తెలంగాణ

పాతబస్తీలో పట్టు సడలని మజ్లిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పాతబస్తీలో పట్టు నిలుపుకుంది. పాతబస్తీలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. కాని మేయర్, డిప్యూటీ మేయర్‌లో ఏ పదవిని పొందే అవకాశం మజ్లీస్‌కు లేకుండా పోయింది. టిఆర్‌ఎస్‌కు సొంతంగా మెజార్టీ రావడంతో మజ్లిస్ ప్రతిపక్ష పాత్రకే పరిమితం కానుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, టిడిపి, బిజెపి కొట్టుకుపోగా మజ్లిస్ తన పట్టు నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో 43సీట్లను గెలుచుకున్న ఎంఐఎం తాజా ఎన్నికల్లో 44సీట్లను గెలుచుకోగలిగింది. కాంగ్రెస్, టిడిపి, బిజెపితోపాటు టిఆర్‌ఎస్ పార్టీ కూడా ఎంఐఎంను లక్ష్యంగా చేసుకున్నాయి. ఎంఐఎంపై విమర్శల వర్షం కురిపించాయి. పోలింగ్ సందర్భంగా ఎంఐఎం నాయకులు, అధికార టిఆర్‌ఎస్ సహ ఇతర పార్టీల నాయకులపై దాడులకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ కలసి ఎంఐఎంపై గవర్నర్‌కు ఫిర్యాదు కూడా చేశాయి. కాగా ఎంఐఎం తనకు బలమున్న ప్రాంతాల్లో అభ్యర్థులను గెలిపించుకుంది. ఒవైసీ సోదరులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ పార్టీ శ్రేణులను చైతన్య పరుస్తూ ప్రచారం చేశారు. ఇదిలావుంటే గత ఎన్నికల్లో ఎంఐఎం మూడో స్థానంలో నిలిచినా, 53 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీ కలసి మేయర్ పీఠం దక్కించుకున్న విషయం విదితమే. తొలుత కాంగ్రెస్ పార్టీ తరఫున బండ కార్తీక రెడ్డి మేయర్‌గా ఎన్నిక కాగా, అటు తరువాత ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్‌కు మేయర్ పదవి వరించింది. అయితే ఈ సారి ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకోవడంతో ఎంఐఎంకు ఆ అవకాశం లేనట్టే. మలక్‌పేట అసెంబ్లీలో ఆరు డివిజన్లకు నాలుగు డివిజన్లు, చార్మినార్ అసెంబ్లీలో ఆరు డివిజన్లకు నాలుగు డివిజన్లు, యాకుత్‌పురాలో ఆరు డివిజన్లకు ఐదు డివిజన్లు, చాంద్రాయణగుట్టలో ఏడు డివిజన్లకు ఏడు డివిజన్లు, బహదుర్‌పురాలో ఆరు డివిజన్లకు ఐదు డివిజన్లు, గోషామహల్‌లో ఆరు డివిజన్లకు రెండు డివిజన్లు, రాజేంద్రనగర్‌లో ఐదు డివిజన్లకు రెండు డివిజన్లు, కార్వాన్‌లో ఆరు డివిజన్లలో ఐదు డివిజన్లు, నాంపల్లిలో ఏడు డివిజన్లకు ఆరు, జూబ్లిహిల్స్‌లో ఏడు డివిజన్లకు మూడు డివిజన్లు గెలుపొందారు. ఇదిలావుండగా పురానాపూల్‌లో తమ ఎంఐఎం అభ్యర్థి గెలుపొందడం లౌకిక వాదానికి నిదర్శమని హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. ఇక్కడి నుంచి తమ పార్టీ బరిలో దింపిన హిందూ అభ్యర్థిని గెలిపించడాన్ని ఆయన సెక్యులరిజం విజయంగా ఆయన అభివర్ణించారు. ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన వారిలో ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ (రహమత్‌నగర్) మోహన్ (జాంబాగ్) రాజేందర్ యాదవ్ (కార్వాన్)లు ఉన్నారు.