జాతీయ వార్తలు

పఠాన్‌కోట్‌పై తగ్గేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠాన్‌కోట్‌లోని వైమానిక కేంద్రంపై జరిగిన దాడికి సంబంధించి కుట్రపన్నిన వారిపై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవల్సిందేనని భారత్ తెగేసి చెప్పింది. ఈ దాడికి సంబంధించి పాకిస్తాన్‌లో జరుగుతున్న దర్యాప్తు తీరును తాము లోతుగా పరిశీలిస్తున్నామని విదేశాంగశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ గురువారం ఇక్కడ స్పష్టం చేశారు. ఈ దర్యాప్తు వివరాల ఆధారంగా కుట్రదారులను పాక్ కఠినంగా శిక్షించాలని ఈ విషయంలో తాము వెనక్కితగ్గేది లేదని తెలిపారు.పాకిస్తాన్‌లోని చెర్‌సద్దా వర్శిటీపై జరిగిన దాడి వెనక భారత్ హస్తం ఉందంటూ వచ్చిన ఆరోపణలు ఆయన ఖండించారు. పఠాన్‌కోట్ దాడికి సంబంధించి రెండు దేశాలకు చెందిన జాతీయ భద్రతాసలహాదారులు, విదేశాంగ కార్యదర్శులు పరస్పర సహకారంతో సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు. రెండు దేశాల విదేశాంగ కార్యదర్శులు మధ్య ఆమోదయోగ్యమైన తేదీల్లో సమావేశం జరుగుతుందని అయితే ఇందుకు ఎలాంటి గడువును నిర్ధేశించలేమని చెప్పారు. ఉగ్రవాదదాడి వివరాలను సేకరించేందుకు పాకిస్తాన్ ప్రత్యేక దర్యాప్తు బృందం పర్యటన విషయంలో తమకు ఏ రకమైన సమాచారం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో మొదట అధికారింగా ప్రకటన చేయడం తప్పతదుపరి వివరాలు పాక్ వెల్లడించలేదని స్వరూప్ చెప్పారు. మొక్కుబడి చందంగా కాకుండా స్పష్టమైన రీతిలోనే ప్రతిపాదన ఉండాలని అన్నారు. పాకిస్తాన్ సిట్ పర్యటనను తాము సూత్రప్రాయంగా అంగీకరించామని ఈ విషయంలో తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది వేచిచూడాల్సిందని అన్నారు. అసలు పాక్ సిట్ పఠాన్‌కోట్ వచ్చి ఏం చేస్తుంది? అక్కడి నుంచి ఎక్కడు వెళ్తుంది, దాని పరిశీలన అంశాలు ఏమిట అన్నది తేలకుండా ఈ ప్రతిపాదన ముందుకు వెళ్లజాలదన్నారు. కాగా పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌ను సందర్శించడానికి పాక్ ప్రతిపాదించిన సంయుక్త దర్యాప్తు బృందాన్ని తాము అనుమతించేది లేదని విదేశాంగ మంత్రి పారికర్ చేసిన వ్యాఖ్యలపై వికాస్ వివరణ ఇచ్చారు. రెండు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు ఇప్పటి వరకూ సమావేశం కాకపోయినా పరస్పరం సంప్రదింపులు జరుపుతునే ఉన్నారని అన్నారు. దాడికి కుట్ర పన్నిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా పాక్ తన నిజాయితీని రుజువుచేసుకోవాలని ఆయన తెలిపారు.