పర్వీన్‌రాజ్ హీరోగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లార్డ్ శివ క్రియేషన్స్ పతాకంపై పర్వీన్‌రాజ్ (ప్లేయర్ ఫేం) కథానాయకుడిగా ఓ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఆది మరుప్రోలు దర్శకత్వంలో ఎం.వి.ఎస్.సాయికృష్ణారెడ్డి రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, నేటి రోజుల్లో యువత ఆలోచనలను ప్రధానంగా తీసుకొని ఈ చిత్రాన్ని సందేశాత్మకంగా రూపొందిస్తున్నామని, త్వరలో హీరోయిన్‌తోపాటు అన్ని వివరాలు ప్రకటిస్తామని తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో టాకీపార్ట్ పూర్తిచేసి విశాఖపట్నం, గుంటూరు, విజయవాడలలో పాటల చిత్రీకరణ జరుపుతామని నిర్మాత సాయికృష్ణారెడ్డి అన్నారు. చంటి, వేణు, ఝాన్సీ, అప్పారావు, రాకెట్ రాఘవ, హరీశ్, ఆర్.పి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:కంతేటి శంకర్, నిర్మాత:ఎం.వి.ఎస్. సాయికృష్ణారెడ్డి, కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆది మరిప్రోలు.