జాతీయ వార్తలు

పత్రాల బహిర్గతం వెనుక బిజెపి దుర్బుద్ధి: నితీశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేయడం వెనుక బిజెపికి ఒక దురుద్దేశం ఉందని, స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా రకరకాల సిద్ధాంతాల మధ్య ఉన్న వైరుద్ధ్యాలను ముందుకు తీసుకురావాలన్నది దాని ఉద్దేశమని బిహార్ ముఖ్యమత్రి నితీశ్ కుమార్ శనివారం ఆరోపించారు. ‘స్వాతంత్య్ర పోరాటంతో బిజెపికి ఎలాంటి సంబంధం లేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేయడం ద్వారా దేశ స్వాతంత్య్ర పోరాట సమయంలోని రకరకాల సిద్ధాంతాల మధ్య వైరుద్ధ్యాలను ముందుకు తీసుకురావడానికి అది ప్రయత్నిస్తోంది’ అని ఆయన అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు రకరకాల సిద్ధాంతాలతో బ్రిటిష్‌వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. స్వాతంత్య్ర పోరాటం హీరో అయిన మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతంతో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే నేతాజీది రాడికల్ సిద్ధాంతం. అయితే అందరి లక్ష్యం బ్రిటిష్ వారి అరాచకంనుంచి దేశాన్ని విముక్తి చేయడమే’ అని నితీశ్ అన్నారు. అంతకుముందు నేతాజీ 119వ జయంతి సందర్భంగా బిహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవిద్, ముఖ్యమంత్రి నితీశ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.