రాష్ట్రీయం

ప్రైవేట్ వ్యక్తులకు 250 ఎకరాల కేటాయింపు చెల్లదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన 250 ఎకరాల భూమిని బంజారాహిల్స్, గచ్చిబౌలికి సమీపంలో పుప్పాలగూడ వద్ద ప్రైవేట్ వ్యక్తులకు నష్టపరిహారం, పునరావస చట్టం కింద ఏపి భూపరిపాలన కమిషనర్ కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు శుక్రవారం సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోంస్లే, ఎస్‌వి భట్‌లతో కూడిన ధర్మాసనం ఇచ్చింది. ఈ భూమి కేటాయింపును సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై పై తీర్పు ఇచ్చారు. ఈ భూమిని 2006 ఫిబ్రవరి 28వ తేదీ నుంచి అదే ఏడాది జూన్ 28 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించారు.
1953లో పరుశురాం రాంచద్ మంగీర్ , భగవాన్‌దాస్ మఖిజ్‌కు రెండు వందల ఎకరాలను నిర్వాసితులైన వ్యక్తుల నష్టపరిహారం, పునరావాసం చట్టం 1954, ఆడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎవాక్యూ ప్రొపర్టీ చట్టం 1950 కింద కేటాయించారు. 2003, 2006 సంవత్సరంలో పైన పేర్కొన్న వ్యక్తి వారసులమంటూ రమేష్ పరుశురాం మలానీ, మఖిజాలు సంబంధించిన అధికారులను భూమిని తమ పేర్లమీద బదిలీ చేయాలని కోరారు. వీరి వినతిపత్రాలను పరిశీలించి అప్పటి భూమి పరిపాలన శాఖ 2003, 2006లో ఈ భూములను వారసులకు కేటాయించింది. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ భూమి కేటాయింపులను సవాలు చేశారు. దీనిపై మలాని, మఖిజ అనే ప్రైవేట్ వ్యక్తులు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు స్టేటస్ కోను జారీచేసింది. డిపిసిఆర్ చట్టం, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈ భూమి కేటాయింపులు జరిగాయని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు ఈ కేటాయింపులు చెల్లవని ప్రకటించింది. ఇందులో అవకతవకలు ఉన్నట్లు హైకోర్టు పేర్కొంది. ప్రజా ఆస్తులకు ప్రభుత్వమే సంరక్షించాలని పేర్కొంది.