జాతీయ వార్తలు

ప్రజాస్వామిక సంస్థలపై సడలుతున్న ప్రజల విశ్వాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, జనవరి 22: పార్లమెంటులో సభాకార్యక్రమాలు స్తంభించిపోతున్న దృష్టాంతాలు రోజురోజుకు పెరుగుతుండటం పట్ల లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామిక సంస్థల పట్ల ప్రజల విశ్వాసం క్రమంగా సన్నగిల్లుతోందని ఆమె అన్నారు. శుక్రవారం ఇక్కడ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల 78వ సదస్సులో సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ చట్టసభలో నిర్మాణాత్మక కార్యక్రమం ఏదీ జరగదనే అభిప్రాయం సర్వత్రా నెలకొందని అన్నారు. తాము ఎన్నుకున్న ఎంపీల పట్ల ప్రజలకు ఉన్న అభిప్రాయానికి సంబంధించి 2001లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించిన ఒక వ్యాఖ్యానాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడికి దిగినప్పుడు మన భద్రతా సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉగ్రవాదులను సభలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ‘ఇంత పెద్ద దాడి జరిగితే ఒక్క ఎంపీ కూడా చనిపోకుండా ఎలా బయటపడ్డారు’ అంటూ ఒకరు వ్యంగ్య వ్యాఖ్యానం చేశారు. ఈ వ్యాఖ్య నన్ను కదిలించివేసింది. ఎంపీలమైన మనలను ప్రజలు ఎలా అవగతం చేసుకుంటున్నారు? అయితే ప్రజలకు మన పట్ల ఇంకా విశ్వాసం ఉందనే నేను నమ్ముతున్నాను. దాన్ని బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉంది. ప్రతికూల అభిప్రాయాలు వారి మనసులలో శాశ్వతంగా తిష్టవేయకుండా చూడవలసిన అవసరం ఉంది. దీనిపై మనం తీవ్రంగా ఆలోచించవలసి ఉంది’ అని అన్నారు.