అదిలాబాద్

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఫిబ్రవరి 14: గురుకుల కళాశాలలు, పాఠశాలల్లో ప్రవేశం కోసం ఆదివారం ఆదిలాబాద్ ఊట్నూర్‌లలో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల కోసం ఆదిలాబాద్‌లోని గురుకుల పాఠశాల, గురుకుల కళాశాలలో రెండుకేంద్రాలు ఏర్పాటుచేయగా, ప్రవేశం కోసం 306 మంది దరఖాస్తు చేసుకోగా, 281మంది హాజరయ్యారు. ఊట్నూరు లాల్‌టెక్‌డీ పరీక్ష కేంద్రంలో ఆదివారం ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగియగా, 492మంది అభ్యర్థులకు గాను 306 మంది హాజరయ్యారు. ఆదిలాబాద్ పరీక్ష కేంద్రాలను పీవో పరిశీలించి పరీక్ష జరుగుతున్న తీరుతెన్నుల గూర్చి ఆరా తీశారు.

వసతిగృహంలో డిఆర్‌వో తనిఖీ
జన్నారం, ఫిబ్రవరి 14: మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని జిల్లా రెవెన్యూ ఆఫీసర్ (డిఆర్‌వో) సంజీవరెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతిగృహంలోని గదులను పరిశీలించిన అనంతరం విద్యార్థుల చదువులపట్ల అడిగి తెలుసుకున్నారు. అనంతరం వసతి గృహంలోని ప్రహారీగోడ నిర్మాణం, రోడ్డు నిర్మాణంపై ఆయన పరిశీలించారు. కాగా, డిఆర్‌వో ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో వసతిగృహంలోని వార్డెన్, వాచ్‌మెన్‌లు లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేయనున్నట్లు డిఆర్‌వో సంజీవరెడ్డి తెలిపారు. ఆయన వెంట పొనకల్ వీఆర్‌వో దినేష్ నాయక్ ఉన్నారు.

నాణ్యమైన ఆహారం అందించాలి
* అదనపు జిలా ల కలెక్టర్ సంజీవ్‌రావు
ఊట్నూరు, ఫిబ్రవరి 14: విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని అదనపు జిల్లా కలెక్టర్ సంజీవ్ అన్నారు. ఆదివారం బీసీ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా విద్యార్థుల హాజరు శాతం, అటెండెన్స్ రిజిష్టర్‌లు, స్టాక్‌ను పరిశీలించారు. వార్డెన్ గైర్హాజరుకావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించడంతో పాటు నాణ్యమైన సరుకులు తీసుకురావాలన్నారు. బయటఉన్న పిల్లలను తీసుకువచ్చే యత్నంచేయాలని, పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలని సూచించారు. అనంతరం హాస్టల్ విద్యార్థులతో ముచ్చటించారు.

ఉత్తీర్ణత శాతం పెంచాలి
* పివో ఆర్‌వి కర్ణన్
ఊట్నూరు, ఫిబ్రవరి 14: రాబోయే పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచాలని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్‌వి కరుణన్ అన్నారు. శనివారం రాత్రి క్రీడా ఉన్నత పాఠశాల, గిరిజన సంక్షేమ బాలుర వసతిగృహం లాల్‌టెకిడిలోని ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల చదువు గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు స్థానికంగా ఉంటూ ఎప్పటికప్పుడు విద్యార్థులకు పరీక్షలు సిద్ధం చేయాలన్నారు.

