క్రీడాభూమి

పిచ్‌ల తీరుపై స్మిత్ అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 22: భారత్‌తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో ఆస్ట్రేలియా పిచ్‌లు స్వభావానికి భిన్నంగా బౌలర్లకు ఏమాత్రం అనుకూలించని విధంగా ఉండడం పట్ల ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ బంతికి, బ్యాట్‌కు సరయిన పోటీ ఉండేలా చూడడం కోసం పిచ్‌లు ఇంతకు ముందుమాదిరి కాస్త పేస్, బౌన్స్ కలిగి ఉండాలని అభిప్రాయ పడ్డాడు. భారత్‌తో ప్రస్తుతం జరుగుతున్న వన్‌డే సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్‌లలో కూడా పిచ్‌లు ఏమాత్రం బౌలర్లకు అనుకూలించక పోవడంతో అన్నీ కూడా హైస్కోరింగ్ మ్యాచ్‌లుగా ముగిసిన విషయం తెలిసిందే. ఇటీవల న్యూజిలాండ్, వెస్టిండీస్‌లతో జరిగిన హోమ్ సిరీస్‌లలో కూడా పరిస్థితి ఇలాగే ఉండింది. వాకా, గబ్బా లాంటి పిచ్‌లు ఇంతకు ముందున్నట్లుగా కాస్త పేస్, బౌన్సీగా ఉంటే బాగుంటుందని స్మిత్ అభిప్రాయ పడ్డాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల ఆ పిచ్‌లపై జరిగిన టెస్ట్‌మ్యాచ్‌లు తనకు కొంత అసంతృప్తిని కలిగించాయని శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ స్మిత్ అన్నాడు. బ్యాట్‌కు, బంతికి మధ్య సమాన పోటీ ఉండే విధంగా పిచ్‌లుండాలని కూడా అతను అభిప్రాయ పడ్డాడు.
కాగా, ఇడ్డటికే వన్‌డే సిరీస్ నిర్ణయం అయిపోయినందున తమ జట్టు శనివారం ఇక్కడ జరిగే చివరి వన్‌డేను ఎంతమాత్రం తేలిగ్గా తీసుకోబోదని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో పాటుగా కోచ్ డారెన్ లీమెన్ స్పష్టం చేశారు. ‘మా లక్ష్యం 5-0. ఇప్పటివరకు మేము చాలా మంచి వన్‌డే క్రికెట్ ఆడాం. అందువల్ల ఈ వేసవికి అదే తగిన ముగింపు అవుతుంది. కాన్‌బెర్రాలో తీవ్రమైన ఒత్తిడిలో సైతం మేము రాణించిన తీరు చాలా సంతోషం కలిగిస్తోంది. మమ్మల్ని ఎవరూ గెలవలేరని మేము ఎప్పుడూ అనుకోవడం లేదు కానీ, మా నైపుణ్యం పట్ల మాకు ఎంతో నమ్మకం ఉంది’ అని స్మిత్ చెప్పాడు. లీమన్ సైతం దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘సొంత గడ్డపై ఆడుతున్నప్పుడు ఎవరైనా సరే ప్రతి మ్యాచ్ గెలవాలని అనుకుంటారు. మా బాధ్యతను నెరవేర్చడంతో పాటుగా జనాన్ని సంతోష పెట్టడం మా విధి’ అని లీమన్ అన్నాడు.