సబ్ ఫీచర్

పండ్ల గుజ్జుతో చర్మం మిలమిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శారీరక సౌందర్యం కోసం ఖరీదైన లోషన్లు, క్రీములను మితిమీరి వాడడం వల్ల రసాయనాల దుష్ప్రభావం బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సొంత వైద్యంతో ఇబ్బందులను ఎదుర్కొనే బదులు ఇంట్లోనే కొద్దిపాటి చిట్కాలు పాటిస్తే చర్మ సంరక్షణ సులభంగానే సాధ్యపడుతుంది. ఆయా సీజన్లలో లభించే తాజాపండ్లను తినడానికే కాదు, శారీరక సౌందర్యం పెంచుకునేందుకు కూడా వాడవచ్చు. విలువైన పోషకాలున్నందున పండ్ల గుజ్జును ముఖానికి, శరీరంలోని ఇతర భాగాలకూ రాసుకుంటే చర్మం మిలమిల మెరుస్తుంది. అరటి, ఆరంజ్, స్ట్రాబెర్రీ వంటి పండ్లే కాదు, కొబ్బరి, కీరదోస వంటివి కూడా చర్మ సంరక్షణకు దోహదపడతాయి.
అరటిపండ్లతో..
పొడిచర్మం గలవారు అరటి పండ్ల గుజ్జును రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. చల్లార్చిన పాలలో అరటి పండ్ల ముక్కలు వేసి గుజ్జుగా చేసుకుని కాస్త నిమ్మరసం కలిపి చర్మానికి రాసుకుని అరగంట తర్వాత చన్నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారానికి నాలుగైదు సార్లు ఇలా చేసుకుంటే చర్మం తేమను సంతరించుకుంటుంది. శరీరంపై మచ్చలు, ముడతలు అంతరించిపోతాయి.
ఆరంజ్ రసంతో..
మంచి రుచిని అందించే ఆరంజ్ పండ్లు దేహ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి. తాజా పాలమీగడలో రెండు చెంచాల ఆరంజ్ రసం కలిపి పేస్టులా చేసుకుని శరీరానికి రాసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ‘ఫేస్ ప్యాక్’లా కూడా వేసుకోవచ్చు. చర్మంపై మృతకణాలను తొలగించే గుణం ఆరంజ్ రసంలో ఉంది. పాలమీగడ కారణంగా చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.
ఆపిల్స్‌తో..
చర్మం పొడిబారుతున్నట్లు అనిపిస్తే ఆపిల్ పండ్లను ముక్కలుగా చేసి పాలలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత పరిశుభ్రమైన నీటితో కడిగేసుకోవాలి. ఇలా కొన్నిరోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే, నల్లటి మచ్చలు తొలగిపోయి చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. చర్మం పొడిబారడం, పగుళ్లు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే, తాజా స్ట్రాబెర్రీ పండ్లను గుజ్జులా చేసి కాస్త మలాయ్ కలిపి ముఖంపై పొరలుగా రాసుకుని అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి మంచి రంగు, నిగారింపువస్తాయి.
కొబ్బరి నీళ్లతో..
కొబ్బరి నీళ్లలో కాస్త తేనె కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేసుకోవాలి. రోజు విడిచి రోజు ఇలా చేస్తే ముఖచర్మం కాంతులీనుతుంది. కొబ్బరి నీళ్లలోని యాంటీ ఆక్సిడెంట్లతో చర్మానికి మెరుపుదనం వస్తుంది.
పండ్ల గుజ్జుతో ఫేస్‌ప్యాక్ వేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లకు హానికలగకుండా వీటిని వినియోగించాలి. పండ్ల గుజ్జులో నిమ్మరసం కలిపితే కంటికి తగలకుండా చూసుకోవాలి. చెవులు, కళ్ల వద్ద సున్నితమైన చర్మానికి తగలకుండా ఫేస్‌ప్యాక్‌లు వేసుకోవడం ఉత్తమం.
*