మంచిర్యాల ఉద్యోగులకు తగ్గిన ఇంటి అద్దె భత్యం
మంచిర్యాల, జనవరి 20: మంచిర్యాల పట్టణ పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగుల ఇంటి అద్దె భత్యాన్ని (హెచ్‌ఆర్‌ఏ) తగ్గించడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 20శాతం ఇంటిఅద్దె భత్యాన్ని పొందగా.. ఇక నుంచి 14.5 శాతం మాత్రమే ఇంటి అద్దెను తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనితో ఉద్యోగుల జనవరి నెల వేతన బిల్లులను 14.5 శాతంతో తయారు చేయాలని ఖజానా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాలోని రామగుండం పరిసర ప్రాంతాల్లో 20 శాతం అద్దె భత్యం అమలులో ఉండగా, మంచిర్యాల పట్టణం కూడా రామగుండం పట్టణానికి నిబంధనల మేరకు అవసరమయిన దూరం లోపలే ఉందని ఇప్పటివరకు మంచిర్యాల పట్టణ ఉద్యోగులకు 20శాతం ఇంటిఅద్దెను చెల్లిస్తున్నారు. కాగా, రామగుండం పట్టణానికి సమీపంలో ఉన్న జైపూర్ మండలంలోని రామరావుపేట, ఇందారం, టేకుమట్ల గ్రామాల్లో ఉద్యోగులకు 20శాతం భత్యం ఇస్తుండగా, మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు హెచ్‌ఆర్‌ఏ 20 శాతం ఇవ్వాలని కోర్టుకు వెళ్లారు.

రిమ్స్ డైరెక్టర్ అశోక్‌ను తొలగించాలి
* ఎంఐఎం టౌన్ అధ్యక్షుడు మహ్మద్ ఫారుక్ హైమద్
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 14: రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అశోక్‌ను తొలగించాలని, డైరెక్టర్‌గా ఆయనకు అర్హతలేదని ఎంఐఎం టౌన్ అధ్యక్షుడు మహ్మద్ ఫారుక్ హైమద్ అన్నారు. ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జివో 99 ద్వారా ఆయనకు అర్హతలేదని, మెడికల్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో రిటైర్డ్ సూపరిండెంట్‌కు అర్హత ఉందన్నారు. సీనియర్ వైద్యులు రవీందర్‌రెడ్డి, అజయ్ తడ్‌కరేలకు జనవరి 2016లో ఎక్స్‌టెన్షన్ ఇచ్చారని, రిటైర్డ్ ప్రొఫెసర్లకు మాత్రమే ఈ అవకాశం ఇవ్వాలన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పది సంవత్సరాల అనుభవం ఉన్నవారికి మాత్రమే రిమ్స్ డైరెక్టర్ పోస్టు ఇవ్వాలని అర్హతలేని డాక్టర్ అశోక్‌ను వెంటనే విధులను నుండి తొలగించాలని ఆయన డిమాండ్‌చేశారు. సిమి ఆటానమస్ బాడీ డిఎంఈ కంట్రోల్‌లో ఉంటుందని, రిమ్స్ డైరెక్టర్ అశోక్ కొనసాగినట్లయితే ఎంఐఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసి ఆర్‌కు, మంత్రి కేటిఆర్‌కు, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి ఫిర్యాదుచేయనున్నట్లు తెలిపారు. ఇటీవల రిమ్స్ ఆసుపత్రి సామాగ్రి కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని డాటా కౌన్సిలర్, ఆర్ట్ కౌన్సిల్ అపాయంట్‌మెంట్లలో అవకతవకలు జరిగాయన్నారు. డాటా కౌన్సిల్, ఈఎన్‌టి మిషన్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని వాటిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కానింగ్, స్క్రాబ్, మైక్రోస్కోబ్ డిపార్టుమెంట్లలో పరిమితంగా విద్యార్థులు ఉన్నా.. ఎక్కువ మంది ఉన్నట్లు తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంఐఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ అశోక్, హర్షద్, డాక్టర్ సలీం, జమీల్, మున్ను, ఎండి అస్లాం తదితరులు పాల్గొన్నారు.

