంనుంచి బైటపడలేకపోతున్నాయన్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబడి, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒకే ఒక దేశం భారత్ అని చెప్పారు. ఈ వాస్తవాన్ని ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, ఇతర రేటింగ్ ఏజన్సీలన్నీ ముక్తకంఠంతో అంగీకరించాయని ప్రధాని అన్నారు.
వికలాంగుల పట్ల సమాజ వైఖరి మారాలి
వారణాసి: అంగవైకల్యం ఉండే వారిలో అసాధారణ సామర్థ్యాలు సైతం దాగి ఉండవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ అంటూ, అంగవైకల్యం ఉన్న వారికి గౌరవాన్ని, సాధికారికతను కల్పించడానికి తన ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. ‘ఒక వ్యక్తిని వికలాంగుడిగా ముద్ర వేసిననప్పుడు మన కళ్లు ఆ వ్యక్తిలో లోపం ఉన్న అవయవం ఏదో వెతకడం ప్రారంభిస్తాయి. ఈ ధోరణి మారాలి. ఎందుకంటే అలా చేసినప్పుడు జనం ఆ దురదృష్టవ్యక్తిలో దాగి ఉన్న అసాధారణ సామర్థ్యాలను గుర్తించకుండా పోతారు’ అని ప్రధాని అన్నారు. అంధుడైన ఓ వ్యక్తి చదవలేక పోవచ్చు. అయితే తన చేతి వేళ్ల ద్వారా బ్రెయిలీ లిపిని గుర్తించగలుగుతాడు. కళ్లున్న వ్యక్తిలో లేని అసాధారణ సామర్థ్యాన్ని అతను అలా అభివృద్ధి చేసుకోవచ్చు. అందుకే అలాంటి వారిని వికలాంగులుగా భావించరాదని, వారిని ‘వికలాంగులు’గా పిలవడానికి బదులుగా ‘దివ్యాంగులు’గా పిలవాలని తాను ఇటీవల సూచించానన్నారు.
మహామన ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
వారణాసి పర్యటనలో ప్రధాని వారణాసి- ఢిల్లీ మధ్య ‘మహామన’ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికులకు అత్యధునాతన సదుపాయాలు అందించే ఈ రైలు వారానికి మూడు రోజులు నడుస్తుంది. వారణాసి, న్యూఢిల్లీ మధ్య దూరాన్ని 14 గంటలకన్నా తక్కువ సమయంలో పూర్తి చేస్తుంది. అయితే మిగతా ఎక్స్‌ప్రెస్ రైళ్లకన్నా ఈ రైలులో చార్జీలు 15 శాతం ఎక్కువగా ఉంటాయి. భారతీయ సంతతికి చెందిన బ్రిటీష్ పార్లమెంటు సభ్యుడు లార్డ్ రాజ్ లూంబా, ఆయన సతీమణి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.