జాతీయ వార్తలు

పరాకాష్ఠకు అసహనం: అశోక్ వాజ్‌పాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జనవరి 23: దేశంలో అసహనం పరాకాష్ఠకు చేరిందనడానికి హైదరాబాద్ యూనివర్శిటీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనే నిదర్శనమని ప్రముఖ కవి, రచయిత అశోక్ వాజ్‌పాయి స్పష్టం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఘటన తరవాత తనకు వచ్చిన డి.లిట్ పురస్కారాన్ని వాజ్‌పాయి వాపసు చేశారు. జైపూర్‌లో జరగనున్న సాహితీ ఉత్సవాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన దళితుడైన రోహిత్ వివక్ష భరించలేక ఆత్మహత్యకు పాల్పడితే స్పందించడానికి ప్రభుత్వానికి ఆరురోజుల సమయం పట్టిందని విమర్శించారు. స్కాలర్ మృతికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నానని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ దళిత సమస్యను తక్కువ చేసిన చూపారని వాజ్‌పాయి ఆరోపించారు. బిడ్డను కోల్పోయిన తల్లి బాధను తాను అర్థం చేసుకోగలన్న మోదీ అసలు సమస్యపై మాట్లాడకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. రోహిత మృతిపై స్పందించిన తీరు దారుణమని ఆయన పేర్కొన్నారు. వివక్షతో ఓ స్కాలర్ బలైపోతే కేంద్రం స్పందించడానికి ఇన్ని రోజులు తీసుకుంది అని ఆయన విమర్శించారు. రోహిత్ ఆత్మహత్యపై న్యాయవిచారణకు ఆదేశించడంపై వ్యాఖ్యానిస్తూ నిర్ణయం తీసుకోడానికి ఇన్ని రోజులు పట్టిందా? అని ప్రశ్నించారు.