వనాలు పచ్చగా ఉంటే సకాలంలో వర్షాలు
* ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు
మంచిర్యాల, ఫిబ్రవరి 14: వాతావరణంలో సమతౌల్యం దెబ్బతినకుండా ఉండాలంటే వనాలు పచ్చగా ఉంటేనే సకాలంలో వర్షాలు కురుస్తాయని ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు నల్లాల ఓదెలు పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాల రేంజ్‌లో గల గాందారీ వనంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రభాకర్ పుష్పగుచ్చంతో నల్లాల ఓదెలుకు స్వాగతం పలికి గాందారీ వనం కలియతిరిగి ఆయనకు వివిధ రకాల ఔషద మొక్కలు, వృక్షజాతి మొక్కల పట్ల వివరాలు తెలియజేశారు. అనంతరం విప్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అడవుల శాతాన్ని 33శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకుగాను ప్రభుత్వం గాందారి వన అభివృద్దికి సుమారు రూ.3.50కోట్ల నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీ ఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అటవీ శాఖను సైతం భాగస్వామిని చేయడం , అలాగే అటవీశాఖాధికారులు మొక్కల పెంపకం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించడంతో హరితహారం కార్యక్రమం ముందుకు సాగుతోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారులు అప్పయ్య, అనిత, స్పెషల్ పార్టీ అధికారి మానయ్య, డిప్యూటీ ఎఫ్ ఆర్‌వో ఇక్బాల్ హుస్సేన్, శ్రీనివాస్ రెడ్డి, ఫారెస్ట్ బీట్ అధికారి సయ్యద్ జావేద్‌లతో పాటు మంచిర్యాల డివిజన్‌లో గల సుమారు 80మంది అటవీశాఖ సిబ్బంది, ఎంపిపి బొలిశెట్టి కనకయ్య, జడ్పీటీసీ సుదర్శన్ గౌడ్, క్యాతన్‌పల్లి సర్పంచ్ జాడి శ్రీనివాస్, తిమ్మాపూర్ సర్పంచ్ దారావత్ తిరుపతి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

కుంరం భీం డి1 కాల్వకు గండి
* నీటి మునిగిన పంటలు - తాత్కాలిక మరమ్మత్తులు
వాంకిడి, ఫిబ్రవరి 14: కుంరంభీమ్ ప్రాజెక్టు ప్రధాన కాల్వ నుండి విడదీసి నిర్మించిన డి1 కాల్వకు శనివారం రాత్రి గండిపడింది.దీంతో శని,ఆధివారాల్లో పక్కనే ఉన్న పంటపోలాల్లోకి వరదనీరు చేరి పంటలు దెబ్బతిన్నాయి. కాల్వ నిర్మాణంలో దొరిలిన తప్పు)తో కాల్వ నిర్మించిన కేవలం రెండు సంవత్సరాలకే గండిపడిందని చుట్టుపక్కల రైతులు వాపోతున్నారు. కాల్వకు గండిపడడంతో పంట నీట మునిగిందని వారు వాపోతున్నారు. ప్రధాన కాల్వ నుండి దాదాపు రెండు కిలో మీటర్ల దూరంలోనే డి1 కాల్వకు గండిపడే సూచనలు కనబడినా గతంలో అధికారులు పట్టించుకోలేదని,శనివారం డి1 కాల్వలకు గండిపడనే పడింది.దీంతో నెమ్మదిగా నిద్రమత్తు నుండి మేలుకొన్న ప్రాజెక్టు నిర్మాణ అధికారులు వెంటనే స్పందించి కాల్వను పూడ్చడానికి చేసిన ప్రయత్నాలు సాయంత్రానిగాని ఫలించలేదు, నీటి ప్రవాహావం అదుపులోకి రాలేదు. దానిని ఎలాగైన పూడ్చి పంటలు పాడుకాకుండా చర్యలు తీసుకొంటామని కన్‌స్ట్రక్షన్ జేఇ అమిత్ తెలిపారు. డి1 కాల్వను సిసితో నిర్మించాలని చుట్టుపక్కల రైతులు కోరినా అప్పుడు ప్రాజెక్టు అధికారులు స్పందించలేదు. అదేవిధంగా బండ్‌కూడా పెద్దగా వేయలేదు.పైగా బండ్‌వేయవలసిన చోటు లోతు ప్రాంతం కావడంతో ఇటు కాల్వనీరు,అటు వరద నీటితో తడిసిన డి1 కాల్వ సీపేజి వాటర్‌తో కొద్ది కొద్దిగా పగులు తేలి శనివారం రాత్రి పగిలి చుట్టుపక్కల పోలాలల్లో నీరు పోయి పంటలను దెబ్బతీసింది. ఇది గమనించిన అదికారులు తాత్కాలిక మరమ్మత్తులు చేసినారు. అయితే ఈ గండి పడ్డ చోట మరోసారి గండిపడే అవకాశం లేకపోలేదని,దీంతో ఈ కాల్వకు సిసి వేసి శాశ్వత మరమ్మత్తులు చేపట్టాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు.

