సాహితి

పగలు విరిసిన కాంతిపుంజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాటుకను, కటిక చీకటిని,
కురులను, కారుమబ్బులను
తలదనే్న సిరా చుక్కకి
కాంతిని కరిగించగల చిక్కదనమట
కాలాన్ని కవ్వించగల చక్కదనమట

ఆ సిరా... చిరునవ్వుల చిన్నారిని
జోకొట్టే పాటవుతుందట
బతుకు బండికి బాటలు పరిచే
కాగితాల కోటవుతుందట
ఆ చుక్క... పక్క కుదరని పడుచుపిల్ల పక్కన నక్కి
నవనాడులను నమిలే మాటవుతుందట
బంధాల భావావేశాలలో, బాధ్యతల బంతాటలో
ముంచి తేల్చే తేటవుతుందట
రవ్వంత రీఫిల్‌కి, మువ్వంత ములికికి,
కూసింత కాగితానికి,
గుప్పెడంత గూటికి పరిమితమైన సిరా చుక్కకీ
నిన్నటిని నిలిపి ఉంచగల బిగతరమట
రేపటిని రూపుదిద్దగల రాజసమట
ఈ చక్కని చుక్క... గాలానికందని కాలానికి
అంకెల మకుటం పెడుతుందట
అలరించిన అనుభవాలకు అక్షర ఆసనం వేస్తుందట
ఈ చుక్కే... కోర్కెల సెలయేటికి
కొంగ్రొత్త పడవలు పంపుతుందట
ఆశయాల ఆకసానికి
ఆత్మవిశ్వాసపు నిచ్చెన నిర్మిస్తుందట
నీతికి, నైజానికి, నిందకు, నిజానికీ
అతీతమైన సిరాచుక్కకీ
అందాన్ని బంధించగల తెలుగుదనమట
ఆనందాన్నందించగల తియ్యదనమట
అంతటి సిరాచుక్క ఇప్పుడు....
అటక తటాకాన చిక్కి చుక్కలు లెక్కడుతుందట
పఠన కుటీరాన్ని కోల్పోయ
పచారీకొట్లో పొట్లమవుతుందట
ఆ రేయ చుక్కను కాదంటే...
విలువల వెలుగులు తొలగిన తెలుగులవౌతాయట
నవ విజ్ఞాన ప్రస్థానానికి
మన ఉనికిని తాకట్టు పెడతామట
అందుకే...
నిన్ను, నన్ను, మన్ను, మిన్ను వెలిగించగల
ఈ పగటి చుక్కకి
నిత్య పారాయణ ప్రమిదలట, నవ్యాక్షరాల దివ్వెలట
నవ్యాక్షరాల కాంతి పుంజాలట!

(వెలుగు చూడలేని కళ్ల కలంలోంచి వెలిగించిన కవిత)

email:
sahiti@andhrabhoomi.net

- పి. గాయత్రి, 8985314974