జాతీయ వార్తలు

ప్రాణం తీసింది విషమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ విషప్రభావం వల్లనే మృతి చెందిందని అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) మెడికల్ బోర్డు భావిస్తోంది. సునంద శరీరంలోని అవయవాలను పరీక్షించి ఎఫ్‌బిఐ ఇచ్చిన నివేదికపై మెడికల్ బోర్డు తన అభిప్రాయాన్ని తెలియజేసింది. సునంద కడుపులోని అవయవాలలో మానసిక వ్యాకులతను, ఆందోళనను నియంత్రించడానికి ఉపయోగించే ఔషధం అల్‌ప్రాక్స్ ఉన్నట్లు మెడికల్ బోర్డు ఏకగ్రీవంగా నిర్ధారణకు వచ్చింది. అయితే సునంద శరీరంపై సిరంజి గుచ్చినట్లు ఉన్న ఒక గుర్తును బట్టి ఆమెపై ఇంజెక్షన్ ద్వారా విషప్రయోగానికి గల అవకాశాలను తోసిపుచ్చలేమని కూడా మెడికల్ బోర్డు పేర్కొంది. సునంద శరీరంలో లిడోకాయిన్ ఉన్నట్లు ఎఫ్‌బిఐ నివేదిక ధ్రువీకరించిందని మెడికల్ బోర్డు తెలిపింది. ఎఫ్‌బిఐ నివేదికపై మెడికల్ బోర్డు తన అభిప్రాయాన్ని ఢిల్లీ పోలీసులకు తెలియజేసింది. సునంద మృతికి రెండు లేక అంతకన్నా ఎక్కువ ఔషధాల సంయోగం కారణం కాదని ఎయిమ్స్ మెడికల్ బోర్డు పేర్కొంది. ఈ కేసులో ముందుకు సాగడానికి ఎఫ్‌బిఐ నివేదిక ఎంతో కీలకంగా మారిందని పేర్కొంది. సునంద శరీరంపై ఉన్న సిరంజి గుచ్చిన గుర్తును బట్టి ఎవరికైనా ఇంజెక్షన్‌ను ప్రయోగించే అవకాశం ఉండిందా అనే కోణంలోనూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంటుందని మెడికల్ బోర్డు అభిప్రాయపడింది. సునంద మృతదేహం ఉన్న గదిలో ఖాళీ అల్‌ప్రెక్స్ టాబ్లెట్ల (27 టాబ్లెట్లు) స్ట్రిప్ లభించడం, సునంద కడుపులో, కడుపులోని అవయవాలు- ప్లీహం, కాలేయం, ఒక్కో కిడ్నీలో సగం వరకు, రక్త నమూనాలలో, మూత్రంతో తడిచిన ఆమె దుస్తులు, బెడ్ కవర్, బెడ్ షీట్‌లలో అల్‌ప్రాక్స్ అవశేషాలు ఉన్నట్లు ఎఫ్‌బిఐ నివేదిక ధ్రువీకరించడాన్ని బట్టి మోతాదుకు మించి అల్‌ప్రాజోలం టాబ్లెట్లను వేసుకోవడమే సునంద మృతికి కారణమై ఉంటుందని మెడికల్ బోర్డు పేర్కొంది. పళ్ల గాటు సహా సునంద శరీరంపై పలు గాయాలు ఉండటం, అందులో ఒకటి సిరంజి గుచ్చిన గుర్తు ఉండటంతో పాటు ఆమె శరీరంలో లిడోకాయిన్ అవశేషాలు ఉన్నట్లు ఎఫ్‌బిఐ నివేదిక పేర్కొనడాన్ని బట్టి ఆమెపై ఇంజెక్షన్ ద్వారా విషప్రయోగం జరిగిందనే అంశాన్ని కూడా తోసిపుచ్చలేమని మెడికల్ బోర్డు పేర్కొంది.