అర్హులకే డబుల్‌బెడ్‌రూమ్‌లు మంజూరుచేయాలి
* నేడు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమావేశం
* గిరిజన యూనివర్సిటిని తరలిస్తే ఆందోళన చేస్తాం
* డిసిసి అధ్యక్షులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్, ఫిబ్రవరి 14: అర్హులైన లబ్ధిదారులందరికి డబుల్‌బెడ్‌రూమ్‌లను మంజూరుచేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు తప్పవని కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టి ఆర్ ఎస్ ప్రభుత్వం నిర్మల్ నియోజకవర్గానికి 400 ఇండ్లు మంజూరుచేసిందని, దీన్ని ఏ నిబంధన ప్రకారం డబుల్‌బెడ్‌రూమ్‌లను కేటాయించారని వారు పేర్కొన్నారు. ఇప్పటికే పది వేల వరకు డబుల్‌బెడ్‌రూమ్ కొరకు లబ్ధిదారులు దరఖాస్తుచేసుకున్నారని, ఇవి ఏమేర సరిపోతాయని ఆయన ప్రభుత్వానికి ప్రశ్నించారు. పాలకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఒకటి రెండు గ్రామాలనే ఎంపికచేస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్రామసభలు నిర్వహించకుండానే రెండు పడక గదుల ఇండ్లను తమ అనుచర వర్గానికి పంపిణి చేయడానికి ప్రయత్నిస్తున్నారిన ఆయన మండిపడ్డారు. జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా గిరిజన యూనివర్సిటిని ఇతర జిల్లాకు తరలించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించకపోవడం స్థానిక పాలకుల వైఫల్యానికి నిదర్శనమన్నారు. టి ఆర్ ఎస్ ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 6 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చినప్పటికి ప్రకటనలకే పరిమితమయ్యారని ఆయన అన్నారు. నేడు నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, గ్రామ మండలస్థాయి నాయకులు, కార్యకర్తలు ఉదయం 10.30 గంటలకు తమ నివాసంలో సమావేశానికి అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తక్కల రమణరెడ్డి, అచ్యుత్‌రావు, రాజేశ్వర్, గంగాధర్, సరికెల గంగన్న, సాద సుదర్శన్, జమాల్, షాహిన్, రాజు, నర్సారెడ్డి, నారాయణరెడ్డి, చందు తదితరులు పాల్గొన్నారు.

ఉసూరుమంటున్న ‘ఉపాధి’హామీ
* అధికారుల నిర్లక్ష్యంతో పడకేసిన పనులు
* రూ.2841 కోట్ల లక్ష్యానికి 219 కోట్లు ఖర్చు
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, ఫిబ్రవరి 14: గ్రామీణ పేదలకు చేతినిండా పనికల్పించి వలసలను నిరోధించేందుకు ప్రభుత్వం ఉదార్త ఆశయంతో ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధిహామీ పథకం అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో జిల్లాలో నీరుగారిపోతోంది. లక్షలాదిమంది కుటుంబాలకు కరవు దుర్భిక్షం సమయంలో ఉపాధి పనులు కల్పించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చాల్సిన అధికార యంత్రాంగం ఉదాసినంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో 52 మండలాల్లో 3436 ఆవాసాలు ఉండగా జిల్లా వ్యాప్తంగా 5,60,389 కుటుంబాలకు జాబ్‌కార్డులు అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టే ఉపాధి పనుల కోసం కూలీలు ఎదురుచూస్తున్న వారికి అధికారులు మాత్రం ఆసరా కల్పించడం లేదు. దీంతో జిల్లా సరిహద్దులోని గ్రామాల కూలీలు పొరుగు మహారాష్టక్రు వలస వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఖరీఫ్, రబీ సీజన్ పంటలు ఆశాజనకంగా లేక జిల్లాలో కరువు పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో కూలీల కోసం అధికారులు వేసవిలో చేతినిండా పనులు కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రణాళికలు, అంచనాలు ఆర్థిక సంవత్సరం మొదట్లో అట్టహాసంగా చూపెడుతున్నా ఆచరణలో మాత్రం డీలా పడిపోతున్నారు. ఇందుకు నిదర్శనంగా 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.2840.89 కోట్లతో 1,29,770 పనులు చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మరో మార్చి మాసం నెలరోజులే మిగిలి ఉన్నా అధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో ఉపాధిహామీ సిబ్బంది అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ అధికారులతో డబ్బులు కాజేస్తున్నట్లు సామాజిక తనిఖీల్లో వెలుగుచూస్తూనే ఉన్నాయి. జిల్లాలో కోట్లాది రూపాయల డబ్బులు కాజేసి ఉపాధి కూలీల పొట్టకొట్టిన అధికారులు సిబ్బంది నుండి నిధుల రికవరీ చేపట్టకపోవడం గమనార్హం. సామాజిక తనిఖీలతో అక్రమాలు బయటపడ్డచోట కేసులు నమోదుచేసి ఉత్తుత్తి చర్యలతోనే అధికారులు సరిపెడుతున్నారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 2840.89 కోట్లతో ఉపాధి పనులు చేపట్టాల్సి ఉండగా ఫిబ్రవరి మొదటి వారం వరకు 219 కోట్లు మాత్రమే ఖర్చుచేసి లక్ష 30 వేల పనులకు గాను 14600 పనులను మాత్రమే పూర్తిచేశారు. వీటిలో కూలీలకు 170 కోట్లు జాబ్‌కార్డుల లెక్కన చెల్లించగా, వీటిలో 35.53 కోట్లు సామాగ్రి కోసం, 14 కోట్లు సిబ్బంది వేతనాలు, నిర్వహణ కోసం ఖర్చుచేశారు. జిల్లాలో 237800 మంది పురుషులు, 262170 మంది మహిళలకు ఉపాధిహామీ కింద పనులు చూపెట్టినట్లు అధికారులు రికార్డుల ద్వారా చూపిస్తున్నారు. ఖరీఫ్, రబీ సీజన్ పూర్తయి పనులు దొరకకా కూలీలు అల్లాడుతుంటే వారికి ఉపాధి చూపకుండా, నిధులు ఖర్చుపెట్టకుండా డ్వామా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. జిల్లాలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా కరువు పరిస్థితులు దాపురించగా చిన్నా, సన్నకారు రైతులు సైతం పంట దిగుబడి రాక నష్టపోయి కూలీ పనులవైపు మొగ్గుచూపుతున్నారు. ఉపాధిహామీ పథకం తమకు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదని గ్రామీణ కూలీలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో 1,19,56,361 పనిదినాలు కల్పించాల్సి ఉండగా ఇప్పటి వరకు 70 వేల 200 మందికి మాత్రమే పనికల్పించారు. ఒక్కో కుటుంబానికి వంద రోజుల పనికల్పించాల్సిన అధికారులు 44 రోజులు మాత్రమే పని కల్పించి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వ లక్ష్యంలో 12 శాతం మాత్రమే పనులు చూపెట్టడంతో సుమారు జిల్లాకు కేటాయించే నిధులు వెనక్కిపోయే పరిస్థితి నెలకొంది. కాగజ్‌నగర్,నిర్మల్, ఆదిలాబాద్, ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో సుమారు 30 గ్రామాల్లో ఇప్పటి వరకు ఒక పని కూడా ప్రారంభించకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. అదేవిధంగా గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద ఇంటింటికి మరుగుదొడ్డి, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశిస్తున్న గ్రామాల్లో మాత్రం మరుగుదొడ్లు నిర్మించుకున్నచోట బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అదేవిధంగా జిల్లాలో 12653 ఇంకుడు గుంతలు మంజూరుకాగా వీటిలో 425 ఇంకుడు గుంతలు చేపట్టారు. ఆర్థిక సంవత్సరం మరికొద్ది రోజుల్లోనే ముగియనున్న నేపథ్యంలో ఉపాధిహామీ పథకం ఆచరణలో అమలుజరగక కాగితాలకే పరిమితం కావడం విమర్శలకు తావిస్తోంది.